Search
  • Follow NativePlanet
Share
» »ఆనాటి చ‌రిత్ర‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నం.. హంపిలోని ఈ ఆల‌యం..

ఆనాటి చ‌రిత్ర‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నం.. హంపిలోని ఈ ఆల‌యం..

ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించే అనేక దేవాలయాలు భార‌త్‌లో ఉన్నాయి. ఈ రోజు మనం భారతదేశంలోని ఒక ప్రత్యేకమైన ఆలయం గురించి చ‌ర్చించుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. ఇక్కడ రాళ్ళు కూడా ట్యూన్ చేస్తాయన్న విష‌యం మీకు తెలుసా..? స్వరసప్తకంలోని ఏడు స్వరాలు హంపిలోని సంగీత స్తంభాల నుండి వెలువడతాయి. ఈ ప్రదేశంలో అంతుచిక్కని రహస్యాలు ఇప్ప‌టికీ ఎన్నో ఇక్క‌డ దాగి ఉన్నాయి. ప్రాచీన కాలం నుంచి కర్ణాటక రాష్ట్రంలోని హంపిలో ఈ ఆల‌యం ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఎందుకంటే ఈ ఆల‌యంలో సంగీత స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభాలు సంగీత శబ్ధాలను వినిపిస్తాయి. వీటిని ముట్టుకుంటే శ్రావ్యమైన శబ్ధాల స‌వ్వ‌డి మ‌న‌కు వినిపిస్తోంది. రండి ఈ ఆల‌య విశేషాలు తెలుసుకుందాం.

హంపిలో ప్రధాన ఆకర్షణల్లో ఒకటైనది ఈ ఆలయం. ఈ ఆలయం పేరు విట్టల ఆలయం. ఇది చరిత్ర పరంగా, నిర్మాణ శైలి పరంగా ఎంతో గొప్పదనే చెప్పుకోవాలి. ఈ ఆలయం అందం గురించి వర్ణించేందుకు పదాలు స‌రిపోవు. ఈ ఆలయంలో అనేక మండపాలు, మందిరాలు, ఇతర దేవాలయాలు విస్త‌రించి ఉన్నాయి. హంపి ఆల‌యాలు తుంగ‌భ‌ద్ర న‌ది ఒడ్డున ఉన్నాయి. ఇవి ఎకరాలలో విస్తరించి ఉన్న దేవాలయాలు, స్మారక కట్టడాలతో నిండిన విశాలమైన సముదాయం.

ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సంగీత స్తంభాలు..

హంపిలోని విఠల్ దేవాలయం కళకు అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తోంది. నేటికీ ఇక్క‌డ అనేక స్థంభాలు ఉన్నాయి. అవి అనేక లక్షణాలను కలిగి ఉన్నాయి. గ్రానైట్ రాతితో చేసిన ఈ 56 స్తంభాలకు అనేక స్తంభాలు ఉన్నాయి. కొన్నింటిలో విగ్రహాలు కూడా నిర్మించబడ్డాయి. ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్క‌డ ఇంకా మహా మండపం, దేవి మందిరం, కళ్యాణ మండపం, రంగ మండపం, ఉత్సవ మండపం, రాతి రధం వంటివి ఉన్నాయి. ఇక్కడ ఉన్న రంగ మండపం 56 సంగీత స్తంభాలకు ఎంతో పేరుగాంచింది. వీటిని సరిగమ స్తంభాలు అని కూడా పిలుస్తుంటారు.

Hampi vottal temple

ఈ స్తంభాలు సంగీత శబ్ధాలను వినిపిస్తాయి. వీటిని ఒక్క‌సారి ట‌చ్ చేస్తే చాలు మ‌ధుర‌మైన శ‌బ్దాలు వినిపిస్తాయి. దీనిని ఇక్క‌డికి వ‌చ్చే ప‌ర్యాట‌కులు స్వ‌యంగా ఆహ్వానించ‌వ‌చ్చు. ఈ మండపంలో అనేక ప్రధాన స్తంభాలు, చిన్న స్తంభాల సమితి ఉంటుంది. ప్రతి స్తంభం మండపం పైకప్పుకు అనుసంధానించబడి ఉంటుంది. ప్రధాన స్తంభాలు సంగీత వాయిద్యాల శైలిలో రూపొందించిన‌వి. ప్రతి ప్రధాన స్తంభం ఏడు చిన్న స్తంభాలను కలిగి ఉంటాయి.

విజయ విట్టల ఆలయం అని పేరు..

ఈ ఆలయాన్నిదేవరాయ 2 పరిపాలనలో 15వ శతాబ్ధంలో నిర్మించిన‌ట్లు చరిత్ర చెబుతోంది. విజయనగర సామ్రాజ్య పాలకుల్లో ఈయన ఒకరు. ఈ ఆలయాన్ని విట్టలకు అంకితం చేయ‌డం జ‌రిగింది. దీనిని విజయ విట్టల ఆలయం అని కూడా అంటారు. విట్టలను విష్ణువు అవతారం అని పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు విట్టల రూపానికి ఈ ఆలయాన్ని నిర్మించారు. కానీ ఈ ఆలయం చాలా గొప్పగా ఉన్నట్లు అనిపించడంతో విష్ణువు ఎంతో నిరాడంబరమైన పందర్ పూర్ కు విట్టల రూపంలో వెళ్లిపోయినట్లు పురాణాలు చెబుతున్నాయి.

hampi chariot

ఇంకా ఈ ఆలయంలో రధం, సంగీత స్తంభాలు వంటి అందమైన రాతి నిర్మాణాలు ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ నిర్మాణాల హస్తకళ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వీటిని సందర్శించేందుకు ప్రపంచ నలుమూల నుంచి పర్యాటకులు త‌ర‌లి వ‌స్తుంటారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+