Search
  • Follow NativePlanet
Share
» »కడప పెద్ద దర్గాలో జీవ సమాధి ..దర్గా వెనుక అసలు రహస్యాలు

కడప పెద్ద దర్గాలో జీవ సమాధి ..దర్గా వెనుక అసలు రహస్యాలు

కడప పెద్ద దర్గా. ఈ పేరు మీరు చాలా సార్లు వినే వుంటారు. పెద్ద పెద్ద సెలబ్రెటీలు కూడా అక్కడకు వచ్చివెళ్తూ వుంటారు. ఎందుకు అంటే కోరుకున్నది ప్రతీదీ నెరవేరుతుంది అంటారు.

By Venkatakarunasri

అక్కడికి వెళ్లి మొక్కుకుంటే కోరుకున్న ప్రతీదీ నెరవేరుతుంది. ఒకరు ఇద్దరు చెప్పటం కాదు.అందరూ చెప్పుకుంటుంటారు. మరి ఇంతకీ అదెక్కడ.అక్కడ ఏ దేవుడు వున్నాడు. ఇంతకి ఆ వూరు మనకు దగ్గర్లోనే వుంటుందా?

కడప పెద్ద దర్గా. ఈ పేరు మీరు చాలా సార్లు వినే వుంటారు. పెద్ద పెద్ద సెలబ్రెటీలు కూడా అక్కడకు వచ్చివెళ్తూ వుంటారు. ఎందుకు అంటే కోరుకున్నది ప్రతీదీ నెరవేరుతుంది అంటారు. ఇంతకీ దాని వెనకున్న రహస్యమేమిటి?ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కడప పట్టణంలోని నకాష్ వీధి సమీపంలో ఆస్తానయె ఇలాహి ఉంది. దీనినే పెద్ద దర్గా లేక అమీన్ పీర్ దర్గా అంటారు. ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత పేరు గాంచిన దర్గా కావడం వల్ల దీనిని "దక్షిణ భారతదేశపు అజ్మీర్" అంటారు.

ఈ దర్గాకు ఎందరో ప్రసిద్ధులు, సినీ ప్రముఖులు వస్తుంటారు. ఇందిరాగాంధీ, పి.వి. నరసింహారావు, సుశీల్ కుమార్ షిండే, నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, నందమూరి తారకరామారావు, మజ్జి తులసీ దాస్‌, గాయకుడు మహమ్మద్ రఫీ, పంకజ్ ఉధాస్, నారా చంద్రబాబునాయుడు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి, రాష్ట్ర, కేంద్ర మంత్రులు, గవర్నర్లు ఇక్కడి పీఠాధిపతుల ఆశీస్సులను పొంది ఇక్కడ ప్రశాంతతకు ముగ్ధులయ్యారు.

అంతర్జాతీయ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రహమాన్ సమయం చిక్కినప్పడల్లా కుటుంబ సభ్యులతో తరచూ వస్తుంటారు.ప్రముఖ కవులు షకీల్‌ బదాయూని, అర్షద్‌ జైపూర్‌, గవర్నర్‌మోహన్‌లాల్‌ సుకాడీ తదితరులు స్వామి సేవలో పాలుపంచుకున్నారు.

ప్రముఖ హిందీ నటుడు అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వరరాయ్‌, జయాబచ్చన్‌, సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్‌సింగ్‌ దంపతులు పీఠాధిపతుల ఆశీస్సులు పొంది ఇక్కడ ప్రశాంతతకు ముగ్దులయ్యారు. సినీ ప్రముఖులు చిరంజీవి, నితిన్‌, రామ్‌చరణ్‌తేజ, లారెన్స్‌, ఆర్‌పి పట్నాయక్‌, అలీ, బెల్లంకొండ సురేష్‌, చంద్రమహేష్‌, శంకర్‌, ప్రభాకర్‌, దేవిశ్రీప్రసాద్‌, నాగబాబు, గజల్ శ్రీనివాస్, నటుడు ఆమిర్ ఖాన్‌ లాంటి వారు దర్గాను సందర్శించారు.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. దర్గా చరిత్ర

1. దర్గా చరిత్ర

ఈ పెద్ద దర్గా మొదటి సూఫీ (మూలపురుషుడు) హజరత్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మహమ్మదుల్ హుసేనీ చిష్తీవుల్ ఖాద్రీ నాయబ్-ఎ-రసూల్.

PC:youtube

2. దైవాంశ సంభూతుడు

2. దైవాంశ సంభూతుడు

ఈయన ప్రవక్త మహమ్మద్ వంశీయుడు. నిరాడంబరుడు, దైవాంశ సంభూతుడు. ఈయన కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణం నుంచి 1683లో కడపకు చేరుకున్నాడు.

PC:youtube

3. సూఫీ తత్వాలు

3. సూఫీ తత్వాలు

1716లో అమీన్ పీర్ దర్గాలో జీవసమాధి అయ్యాడు. ఈయన సూఫీ తత్వాలు, బోధనలు ప్రజలకు వివరిస్తూ ప్రజాభిమానం పొందాడు. ఈయన శిష్యుడు నేక్ నామ్ ఖాన్. ఈయన కడపను పాలించాడు.

PC:youtube

4. పెద్దదర్గా

4. పెద్దదర్గా

నేక్ నామ్ ఖాన్ తన గురువుకు జీవసమాధి నిర్మించిన పవిత్ర స్థలమే ఈ పెద్దదర్గా. అప్పట్లోనే దర్గా నిర్మించారు.

PC:youtube

5. కడప పీఠాధిపతి

5. కడప పీఠాధిపతి

ఈయన ఇరువురు కుమారుల్లో పెద్ద కుమారుడు ఆరీఫుల్లా హుసేనీ కడప పీఠాధిపతి కాగా మరో కుమారుడు అహమ్మద్‌ హుసేనీ నందలూరు పీఠాధిపతిగా నియమితులయ్యారు.

PC:youtube

6. అరీఫుల్లా హుసేనీ

6. అరీఫుల్లా హుసేనీ

కడప పీఠాధిపతుల మరణానంతరం వారి పెద్ద కుమారుడు పీఠాధిపతిగా కొన సాగుతూ వస్తున్నారు. ఈ పరంపరలో ప్రస్తుతం 11వ పీఠాధిపతిగా అరీఫుల్లా హుసేనీ కొనసాగుతున్నారు.

PC:youtube

7. కఠోర తపస్సు చేసిన మూడవ పీఠాధిపతి

7. కఠోర తపస్సు చేసిన మూడవ పీఠాధిపతి

ఆరీపుల్లా హుసేనీ వారసుడైన హజ్రత్‌ సూఫీ సర్మస్‌సానీ చిల్లకష్‌ ఖ్వాజా సయ్యద్‌షా ఆరీఫుల్లా మహమ్మద్‌ మహమ్ముదుల్‌ హుసేనీసానీ 11వ ఏట ఇంటి నుంచి వెళ్ళి తాడిపత్రి సమీపంలో గుహల్లో 50 సంవత్సరాలు తపస్సు చేశారు.

PC:youtube

8. గండివాటర్‌ వర్క్స్‌

8. గండివాటర్‌ వర్క్స్‌

అటు తర్వాత కడప సమీపంలోని గండి వాటర్‌వర్క్స్‌ గుహల్లో 13 సంవత్సరాలు తపస్సు చేపట్టారు. గండివాటర్‌ వర్క్స్‌ కొండల్లో ఈయన తపస్సు చేస్తున్నట్లు మేకలకాపరి గుర్తించారు.

PC:youtube

9. కాపరి

9. కాపరి

నిత్యం ఒక మేక కొండల్లోకి వెళ్ళి వస్తుండడం కాపరి గమనించాడు. ఒకరోజు దానిని వెంబడించగా తపస్సులో నిమగ్నమై పెద్ద ఎత్తున జడలున్న వ్యక్తి కనిపించారు.

PC:youtube

10. పెద్ద పాము

10. పెద్ద పాము

అంతలోనే ఆయన ఈ విషయం బయట చెప్పవద్దని, చెబితే నీకే అరిష్టమని అన్నాడట. అయితే మేక నిత్యం గుహలోకి వచ్చి ఏమి చేస్తుందని సందేహం వెలిబుచ్చగా ప్రక్కనే వున్న పెద్ద పామును చూపించి దీనికి పాలు ఇస్తున్నట్లు స్వామి వివరించారట.

PC:youtube

11. మేకల కాపరి

11. మేకల కాపరి

ఈ మహత్తును గమనించిన మేకల కాపరి తన తల్లికి కళ్ళు కనిపించవని, ఎలాగైనా కళ్ళు తెప్పించాల్సిందిగా స్వామిని ప్రార్థించారు. స్వామి మేకతో పాటు మీ తల్లిని ఈ ప్రాంతానికి తీసుక రావాల్సిందిగా ఆదేశించారు.

PC:youtube

12. కాపరి తల్లి

12. కాపరి తల్లి

ఆ మేరకు స్వామి దరికి తల్లి, మేకతో పాటు కాపరి చేరుకుంటాడు. మేక పాలతో ఆయన కాపరి తల్లి కళ్ళు శుద్ధి చేసి చూపు తెప్పించారు. అటు తర్వాత కడప దర్గాలో జరుగుతున్న ఉరుసు ఉత్సవానికి ఆమె వస్తుందని, ఉత్సవంలో స్వామి పోలికలు వున్న ఓ మహిళ కనిపించడంతో తదేకంగా ఆమె వంక కాపరి తల్లి చూస్తుందని, విషయం ఏమిటని ప్రశ్నించగా కొండ గుహల్లో మీలాగే ఓ స్వామి ఉన్నారంటూ కాపరి తల్లి వివరిస్తుంది.

PC:youtube

13. ఊరేగింపు

13. ఊరేగింపు

అందరూ ఆ గుహల్లోకి వెళ్ళి చూడగా అక్కడ తపస్సు చేస్తున్నది తన తమ్ముడుగా స్వామి పోలికలతో ఉన్న ఆ మహిళ గుర్తించారు. పెద్ద దర్గాకు రావాల్సిందిగా పీరుల్లా హుస్సేనీ (స్వామి) వంశీయులు కోరుతారు.

PC:youtube

14. పెద్ద దర్గా

14. పెద్ద దర్గా

10 రోజుల అనంతరం వస్తానని చెప్పడంతో అక్కడ నుంచి ఊరేగింపుగా స్వామిని తీసుకు వస్తారు. అదే ఆనవాయితీ నేటికీ కొనసాగుతోంది. ఈ పెద్ద దర్గాకు కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మాన్యాలున్నాయి.

PC:youtube

 15. 8వ గురు పీఠాధిపతి

15. 8వ గురు పీఠాధిపతి

ఆ గురువు సంతతికి చెందినవారు వారసత్వంగా దర్గా పీఠాధిపత్యం చేస్తున్నారు. 8వ గురు పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా అమీనుల్లా మహమ్మద్ మహమ్మదుల్ హుసేనీ చిష్తివుల్ ఖాద్రీ హిందీ, అరబ్బీ, సంస్కృత భాషల్లో గొప్ప పండితుడు.

PC:youtube

16. మహమ్మదుల్ హుసేనీ దర్గా

16. మహమ్మదుల్ హుసేనీ దర్గా

9వ పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మహమ్మద్ మహమ్మదుల్ హుసేనీ దర్గాను బాగా అభివృద్ధి చేశాడు. ముఖ ద్వారం నిర్మించాడు. పూర్వసమాధులను పునర్నిర్మించాడు. ముషాయిరా గదిని నిర్మించాడు. ప్రవక్త చిహ్నాలను ప్రదర్శించే భవనాన్ని నిర్మించాడు.

PC:youtube

17. ఉరుసుఉత్సవం

17. ఉరుసుఉత్సవం

అమీన్‌పీర్‌ దర్గాలో పెద్ద, చిన్న కలిపి మొత్తం 18 దర్గాలు ఉన్నాయి. ప్రతి నెల గంథం, ఉరుసు ఇక్కడ జరుగుతోంది.వాటిలో పీరుల్లా మాలిక్‌ హుసేనీ ఉరుసు ఉత్సవం ఉర్దూ నెల ప్రకారం మొహర్రం నెలలో జరుగుతోంది.

PC:youtube

18. మదార్‌ నెల

18. మదార్‌ నెల

ఆరీపుల్లా హుస్సేనీ ఉరుసు ఏడు రోజుల పాటు ‘మదార్‌' నెలలో నిర్వహిస్తారు. దాదా ముర్షాద్‌ అమీనుల్లా హుసేనీ ఉరుసును ఖాదర్‌ నెలలో, హేదుల్లా హుసేనీ ఉరుసు రంజాన్‌ మాసంలో నిర్వహిస్తారు.

PC:youtube

19. వేలాది మంది భక్తులు

19. వేలాది మంది భక్తులు

అలాగే అమీనుల్లా హుస్సేనీ ఉరుసు తేరాతేజీ నెలలో భారీ ఎత్తున నిర్వహిస్తారు. ఈ దర్గాను సందర్శించడానికి వేలాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ తదితర సుదూర రాష్ట్రాల నుంచీ వస్తుంటారు.

PC:youtube

20. భక్తులు

20. భక్తులు

ఈ పీఠానికి దేశమంతటా 27 లక్షల మంది శిష్యులున్నట్లు ఇక్కడి ప్రతినిధులు చెబుతారు. మన దేశం నుంచేగాక గల్ఫ్‌ దేశాల నుంచి కూడా భక్తులు దర్గాను దర్శించుకుంటారు.

PC:youtube

21. ఉరుసు

21. ఉరుసు

ఏటా దర్గా ఉరుసు కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతుంది. కుల, మత, వర్గ, భేదాలు లేకుండా ఆనందోత్సాహాల మధ్య ఉరుసు జరుగుతుంది. ఈ ఉరుసును ప్రతి సంవత్సరం ఉర్దూ మాసం 'మదార్' లో నిర్వహిస్తారు.

PC:youtube

భేద భావం లేకుండా

భేద భావం లేకుండా

ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. భక్తులకు సూఫీతత్వ ఉపదేశాలిస్తారు. ఈ ఉరుసులో హిందువులు, మహమ్మదీయులు అనే భేద భావం లేకుండా సర్వులూ పాల్గొంటారు.

PC:youtube

23. కవి సమ్మేళనం

23. కవి సమ్మేళనం

దైవం మీద నమ్మకం, మానవులందరూ ఒకటే అన్న భావం ఇక్కడ గుబాళిస్తుంది. ఉరుసు సందర్భంగా పెద్ద ఎత్తున ముషాయెరా (కవి సమ్మేళనం) జరుగుతుంది. ఈ కవిసమ్మేళనానికి దేశం నలుమూలల నుంచి కవులు వస్తారు.

PC:youtube

24. కలిచెర్ల గ్రామం

24. కలిచెర్ల గ్రామం

ఈ పెద్ద దర్గాకు రెండు శాఖలున్నాయి. నందలూరులో ఒకటి, రెండోది చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలంలోని కలిచెర్ల గ్రామంలో ఉంది.

PC:youtube

25. మత సామరస్యం

25. మత సామరస్యం

మతాలకతీతంగా హిందు, ముస్లిం, క్రైస్తవులు నిత్యం పెద్ద దర్గాను సందర్శించుకొని ప్రార్థనలు నిర్వహిస్తుండడం వల్ల ఈ దర్గా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. సాహెబ్‌ (స్వామి) ను నమ్ముకొని ప్రార్థించి దర్గా విబూది తీర్థం సేవిస్తే సర్వ వ్యాధులు హరిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

PC:youtube

26. ఎందరో ప్రసిద్ధులు

26. ఎందరో ప్రసిద్ధులు

ఈ దర్గాకు ఎందరో ప్రసిద్ధులు, సినీ ప్రముఖులు వస్తుంటారు. ఇందిరాగాంధీ, పి.వి. నరసింహారావు, సుశీల్ కుమార్ షిండే, నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, నందమూరి తారకరామారావు, మజ్జి తులసీ దాస్‌, గాయకుడు మహమ్మద్ రఫీ, పంకజ్ ఉధాస్, నారా చంద్రబాబునాయుడు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి, రాష్ట్ర, కేంద్ర మంత్రులు, గవర్నర్లు ఇక్కడి పీఠాధిపతుల ఆశీస్సులను పొంది ఇక్కడ ప్రశాంతతకు ముగ్ధులయ్యారు.

PC:youtube

27. అంతర్జాతీయ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రహమాన్

27. అంతర్జాతీయ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రహమాన్

అంతర్జాతీయ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రహమాన్ సమయం చిక్కినప్పడల్లా కుటుంబ సభ్యులతో తరచూ వస్తుంటారు.ప్రముఖ కవులు షకీల్‌ బదాయూని, అర్షద్‌ జైపూర్‌, గవర్నర్‌మోహన్‌లాల్‌ సుకాడీ తదితరులు స్వామి సేవలో పాలుపంచుకున్నారు.

PC:youtube

28. ఎందరో సినీ ప్రముఖులు

28. ఎందరో సినీ ప్రముఖులు

ప్రముఖ హిందీ నటుడు అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వరరాయ్‌, జయాబచ్చన్‌, సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్‌సింగ్‌ దంపతులు పీఠాధిపతుల ఆశీస్సులు పొంది ఇక్కడ ప్రశాంతతకు ముగ్దులయ్యారు. సినీ ప్రముఖులు చిరంజీవి, నితిన్‌, రామ్‌చరణ్‌తేజ, లారెన్స్‌, ఆర్‌పి పట్నాయక్‌, అలీ, బెల్లంకొండ సురేష్‌, చంద్రమహేష్‌, శంకర్‌, ప్రభాకర్‌, దేవిశ్రీప్రసాద్‌, నాగబాబు, గజల్ శ్రీనివాస్, నటుడు ఆమిర్ ఖాన్‌ లాంటి వారు దర్గాను సందర్శించారు. తరచూ సినీ ప్రముఖుల సందర్శనలు సర్వసాధారణం.

PC:youtube

29. ఎలా వెళ్ళాలి

29. ఎలా వెళ్ళాలి

ఎలా వెళ్ళాలి ?

హైదరాబాద్ నుండి కర్నూల్ మీదుగా 7 గంటల 20 నిమిషములు పడుతుంది.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+