Search
  • Follow NativePlanet
Share
» »అందమైన గుజరాత్ కోస్తా తీరం

అందమైన గుజరాత్ కోస్తా తీరం

గుజరాత్ రాష్ట్ర కోస్తా తీరం సుమారుగా 1660 కి. మీ. ల కంటే ఎక్కువ. అన్ని రాష్ట్రాలలో కంటే ఇది పొడవైనది. తీరం లో ఎన్నో బీచ్ లు, సుందర తీర భూములు, బీచ్ పాలస్ లు మరియు తీర దేవాలయాలు కలవు. ఈ కోస్తా తీరం మీకు చక్కటి విశ్రాంతి సెలవులను ఇచ్చి అనేక సుందర దృశ్యాల తో ఆనందింప చేస్తుంది. అనేక నీటి క్రీడలకు, అడ్వెంచర్ లకు, స్విమ్మింగ్, బోటింగ్, ల నుండి ప్రశాంత సన్ బాత్ లు లేదా తీరంలో కాలి నడక వంటివి ఎన్నో చేయవచ్చు. గుజరాత్ బీచ్ లు పర్యాటకులకు అన్ని రకాల ఆనందాలు ఇస్తాయి. అందుకనే ప్రతి సంవత్సరం గుజరాత్ బీచ్ లకు వచ్చే వారి సంఖ్య పెరిగి పోతోంది.

మీరు గుజరాత్ వెళ్ళినపుడు చూడవలసిన ప్రధాన బీచ్ లు.
అహమ్మద్ పూర్ మాండవి బీచ్
గుజరాత్ లో ఇది ఒక అందమైన బీచ్. ఇసుకలో చక్కని కాలి నడక చేయవచ్చు. నీరు స్విమ్మింగ్ కు బాగుంటుంది. ఇక్కడ కల డాల్ఫిన్ చేపల సందర్సన, నీటి క్రీడలు ఈ బీచ్ ని ప్రసిద్ధి చేసాయి.

బీచ్ ఎలా చేరాలి ?
ఈ బీచ్ సోమనాథ్ టెంపుల్ కు 80 కి. మీ. ల దూరంలో వుంటుంది. బీచ్ చేరేందుకు బస్సు లు టాక్సీ లు లభ్యంగా వుంటాయి. ఇక్కడి వసతులు పర్యాటకులకు మరువ లేని వసతి అనుభవాలను అందిస్తాయి.

అందమైన గుజరాత్ కోస్తా తీరం

చోర్ వాడ బీచ్
చోర్ వాడ బీచ్ కు ఇండియా లోని అన్ని ప్రాంతాల నుండి ప్రపంచం లోని వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు కూడా వస్తారు. దీనికి కారణం, ఇక్కడ కల సుందర దృశ్యాలు, క్రిస్టల్ బ్లూ వాటర్. పోర్ బందర్, సోమనాథ్ వెళ్లేందుకు ఈ బీచ్ ఒక గేటు వే గా కూడా వుంది. చక్కని అలలపై బోటు రైడ్ చేసి ఆనందిన్చాలనుకునే వారికి ఇది మంచి బీచ్. బీచ్ ఎలా చేరాలి ? సోమనాథ్ నుండి 37 కి. మీ. ల దూరంలో కల ఈ బీచ్ కు టాక్సీ లు, బస్సు లు లభ్యంగా వుంటాయి.

ఎక్కడ వసతి పొందాలి ? ఇక్కడ అనేక రకాల వసతి గృహాలు కలవు. ఎవరి కి కావలసిన బడ్జెట్ లో వారికి వసతి దొరుకుతుంది.


మాండవి బీచ్, కచ్
ఈ బీచ్ ని చూడంగానే చాలామంది మొదటి చూపులోనే అద్భుతమైన అందాలు కలది గా భావిస్తారు. పర్యాటకులకు ఇక్కడ తాజా కొబ్బరి బొండాలు, స్నాక్స్ లభిస్తాయి. కోస్తా తీర దృశ్యాలు ఆనందిస్తూ నీటిలో స్విమ్ చేయవచ్చు. ప్రైవసీ అధికంగా కోరుకునే వారికి పక్కనే కల మహారావు బీచ్ అనువైనది. స్విమ్మింగ్ కు మంచి నీరు, లక్సరీ ఎయిర్ కండిషన్ టెంట్ లు కలవు.
ఎలా చేరాలి ? ప్రభుత్వ బస్సు లు, జీపు లు, భుజ నుండి ప్రతి అర గంటకు కలవు. స్థానిక ఎక్స్ కర్శన్లకు భుజ నుండి జీపులు అద్దెకు పొందవచ్చు.

బెయాట్ ద్వారక
బెయాట్ ద్వారక ఒక చిన్న ద్వీపం. ఒఖా పోర్ట్ అభివృద్ధి చేయక ముందు ఇది ప్రధాన పోర్ట్ గా వుండేది. ఇక్కడ మీరు డాల్ఫిన్ చేపలు చూడవచ్చు. మేరైన్ విహారాలు, పిక్నిక్ లు కామ్పింగ్ లు చేయవచ్చు. బీచ్ సమీపంలో 500 ఏళ్ల నాటి ఒక పురాతన శ్రీ కృష్ణ మరియు హనుమాన్ దేముల్ల టెంపుల్స్ కలవు. ఈ బీచ్ కి ఎలా చేరాలి ? పర్యాటకులు ద్వారక నుండి 32 కి. మీ. ల దూరంలో గల ఈ బీచ్ ని రోడ్డు లేదా రైలు మార్గాలలో చేరవచ్చు. వసతి ఎక్కడ పొందాలి? బీచ్ కి సమీపంలో అనేక హోటళ్ళు కలవు. ఈ హోటళ్ళు అన్ని బడ్జెట్ ల వారికి అందుబాటులో వుంటాయి. వీటిలో అద్భుత వసతి సౌకర్యాలు కలవు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+