Search
  • Follow NativePlanet
Share
» »ఇండియాలోని ఈ విమానాశ్రయాలు త్వ‌ర‌లో ర‌న్‌వే ఎక్క‌నున్నాయి..

ఇండియాలోని ఈ విమానాశ్రయాలు త్వ‌ర‌లో ర‌న్‌వే ఎక్క‌నున్నాయి..

ఇండియాలోని ఈ విమానాశ్రయాలు త్వ‌ర‌లో ర‌న్‌వే ఎక్క‌నున్నాయి..

భారతదేశం చాలా విషయాల్లో పురోగమిస్తోంది. ఇప్పుడు విమానాశ్రయాల‌ను నిర్మించే ప్రణాళికలు కూడా అందులో చేర్చబడ్డాయి. చౌక విమానాలను అందించడానికి 2016లో కేంద్ర ప్రభుత్వం ఉడే దేశ్ కా ఆమ్ నాగ్రిక్ (ఉడాన్) అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ ప‌థ‌కం ప్ర‌కారం త్వరలో ప్రయాణికులు త‌క్కువ ధరల‌తో విమానంలో ప్రయాణించగలుగుతారు. ప్రజల కోసం త్వరలో ప్రారంభించనున్న ఈ విమానాశ్రయాల గురించి తెలుసుకుందాం. వీటిలో నోయిడా, ముంబై, పూణే వంటి నగరాలు ఉన్నాయి. ఈ విమానాశ్రయాలు 2024 నాటికి ర‌న్‌వే ఎక్కే ఆలోచ‌న‌లో ఉన్నాయి. వాటి గురించి మ‌రిన్ని విష‌యాల‌ను తెలుసుకుందాం ప‌దండి.

jewarairportnoida1

జేవార్ విమానాశ్రయం, నోయిడా

నోయిడాలో ఉన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా రూపుదిద్దుకోనుంది. జెవార్ విమానాశ్రయం యొక్క మొదటి దశ 2024 చివరి నాటికి పూర్తిచేయాల‌నుకుంటున్నారు. ఈ విమానాశ్రయం ఆరు రన్‌వేలను కలిగి ఉంది. ఈ విమానాశ్ర‌యం ఇందిరా గాంధీ అంతర్జాతీయ (IGI) విమానాశ్రయం, ఢిల్లీలో రద్దీని తగ్గిస్తుంది. ఈ విమానాశ్ర‌యం ఢిల్లీ, హైద‌రాబాద్ విమానాశ్ర‌యాల త‌ర‌హాలో ఏరో సిటిని క‌లిగి ఉంటుంది. 172 ఎకరాల్లో విస్త‌రించి ఉన్న ఈ ఏరో సిటిలో హోట‌ల్లు, రెస్టారెంట్లు, బార్‌లు, షాపింగ్ సెంట‌ర్లు, ఇత‌ర వినోద సౌక‌ర్యాలు ఉంటాయి. ఏరోసిటిల్లో ప్రస్తుతం హైద‌రాబాద్ ఏరోసిటి అతిపెద్ద‌ది ఇది 1500 ఎక‌రాల‌లో విస్త‌రించి ఉంది. త‌రువాత ఢిల్లీ 200 ఎక‌రాల్లో నిర్మించ‌బ‌డింది.

navimumbaiinternationalairportmaharashtra1

నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, మహారాష్ట్ర

భార‌త‌దేశంలోని మ‌హారాష్ర్ట‌లోని న‌వీ ముంబైలో నిర్మించ‌బ‌డుతున్న అంతర్జాతీయ విమానాశ్ర‌యం. ఇది ముంబై యొక్క ప్రస్తుత ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి ప్ర‌త్యామ్నాయంగా ప‌నిచేస్తుంది. ఇది ముంబై మెట్రోపాలిట‌న్ ప్రాంతంలో రెండ‌వ విమానాశ్ర‌యంగా మారుతుంది. ఈ విమానాశ్ర‌యం గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం. దీనిని సిటి అండ్ ఇండస్ట్రియ‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ నిర్మిస్తోంది. ఇది మూడు ద‌శ‌లో నిర్మించ‌బ‌డుతోంది. మొద‌టిద‌శ‌లో ఏడాదికి 25 మిలియ‌న్ల మంది ప్ర‌యాణికులు ప్ర‌యాణించ‌గ‌లిగేలా ప్ర‌ణాళిక సిద్ధం చేస్తుంది. ఇది 2024 చివరి నాటికి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.

mandiinternationalairporthimachalpradesh1

మండి అంతర్జాతీయ విమానాశ్రయం, హిమాచల్ ప్రదేశ్

మండి విమానాశ్ర‌యం భార‌త‌దేశంలోని హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ర్టంలోని మండి జిల్లాలో నాగ్ చ‌లా వ‌ద్ద నిర్మించ‌బ‌డే గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్ర‌యం. ఈ విమానాశ్రయాన్ని 698 ఎకరాల్లో నిర్మించ‌నున్నారు. హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని సిమ్లా, కాంగ్రా జిల్లాలోని గ‌గ్గ‌ల్, కులుజిల్లాలోని భుంట‌ర్‌లో మూడు విమానాశ్ర‌యాలు ఉన్నాయి. అయితే వీటిలో ఏ ఒక్క విమానాశ్ర‌యం కూడా హెవీ డ్యూటి ఎయిర్‌క్రాఫ్ట్‌లు, అంత‌ర్జాతీయ విమానాల‌ను ల్యాండ్ చేసే అవ‌కాశం లేదు. సిమ్లా, భుంట‌ర్ విమానాశ్ర‌యాలు పెద్ద‌సంఖ్య‌లో ప్ర‌యాణికుల‌కు వ‌స‌తి క‌ల్పించ‌డానికి సాధార‌ణ విమాన సేవ‌ల‌వు అందించ‌వు.

purandarairportpune1

పురందర్ విమానాశ్రయం, పూణే

భార‌త‌దేశంలోని పూణే న‌గ‌రానికి సేవ‌లందించేందుకు పురంద‌ర్ అంత‌ర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్ర‌య ప్రాజెక్టు సిద్ధ‌మ‌వుతోంది. ఈ విమానాశ్రయం పూణెలోని లోహెగావ్ విమానాశ్రయం రద్దీని కొద్దిగా తగ్గిస్తుంది. ఈ విమానాశ్రయాన్ని ఛత్రపతి శంభాజీ రాజే అంతర్జాతీయ విమానాశ్రయంగా కూడా పిలుస్తారు, ఇది పూణే నుండి కేవలం 40 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ఈ విమానాశ్ర‌య‌ ప్రణాళిక ఖ‌ర్చు 14 వేల కోట్ల రూపాయ‌లు ఉండొచ్చ‌ని అంచ‌నా. ఇది మ‌హారాష్ర్టలోని పూణేజిల్లాలోని పురంద‌ర్ తాలుకాలోని స‌స్వాద్ మ‌రియు బెజురి స‌మీపంలో నిర్మించ‌బ‌డుతుంది. ఈ విమానాశ్ర‌యాన్ని 2400 చ‌ద‌ర‌పు హెక్టార్ల‌ల‌లో విస్త‌రించ‌నున్న‌ట్లు 2016లో ప్ర‌క‌టించారు. పురంద‌ర్ కోట‌లో జ‌న్మించిన మ‌రాఠా సామ్రాజ్య రాజు శంభాజీ మ‌హారాజు పేరు మీదుగా విమానాశ్ర‌యానికి పేరు పెట్టారు.

More News

    Read more about: jewar airport noida
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+