Search
  • Follow NativePlanet
Share
» »వ‌ర్షాకాలంలో సంద‌ర్శించేందుకు ఇండియాలోని బెస్ట్ జలపాతాలు ఇవే..!

వ‌ర్షాకాలంలో సంద‌ర్శించేందుకు ఇండియాలోని బెస్ట్ జలపాతాలు ఇవే..!

ర్షాకాలంలో సంద‌ర్శించేందుకు ఇండియాలోని బెస్ట్ జలపాతాలు ఇవే..!

వర్షాకాలం ప్రకృతి అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. ఈ సీజన్‌లో ఎటుచూసినా పచ్చదనం మాత్రమే కనిపిస్తుంది. అందుకే చాలా మందికి ఈ సీజ‌న్‌ను ఎక్కువగా ఇష్టపడటానికి కారణం. భారతదేశంలోని వివిధ ప్రదేశాలల్లో సుందరమైన అందాలను అనుభవించడానికి వర్షాకాలం ఉత్తమ సమయాలలో ఒకటి. ప్రకృతి అందాలకు నెలవైన ప్రదేశాలు ఇక్క‌డ ఎన్నో వున్నాయి. ఈ సీజన్‌లో జలపాతాలను చూడటం మ‌రో కొత్త అనుభూతిని కలిగిస్తుంది. భార‌త‌దేశంలోని ఎన్నో అద్భుత‌మైన జ‌ల‌పాతాల‌ను చూసేందుకు సిద్ధంగా ఉన్నారా?

నోహ్కలికై జలపాతం, మేఘాలయ

ఈ జ‌ల‌పాతాన్ని సెవెన్ సిస్టర్స్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోనే అతి ఎత్తైన జలపాతం. ఇది ఖాసీ కొండల నుండి 700 మీటర్ల (2,300 అడుగులు) దూరంలో ఉంది. ఈ జలపాతం చిరపుంజీ సమీపంలో ఉంది. భూమి మీద అతి తేమగా ఉండే ప్రదేశాలలో ఇది ఒకటి. వర్షాకాలంలో బాగా ఎక్కువగా పడే ఈ జలపాతం ఎండాకాలంలో తగ్గుతుంది.

1

నురానాంగ్ జలపాతం, అరుణాచల్ ప్రదేశ్

నురానాంగ్ జలపాతం అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లాలో ఉంది. 100 మీట‌ర్ల‌ (330 అడుగులు) ఎత్తు నుండి పడే ఈ జలపాతం అద్భుతమైన తెల్లని నీటికి ప్రసిద్ధి చెందింది. దీనిని నురానాంగ్ జ‌ల‌పాతం లేదా బాంగ్ బాంగ్ జ‌ల‌పాతం అంటారు. ఈ జ‌ల‌పాతం త‌వాంగ్ న‌దిపై ఉంది. ఇది తవాంగ్ హిమనదీయ సరస్సు నుండి ఉద్భవించింది. ఈ జలపాతాన్ని స్థానిక మోన్పా తెగవారు పవిత్రంగా భావిస్తారు. ఈ నీటిలో వైద్యం చేసే గుణాలు ఉన్నాయని, ఈ నీరు వివిధ వ్యాధులను నయం చేయగలద‌ని ఇక్క‌డి వారు నమ్ముతారు.

2

ధుంధర్ జలపాతం, మధ్యప్రదేశ్

ఈ జలపాతం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ సమీపంలో ఉంది. ఇది 300 మీటర్ల ఎత్తు నుండి అంటే దాదాపు 1,000 అడుగుల నుండి పడే అందమైన పచ్చటి నీటికి ప్రసిద్ధి చెందింది. ఎత్తు నుంచి పడిపోవడంతో అందులో నుంచి వెలువడే పొగ ఇక్క‌డికి వ‌చ్చే ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఈ జలపాతం నర్మదా నది పాలరాతి శిలల గుండా ప్రవహించడంతో ఏర్పడింది.

3

తిరత్‌ఘర్ జలపాతం, ఛత్తీస్‌గఢ్

తిర‌త్‌ఘ‌ర్‌ జలపాతం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో ఉంది. లాసీ కర్టెన్‌ను పోలి ఉండే అనేక అంచెల జలపాతాలకు ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని అత్యంత సుందరమైన జలపాతాలలో ఒకటైన తిరత్‌ఘర్ జలపాతాలు కంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్‌లో ఉంది. ఈ జ‌లపాత‌పు ప్రవహించే నీరు అనేక జలపాతాలుగా విభజిస్తుంది. ఇక్క‌డి అద్భుతమైన దృశ్యాలు ప‌ర్యాట‌కుల‌కు క‌నువిందు చేస్తున్నాయి. ఈ జలపాతం చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యం అడవులతో నిండి ఉంది.

చిత్రకూట్ జలపాతం, ఛత్తీస్‌గఢ్

ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ జిల్లాలో ఉన్న ఈ జలపాతం ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. దీన్ని చిత్రకోట్‌ జలపాతం అని కూడా అంటారు. ఇది భారతదేశంలోకెల్లా వెడల్పైన జలపాతం. నీరు బాగా ఉన్న సమయంలో దీని వెడల్పు 200 మీటర్లు ఉంటుంది. దీని వెడల్పు కారణంగా దీన్ని భారతదేశపు నయాగరా అని అంటారు. నీటి ప్రవాహం తక్కువగా ఉన్నపుడు ఈ జలపాతం మూడు పాయలుగా దూకుతుంది. ఈ జలపాతం గుర్రపునాడా ఆకారంలో ఉంటుంది.

4

హోగెనక్కల్ జలపాతం, తమిళనాడు

ఈ జలపాతం కావేరీ నదిపై తమిళనాడు, కర్ణాటక సరిహద్దులో ఉంది. ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇది తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లాలో ఉంది. ఇది బెంగుళూరు నుండి 180 కిలోమీటర్లు, ధర్మపురి నుండి 46 కిలోమీటర్లు దూరంలో ఉంది.

More News

    Read more about: nohkalikai falls meghalaya
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+