Search
  • Follow NativePlanet
Share
» »న‌ల్ల‌మ‌ల వ‌జ్రాల కొండ గుహ లో దాగిన మహా అద్భుతం !

న‌ల్ల‌మ‌ల వ‌జ్రాల కొండ గుహ లో దాగిన మహా అద్భుతం !

By Staff

LATEST: ఉదయగిరి కొండపై సుదర్శన చక్ర దర్శనం - బ్రహ్మంగారి కాలజ్ఞానం

నల్లమల అడవులు భారత దేశ అడవులలో ప్రధానమైనది. ఈ అడవులు తెలంగాణ రాష్ట్రం లోని మహబూబ్ నగర్, నల్గొండ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని కర్నూలు, కడప, ప్రకాశం మరియు గుంటూరు జిల్లాలలో విస్తరించి ఉన్నది. ఈ అడవులు కృష్ణా, పెన్నా నదుల మధ్యలో ఉత్తర మరియు దక్షిణ దిక్కులో విస్తరించి ఉంది.

మీలో చాలా మంది కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ఒకటైన అహోబిలం చూసి ఉంటారు అవునా..! అదికూడా ఒక్క రోజులోనే ఏదో వీకెండ్ లో అలా వెళ్ళి వస్తుంటారు. ఒక వేళ ఫ్యామిలీ తో గాని, చుట్టుపక్కల కుటుంబాల తో గాని ట్రిప్ వేసుకొని వస్తే అహోబిలం, మహానంది చూస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఆధ్యాత్మిక పర్యటన చేసినట్లుంటుందని శ్రీశైలం - మహానంది - అహోబిలం రెండురోజులకో లేక మూడు రోజులకో ప్లాన్ చేసుకొని వస్తుంటారు.

ఇక్కడ మనం మాట్లాడేది అహోబిలం కనుక, అహోబిలం లో మీరు ఏమి చూశారు లేదా చూస్తారు అంటే .. మీరు ఠక్కున చెప్పే సమాధానం ముందుగా ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం. ఇంతేనా ..! ఒకవేళ మీరు బాగా అహోబిలం 10 సార్లు చూసినవారైతే వీటితో పాటు నవ నరసింహ గుళ్ళు, ప్రహ్లాద బడి (కొండపై నుండి నీళ్ళు పడుతూ చాలా ఆహ్లాదంగా ఉండే గుహ), మఠం, ఉగ్ర నరసింహుడు చీల్చుకువచ్చిన స్తంభం ఇలా ఏవేవో చెబుతారు ఆగండి ... ఆగండి .. ఇంక చాలు.

ఆల్ మోస్ట్ అహోబిలం వచ్చే పర్యాటకులు ఇవే చూస్తారు అనుకోండి ..! కానీ ఇక్కడ మీకు చాలా వరకు తెలియని, కొద్ది పాటి భక్తులకు మాత్రమే (స్థానిక ప్రజలకు) తెలిసిన ఒక ఆలయం ఉంది. వాళ్ళు కూడా కేవలం కార్తీక మాసంలోనే ఈ ఆలయాన్ని దర్శిస్తారు. ఎందుకంటే ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే గొప్ప సాహసమే చేయాలి మరి ...! ఆది కూడా వర్షాకాలం ఏమాత్రం వెళ్ళకూడదు. వెళ్ళారా ఇక అంతే సంగతులు.. సెల్ ఫోన్ లు పనిచేయవు, రాత్రి పూట బిక్కు బిక్కు మంటూ ఉండటం, తిండి ఉండదు కనీసం తాగటానికి మినరల్ వాటర్ బాటిల్ కూడా దొరకదు. ఎక్కడ పులులు, సింహాలు వచ్చి మీద పడతాయని భయం. కనుక జాగ్రత్తగా వెళ్ళాలి అదికూడా ఇతరుల సహకారంతో ... ఇక అసలు విషయానికి వద్దాం ..

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

కొండ పక్కన దారి

కొండ పక్కన దారి

మీకు చెప్పబోయే ఈ ప్రదేశం, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలో ఉన్న అహోబిలంలో వెలసిన లక్ష్మి నరసింహ స్వామి దేవాలయానికి ముందు మూడు కిలోమీటర్ల దూరంలో ఎడమ పక్కన ఒక కొండ దారి ఉంది.

Photo Courtesy: RB Venkata Reddy

ఉమామహేశ్వర స్వామి గుహ

ఉమామహేశ్వర స్వామి గుహ

కొండ దారి గుండా వెళితే మీరు నల్లమల అడవులలోకి ప్రవేశిస్తారు. ఈ నల్లమల అడవులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య అటవీ సంపద చేకూర్చే అడవులు. మీరు వెళుతున్న మార్గంలో పెద్ద పెద్ద ఎత్తైన కొండలు, ఎక్కడ కిందపడిపోతామో అనే విధంగా అనిపించే లోయలు, చిన్న చిన్న పిల్ల కాలువలు, వాటి నుండి వేరు పడిన సెలయెర్లు, శబ్ధం చేసుకుంటూ ఎత్తు నుండి జాలు వారే జలపాతాల నడుమ ఒక గుహ ఉంది.

Photo Courtesy: RB Venkata Reddy

లింగమయ్య

లింగమయ్య

కొండ గుహలో కొన్ని వందల ఏళ్ల క్రితమే ఉల్లెడ ఉమామహేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈయన ఇక్కడ లింగమయ్య స్వామి రూపంలో భక్తులచే పూజలు అందుకుంటున్నాడు.

Photo Courtesy: RB Venkata Reddy

గుహ వైపు వెళ్లే దారి

గుహ వైపు వెళ్లే దారి

ఇక్కడున్న లింగమయ్య స్వామిని దర్శించుకోవడమంటే, ఎక్కడో భారత దేశ సరిహద్దులో ఉన్న అమర్‌నాథ్ క్షేత్రం లో గుహలో ఉన్న మంచు లింగాన్ని దర్శించుకోవడమే అని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం.

Photo Courtesy: RB Venkata Reddy

ప్రయాణంలో వాగులు, వంకలు దాటుతూ

ప్రయాణంలో వాగులు, వంకలు దాటుతూ

దట్టమైన అడవిలో అప్పుడే విచ్చుకున్నట్లుండే పూల సువాసన ల నడుమ, పక్షుల కిల కిల రాగాల నడుమ, పింఛం విప్పి నాట్యం చేస్తున్న నెమాళ్ల నడుమ, కళ్ళతో ఎప్పుడూ చూడని అందాలాన్ని ఒకే చోట చూస్తూ ... కనువిందు చేసే ఈ ప్రాంతాన్ని చూసి ఈర్శ కలగాల్సిందే ఎవ్వరికైనా ..

Photo Courtesy: RB Venkata Reddy

దారిలో రాళ్లు, రప్పలు

దారిలో రాళ్లు, రప్పలు

ఇంతటి అద్భుత అందాల నడుమ .. స్వర్గం అంటే ఏమిటో తెలియని పర్యాటకులకు, భక్తులకు కొండల్లో దాగి ఉన్న మహాశివుని దర్శనం ఒక అద్భుతమైన మాధురానుభూతి కలిగించే యాత్ర అని చెప్పక తప్పదు.

Photo Courtesy: RB Venkata Reddy

ఒకే గుహలో మూడు గుహలకు ఒకే దారి

ఒకే గుహలో మూడు గుహలకు ఒకే దారి

నల్లమల అడవిలో ఉన్న ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి గుహని వజ్రాల కొండ గుహ అని పిలుస్తారు. ఈ వజ్రాల కొండ గుహాల్లో మూడు గుహలు ఉన్నాయి. అవి వరుసగా ఉల్లెడ నరసింహ స్వామి గుహ, ఆశ్వ‌థ్దామ గుహ‌, ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ.

Photo Courtesy: RB Venkata Reddy

స్వయంభూ శివలింగం, 3 తలల నాగుపాము ,శంకు, వీణ

స్వయంభూ శివలింగం, 3 తలల నాగుపాము ,శంకు, వీణ

ఉల్లెడ మహేశ్వర స్వామి గుహలో ఒక శివలింగం, మూడు పడగల నాగపాము, శంకు మరియు వీణ స్వయంభూ గా వెలిశాయి. ఈ గుహలో ఉన్న శివలింగం పై నిత్యం ధారాళంగా అదికూడా మంచు నీరు పడుతుంది. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున పార్వతమ్మ తీర్థం నుండి ఐదు తలల నాగపాము వచ్చి, శివలింగాన్ని చుట్టుకొని అభిషేకం చేస్తుంది.

Photo Courtesy: RB Venkata Reddy

పార్వతమ్మ తీర్థం

పార్వతమ్మ తీర్థం

ఉమా మహేశ్వర స్వామి కొండ లో ప్రధానమైనది పార్వతమ్మ తీర్థం. పార్వతమ్మ తీర్థం కి ఉన్న మహత్యం ఏమిటంటే ఈ పుణ్య తీర్థంలో స్నానాలు చేసినట్లయితే సర్వాపాపాలు పోయి, పుణ్యం వరిస్తుంది. అలాగే కన్య లకు మంచి భర్త, పిల్లలు లేని వారికి పిల్లలు, వైకుంఠ ప్రాప్తి, మోక్ష ప్రాప్తి, సకల భోగభాగ్యాలు సిద్డిస్తాయి.

Photo Courtesy: RB Venkata Reddy

అద్భుత జలపాతం

అద్భుత జలపాతం

ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి దెవ‌స్థానం కొలువుదీరిన కొండ గుహ కు అనుకుని, కొండపై భాగం నుంచి పార్వ‌త‌మ్మ‌ తల్లి స్వామి పాదాలను తాకేలా వందల అడుగుల ఎత్తులో శివుడి జటాజుటం నుండి .. ఉరకలేస్తూ... దూకుతున్న దృశ్యం ఓ మహాద్భుతం. పున్నమి రోజుల్లో చంద్రుడు విరజిమ్మే వెన్నెల కాంతి పెరుగుతున్న కొద్దీ ఈ జలపాతం ధార కూడా ఉధృతంగా పెరుగుతూ ఉంటుందని ఇక్కడికి వచ్చే యాత్రికులు చెబుతారు.

Photo Courtesy: RB Venkata Reddy

పవిత్ర గుండం

పవిత్ర గుండం

పున్నమి వెన్నెల ప్రకశించే వేళ, ఆ .. అద్భుత జలపాతాల నుంచి వచ్చిన ఔషధగుణాలున్న నీటితో ఏర్పడ్డ గుండంలో పున్నమి నాడు రాత్రి వేళ చంద్రకాంతి విరజిమ్ముతున్న సమయంలో స్నానమా ఆచరిస్తే ... వ్యాధులు ఏవీ దగ్గరికిరావని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇలా స్నానమాచరించి లింగమయ్యని దర్శించుకుంటే తాము కోరుకున్న కోర్కెలు తీరటంతో పాటు పాపాలు కూడా తొలిగిపోతాయన్న నమ్మకం ఇక్కడికి వచ్చే భక్తులలో ఉంది.

Photo Courtesy: RB Venkata Reddy

వర్షాకాలం కష్టం

వర్షాకాలం కష్టం

ఉల్లెడ మహేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే వారు పర్యాటకులైతేనేమి, భక్తులైతేనేమి గాని, వర్షాకాలంలో వెళ్ళకూడదు ఎందుకంటే .. వర్షాకాలంలో అడవి అంతా అల్లకల్లోలంగా ఉంటుంది భీకర పిడుగుల శబ్ధాలు, భయంకరమైన గాలులు, తీవ్రమైన వర్షం తో వాతావరణం అంతగా అనుకూలంగా ఉండదు అంటే దీనర్థం అడవిలో క్షణ క్షణం వాతావరణం మారుతూ ఉంటుంది. వర్షం కురిస్తే అడవి నుండి బయటకి రావడం చాలా చాలా కష్టం.

Photo Courtesy: RB Venkata Reddy

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ..

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ..

ఉల్లెడ మహేశ్వర స్వామి కొండ గుహకు ట్రాక్టర్లపై వెళుతున్న భక్తులు

Photo Courtesy: RB Venkata Reddy

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ..

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ..

ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి కొండ గుహ వెళ్లే దారిలో దారి పొడవునా కనిపించే రకరకాల పూల మొక్కలు

Photo Courtesy: RB Venkata Reddy

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ..

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ..

ఉల్లెడ మహేశ్వరస్వామి లేదా వజ్రాల కొండ గుహ కు వెళ్ళేటప్పుడు కనిపించే దిగువ ఉల్లెడ వాగు

Photo Courtesy: RB Venkata Reddy

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

చెట్టు కొమ్మల మధ్యలో అటవీ శాఖ వారిచే ముద్రించబడిన జి. పి. యస్. గుర్తు గల బోర్డు

Photo Courtesy: RB Venkata Reddy

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి కొండ గుహకు వెళ్లే మట్టి దారి

Photo Courtesy: RB Venkata Reddy

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి కొండ గుహకు వెళ్లే మార్గంలో కనిపించే ఎగువ ఉల్లెడ వంక

Photo Courtesy: RB Venkata Reddy

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి కొండ గుహకు వెళ్లే మార్గంలో కనిపించే కాసిరెడ్దినాయిన ఆశ్రమం

Photo Courtesy: RB Venkata Reddy

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి కొండ గుహ లేదా వజ్రాల కొండలో పార్వతిఅమ్మ విగ్రహం

Photo Courtesy: RB Venkata Reddy

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి కొండ గుహ లేదా వజ్రాల కొండలో పురాతన విగ్రహాలు

Photo Courtesy: RB Venkata Reddy

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి కొండ గుహ లేదా వజ్రాల కొండలో పురాతన నంది విగ్రహం

Photo Courtesy: RB Venkata Reddy

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి కొండ గుహ లేదా వజ్రాల కొండలో పురాతన శివాలయం

Photo Courtesy: RB Venkata Reddy

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి కొండ గుహ లేదా వజ్రాల కొండలో ఈబుది నారాయణస్వామి సమాధి

Photo Courtesy: RB Venkata Reddy

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి కొండ గుహ లేదా వజ్రాల కొండలో శివ గంగ విగ్రహాలు

Photo Courtesy: RB Venkata Reddy

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి కొండ గుహ లేదా వజ్రాల కొండలో గుహ వైపు పోయే దారి

Photo Courtesy: RB Venkata Reddy

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి కొండ గుహ లేదా వజ్రాల కొండలో కొండపై నుంచి అమ్మవారి గుడి

Photo Courtesy: RB Venkata Reddy

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి కొండ గుహ లేదా వజ్రాల కొండలో గుహ లోపల ఉన్న కాళిఅమ్మ వారి విగ్రహం

Photo Courtesy: RB Venkata Reddy

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి కొండ గుహ లేదా వజ్రాల కొండలో గుహ లోపల ఆలయ పూజారి

Photo Courtesy: RB Venkata Reddy

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి కొండ గుహ లేదా వజ్రాల కొండలో గుహ లోపలికి వెళ్లే దారి కేవలం 1.5 అడుగుల ఎత్తు మాత్రమే ఉంటుంది. కేవలం ఒక్కొక్కరుగా మాత్రమే దూరి లోనికి వెళ్ళాలి.

Photo Courtesy: RB Venkata Reddy

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి కొండ గుహ లేదా వజ్రాల కొండలో గుహ లోపల ఉన్న కాళి అమ్మవారిని పూజించడానికి వచ్చిన భక్తులు

Photo Courtesy: RB Venkata Reddy

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి కొండ గుహ లేదా వజ్రాల కొండలో ఈబుది నారాయణ స్వామి తపస్సు చేసిన చోటు

Photo Courtesy: RB Venkata Reddy

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి కొండ గుహ లేదా వజ్రాల కొండలో సాహసం చేసుకుంటూ స్వామి చెంతకు చేరుకుంటున్న భక్తులు

Photo Courtesy: RB Venkata Reddy

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి కొండ గుహ లేదా వజ్రాల కొండలో పార్వతమ్మ తీర్థం వైపు ప్రయాణం చేస్తూ

Photo Courtesy: RB Venkata Reddy

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి కొండ గుహ లేదా వజ్రాల కొండలో ఒక పక్క వేడి నీళ్ళు మరోపక్క చల్ల నీళ్ళ తో పార్వతమ్మ తీర్థం జలధార

Photo Courtesy: RB Venkata Reddy

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి కొండ గుహ లేదా వజ్రాల కొండలో సువాసన కలిగిన ఎరుపు రంగు పూలు

Photo Courtesy: RB Venkata Reddy

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి కొండ గుహ లేదా వజ్రాల కొండలో వినాయక స్వామి విగ్రహం

Photo Courtesy: RB Venkata Reddy

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

మరిన్ని ఆకర్షణీయమైన దృశ్యాలతో ...

ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి కొండ గుహ లేదా వజ్రాల కొండలో సహజ సిద్ధంగా ఏర్పడ్డ శివ పార్వతుల విగ్రహం

Photo Courtesy: RB Venkata Reddy

సూచన

సూచన

అడవి మీద మంచి అవగాహన ఉన్న స్థానిక ప్రజలలో ఒకరిని తీసుకొని బయలుదేరాలి. ఇలాంటి చోటికి స్నేహితులతో వెళితే థ్రిల్లింగా ఉంటుంది. ఫ్యామిలీ తో కూడా వెళ్ళవచ్చు అనుకోండీ .! తిరుపతి కొండ ఎక్కెటప్పుడు దారి మధ్యలో ఉన్నట్లు తినుబండారాలు, హోటళ్లు ఉంటాయని ఆలోచించుకోవడం వెర్రి భ్రమ. అసలు ఆలోచించడమే వేస్ట్.

Photo Courtesy: RB Venkata Reddy

సూచన

సూచన

కనుక శుభ్రంగా మూడు - నాలుగు పెద్ద గిన్నెల క్యారేర్ బాక్స్ తీసుకొని వెళితే మంచిది. దారి మధ్యలో మంచింగ్ కోసమని ఆ లేస్, కుర్ కురే, క్రీమ్ బిస్కట్ వంటి నానా వస్తువులు తీసుకోకుండా కాల్చిన మొక్కజొన్న, పెన్నం మీద వేయించిన పెసలు, వేరుశనగ బుడ్డలు ఇలాంటివి తీసుకొని వెళితే ఆ వచ్చే కిక్కె వేరప్ప.. హలో హలో కిక్ అని చెప్పి బ్రాంది, విస్కీ వంటి తీసుకొనిపోయెరు.

Photo Courtesy: RB Venkata Reddy

ఎలా వెళ్ళాలి

ఎలా వెళ్ళాలి

మీకు ముందే చెప్పాను కదా..! మూడు కిలో మీటర్ల దూరంలో కొండ పక్కన దారి ఉన్నది అని. గతంలో అయితే కాలి నడక మార్గాన 20 కి. మీ. రాళ్లు, రప్పల నడుమ ఇరుకిరుకు కాలిబాటలో నడిస్తే గాని ఉల్లెడ మహేశ్వర స్వామి వద్దకి చేరుకోలేని పరిస్థితి ఉండేది. కానీ ఇక్కడికి వచ్చే స్థానిక ప్రజలు, భక్తులు, అడవి అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులు పెరగడం తో రవాణా గతం తో పోల్చుకుంటే కాస్త బెటార్. ఉమా మహేశ్వర స్వామి దేవస్థానం లోయ వరకు వాహనాలు వెళ్లే విధంగా చిన్న చిన్న రాళ్ళ బాటలు ఉన్నాయి.

Photo Courtesy:anu partha

ఎలా వెళ్ళాలి

ఎలా వెళ్ళాలి

ఇక్కడికి ఫ్రెండ్స్ తో బైకు లలో వెళితే తిప్పలు లేకుండా జాలీగా వెళ్ళవచ్చు. మార్గ మధ్యలో ప్రకృతి అందాలను పెద్దగా కళ్ళు విప్పి చూడవచ్చు. హాయిగా, చల్లని గాలుల మధ్యలో తేలిపోయినట్లు ఉండే ఈ సాహస యాత్ర ని, దైవ దర్శనాన్నిమీరు కూడా తప్పక చేస్తారు కదూ ..!

Photo Courtesy: anu partha

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more