Search
  • Follow NativePlanet
Share
» »దేశంలో ప్ర‌సిద్ధి చెందిన కాలుష్య ర‌హిత న‌గ‌రాలు ఇవే...

దేశంలో ప్ర‌సిద్ధి చెందిన కాలుష్య ర‌హిత న‌గ‌రాలు ఇవే...

దేశంలోనే అత్యంత కాలుష్య న‌గ‌రాల జాబితాలో దేశ రాజ‌ధాని ఢిల్లీ ముందు వ‌రుస‌లో ఉంది. ఇక్క‌డి అధిక కాలుష్యం కార‌ణంగా

ఢిల్లీ-ఎన్‌సిఆర్, దాని చుట్టుపక్కల నగరాల్లో నివసించే ప్రజలు ఈ రోజుల్లో, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ వ్యాధుల‌తో బాధ‌ప‌డేవారి సంఖ్య ఇప్పుడు ఆసుప్ర‌తుల‌లో మ‌రింత ఎక్కువుతుంది. ఈ వారంలో దీపావ‌ళి వేడుకలు ప్రారంభ‌కానున్నాయి. దీపావ‌ళి సంద‌ర్భంగా కాలుష్యం మ‌రింత పెరిగే అవ‌కాశ‌ముంటుంది. మ‌న‌దేశంలో కాలుష్య న‌గ‌రాలే కాకుండా కాలుష్య ర‌హిత నగరాలు కూడా ఉన్నాయి. అయితే, ఈ దీపావ‌ళి సంద‌ర్భంగా ప‌ర్యాట‌కుల‌కు దేశంలోని కాలుష్య ర‌హిత న‌గ‌రాల‌ను సంద‌ర్శించేందుకు బ‌య‌లుదేరాల్సిందే.

mangaluru beaches

మంగళూరు

ప్రతి ప‌ర్యాట‌కులు జాబితాలో మంగళూరు న‌గ‌రం పేరు ఖచ్చితంగా చేర్చ‌బ‌డి ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎన్నో అంద‌మైన ప్ర‌దేశాలు, అద్భుతమైన బీచ్‌ల నుండి పురాతన దేవాలయాలు మ‌రియు చర్చిల వరకు అన్నీ ఉన్నాయి. ఇక్క‌డి అద్భుతమైన వాస్తుశిల్పాల‌ను చూడాల్సిందే. ఇంకా ఇక్క‌డ ఓడరేవును కూడా వీక్షించొచ్చు. ఈ నగరాన్ని కర్ణాటక ప్రవేశ కేంద్రంగా కూడా పిలుస్తారు. ఈ న‌గ‌రం కాలుష్య ర‌హిత న‌గ‌రంగా ప్ర‌సిద్ధిచెందింది. ఎందుకంటే ఇక్క‌డ ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంతోపాటు ప‌చ్చ‌ని ప్ర‌కృతి అందాలు దాగి ఉంటాయి. కాబట్టి ఈ దీపావళి సెల‌వుల‌కు మంగళూరును సంద‌ర్శించేందుకు త‌ప్ప‌కుండా ప్ర‌ణాళిక సిద్ధం చేసుకోండి. ఈ నగరంలో పచ్చదనం, ఆధునిక వాస్తుశిల్పం, బీచ్, దేవాలయాలు మొదలైనవెన్నో చూడొచ్చు.

gangtok village

గాంగ్‌ట‌క్‌

భారతదేశంలోని అంద‌మైన, అద్భుత‌మైన ప్ర‌దేశాల‌లో సిక్కిం ఒక‌టి. ఇది కాలుష్య ర‌హిత న‌గ‌రంగా కూడా పేరుగాంచింది. స్వ‌చ్ఛ‌మైన గాలిని ఆస్వాదిస్తూ, ప్ర‌కృతి ఒడిలో సేద‌దతీరాల‌నుకునే ప‌ర్యాట‌కుల‌కు సిక్కింలోకి గాంగ్‌ట‌క్ ఉత్త‌మం ప్ర‌దేశం అని చెప్పుకోవ‌చ్చు. కాబ‌ట్టి ఈ దీపావ‌ళి సెల‌వుల‌కు ఈ ర‌ణ‌గోణ ధ్వ‌నుల నుంచి బ‌య‌ట‌ప‌డి ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణాన్ని అందించే గాంగ్‌ట‌క్‌ను సంద‌ర్శించాల్సిందే. సిక్కిం రాష్ట్రంలోని అతిపెద్ద పట్టణం గాంగ్‌టక్. తూర్పు సిక్కిం జిల్లా ప్రధాన కార్యాలయం. ఇది తూర్పు హిమాలయ శ్రేణిలో 1,650 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ భూటియా, లెప్చా, ఇండియన్ గూర్ఖాల వంటి వివిధ జాతుల వారు నివ‌సిస్తున్నారు.

puducherry beaches

పుదుచ్చేరి

పుదుచ్చేరి ఒక పర్యాటక ప్రాంతం. ఈ నగరంలో అనేక వలస భవనాలు, చర్చిలు, దేవాలయాలు ఎన్నో విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇది కాస్మోపాలిటన్ సంస్కృతిని కలిగి ఉంది. ఈ ప్రాంతంలో వివిధ కులాలు, వివిధ మతాలకు చెందిన ప్రజలు ఎంతో స్నేహ‌పూర్వ‌కంగా నివసిస్తున్నారు. పుదుచ్చేరి ప్రజలు, సంస్కృతి, పండుగలు భారత ఉపఖండపు వారసత్వానికి ప్రతినిధిగా నిలుస్తున్నారు. ఇది కాలుష్య ర‌హిత న‌గ‌రంగా కూడా ప్ర‌సిద్ధిచెందింది. ఈ నగరం దాని ప్రత్యేక నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది. ఈ దీపావ‌ళికి కుటుంబంతో క‌లిసి ఈ ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో గ‌డిపేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకోండి.

kinnaur

కిన్నౌర్...

హిమాచల్ ప్రదేశ్‌లోని చాలా నగరాలు అపారమైన అందాల‌తో ప‌ర్యాట‌కుల‌ను స్వాగ‌తిస్తున్నాయి. ఇక్క‌డి కిన్నౌర్ నగరం అత్యంత సురక్షితమైన ప్రదేశం. ఈ ప్ర‌దేశం కాలుష్య ర‌హిత న‌గ‌రంగా ప్రాముఖ్య‌త సంత‌రించుకుంది. ఇక్క‌డ ప‌చ్చ‌ని అందాల‌తో పాటు ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో స‌మ‌యం గ‌డ‌పొచ్చు. ప్రకృతిని నిశితంగా పరిశీలించడానికి ఇది ఉత్తమమైన ప్రదేశం. ఈ ప్ర‌దేశంలోని చుట్టూ ఆకుపచ్చని లోయలు, అందమైన ద్రాక్షతోటలు ఇక్కడి ప్రకృతి సౌందర్యానికే వన్నె తెస్తాయి.

కొల్లం

కేరళలోని కొల్లం నగరం అందం, స్వచ్ఛమైన గాలికి కూడా పేరుగాంచింది. కేరళను సందర్శించే సీజన్ ఇక ప్రారంభమైన‌ట్టే. ఈ ప్ర‌దేశం కాలుష్య ర‌హిత న‌గ‌రంగా కూడా పేరుపొందింది. కాబ‌ట్టి ఈ సెల‌వుల్లో త‌ప్ప‌కుండా ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించేయ‌డి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+