Search
  • Follow NativePlanet
Share
» »కర్నాటక లో తెప్పల విహార క్యాంప్ లు !

కర్నాటక లో తెప్పల విహార క్యాంప్ లు !

By Mohammad

పర్యటనలంటే కేవలం అక్కడికి వెళ్ళి చూశామా, వచ్చామా అన్నది కాదండీ ... ఆ ప్రదేశాన్ని ఎంతగా ఆస్వాదించాం, అక్కడ ఎంత ఆనందించాం .. కేరింతలుకొట్టాం ... అల్లరి చేశాం ... డ్యాన్స్ లేశాం ఇలాంటివి పర్యటనలంటే. ఇవే మీకు గుర్తుండిపోయే జ్ఞాపకాలు. అలాంటి జ్ఞాపకాలలో చెప్పుకోవలసినది కొరకిల్ రైడ్ ఒకటి.

కొరకిల్ రైడ్ అంటే ?

ఇదొక సాహస క్రీడ. నాగార్జున సాగర్ దగ్గర .. శ్రీశైలం డ్యామ్ దగ్గర .. తెప్పల్లో ప్రయాణించింటారే ..! అలాగే ఇది కూడా. కానీ దానికి, దీనికి చాలా పోలికలున్నాయి.

ఇది కూడా చదవండి : బెంగళూరు కు 100 కి. మీ. దూరంలో ఉన్న ఫిషింగ్ క్యాంప్ లు !

కర్నాటకలో తెప్పల విహారం ప్రధానంగా కావేరీ నది, తంగభద్ర నది పరివాహ ప్రాంతాల్లో జరుగుతుంది. ఆ తెప్పల్లో ప్రయాణిస్తూ .. చేపలను పట్టుకోవచ్చు, విడిచిపెట్టవచ్చు. నదుల ఒడ్డున చేపలు అప్పటికప్పుడే ఫ్రెష్ గా వేయిస్తుంటారు. అసలైన నాన్ - వెజ్ కు సిసలైన చేపలు తోడైతే .. ఇంకెముంది లొట్టలేసుకుంటూ తినాల్సిందే !

శివసముద్రం

శివసముద్రం

శివసముద్రం - దీనినే శివనసముద్రం అని కూడా పిలుస్తారు. ఇది బెంగళూరు నుండి 135 కి. మీ. దూరంలో కలదు. కావేరీ నది రెండుగా చీలే ఈ ప్రదేశంలో శివసముద్ర, భార చుక్కి & గగన్ చుక్కి అనే రెండు జలపాతాలు ఉన్నాయి. శివ సముద్ర జలపాతం వద్ద తెప్పల విహారం ఆనందాన్ని, ఉల్లాసాన్ని ఇస్తుంది.

చిత్ర కృప : Rockuzz

తలకాడు

తలకాడు

తలకాడు ను కర్ణాటకలో మినీ ఎడారి అని పిలుస్తారు (మన ఆంధ్రా లో అనంతపురం మాదిరి). టౌన్ మొత్తం ఇసుక తో బాగానే కప్పబడి ఉంటుంది. తలకాడు పట్టణం మైసూర్ కు 50 కి. మీ. దూరంలో, బెంగళూరు కు 135 కి. మీ. దూరంలో కావేరీ నది ఒడ్డున ఉన్నది. ఆ నదిలో తెప్ప ల విహారం తప్పక ఆనందాన్ని ఇస్తుంది.

చిత్ర కృప : Ashwin Kumar

హంపి

హంపి

హంపి ఒక హేరిటేజ్ ప్రదేశం, విజయనగర సామ్రాజ్యానికి ఒకప్పటి రాజధాని. ఇక్కడ చూడానికి చారిత్రక కట్టడాలు అనేకం ఉన్నాయి. చాలా వరకు అవి యునెస్కో చేత గుర్తుంచబడ్డాయి. హంపికి మరొక అందం తుంగభద్ర. అందులో మీరు తప్పక కొరకిల్ రైడ్ చేయాలి సుమీ .!

చిత్ర కృప : 4ocima

హోన్నేమర్డు

హోన్నేమర్డు

హోన్నేమర్డు సాహస క్రీడలు ఇష్టపడేవారికి ఎంతో బాగుంటుంది. ఈ గ్రామం బెంగళూరు నుండి 379 కి.మీ. దూరంలో, షిమోగా జిల్లాలో ఉన్నది. ప్రకృతి ప్రియులు శరావతి నది ఒడ్డున పక్షులను చూస్తూ సమయాన్ని గడపవచ్చు. అలాగే కొరకిల్ రైడ్ ను ఆస్వాదించవచ్చు.

చిత్ర కృప : Sarthak Banerjee

భీమేశ్వరి

భీమేశ్వరి

భీమేశ్వరి, బెంగళూరు నుండి 100 కి. మీ. దూరంలో సాహస క్రీడలు ఆడటానికీ అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ప్రధాన ఆకర్షణ. కావేరీ నది లో తెప్ప ల్లో ప్రయాణినిస్తూ చేపలను పట్టుకోవడం, వదిలేయటం వంటివి చేయవచ్చు. చేపలను తప్పక వదిలేయాలి లేకుంటే జరిమానా తప్పదు !

చిత్ర కృప : Anne Roberts

నాగర హోళే

నాగర హోళే

నాగర హోళే జాతీయ పార్క్ కర్నాటక వన్య మృగ పార్కు లలో ప్రధానమైనది. ఇక్కడ జంగిల్ రిసార్ట్ లు పర్యాటకులకు రకరకాల కార్యక్రమాలను ఆఫర్ చేస్తుంటారు. అందులో ఒకటి కాబిని నది మీద తెప్పల విహారం చేయటం. తెప్ప ల్లో విహరిస్తూ ... దప్పక తీర్చుకుంటున్న వన్య జంతువులను చూడవచ్చు.

చిత్ర కృప : Manoj Vasanth

దుబరే

దుబరే

కర్నాటక కూర్గ్ జిల్లాలోని దట్టమైన అడవుల్లో గల దుబరే ఏనుగుల శిక్షణ కేంద్రానికి ప్రసిద్ధి చెందినది. ఈ ప్రదేశం కావేరీ నది ఒడ్డున ఉన్నది. కుటుంబసభ్యులతో ఈ ఫారెస్ట్ క్యాంప్ కు వచ్చి, కావేరీ నది ప్రవాహం మీద తెప్పల్లో విహరించవచ్చు.

చిత్ర కృప : Srikanth M.V.

హల్గుర్

హల్గుర్

హల్గుర్ కర్నాటక రాష్ట్రంలోని ఒక జిల్లా. ఇక్కడ నీటి క్రీడలను ఆనందించడానికి క్యాంప్ లను ఏర్పాటుచేశారు. అందులో కొరకిల్ రైడ్ ప్రత్యేక మైనది.

చిత్ర కృప : Rajesh Kumar

దొడ్డమకాలి

దొడ్డమకాలి

దొడ్డమకాలి బెంగళూరు కు 132 కి. మీ. దూరంలో చూడచక్కటి ఆకర్షణలతో పర్యాటకులను ఆకర్షిస్తున్నది. దీనికి సమీపంలో కావేరీ నది ప్రవాహంలో కొరకిల్ రైడ్ చేస్తూ ఆనందించవచ్చు.

చిత్ర కృప : Priya Singh

దండేలి

దండేలి

ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న దండేలి గ్రామం వన్య జీవుల సంరక్షణాలయానికి ప్రసిద్ధి చెందినది. ఇక్కడున్న కాళీ నదిలో తెప్పల్లో విహరిస్తూ చేపలను పట్టుకోవడం ఆనందాన్నిచ్చే క్రీడ. అలాగే సైక్లింగ్, మౌంటన్ బైకింగ్, ట్రెక్కింగ్ ఇతర సాహస క్రీడలు చేపట్టవచ్చు.

చిత్ర కృప : holidayadventures

కర్వార్

కర్వార్

కర్వార్ లో ఉన్న అనేక రిసార్ట్ లు కాళీ నది మీద కొరకిల్ రైడ్ ను అందిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం అరేబియా సముద్రంలో రైడ్ ను ఆస్వాదించండి.

చిత్ర కృప : Sunil

దరొజి స్లోత్ బేర్ స్యాంక్చురీ

దరొజి స్లోత్ బేర్ స్యాంక్చురీ

దరొజి స్లోత్ బేర్ స్యాంక్చురీ బళ్ళారి లో కలదు. ఈ స్యాంక్చురీ ని సందర్శించేటప్పుడు, అక్కడే ఉన్న సరస్సులో తెప్ప ల్లో ప్రయాణించండి.

చిత్ర కృప : ASHOK KUMAR

హొగనెక్కల్ ఫాల్స్

హొగనెక్కల్ ఫాల్స్

హొగనెక్కల్ ఫాల్స్ కు బెంగళూరు నుండి ఒక్క రోజులో పోయిరావచ్చు(179 కి.మీ). పొగలుకక్కే ఈ జలపాతం ప్రవాహల్లో తెప్ప ల్లో విహరిస్తూ ఆనందించవచ్చు.

చిత్ర కృప : Saneem Perinkadakkat

రొట్టికల్లు

రొట్టికల్లు

రొట్టికల్లు సకలేశ్ పూర్ లో కలదు మరియు ఇక్కడ అనేక రిశార్ట్ లు ఉన్నాయి. సమీపంలో ప్రవహిస్తున్న హేమావతి నది మీద కొరకిల్ రైడ్ ను ఆనందించవచ్చు. ఇదొక్కటే కాక వివిధ రకాల నీటి క్రీడలను సైతం ఆడవచ్చు.

చిత్ర కృప : Fμndμ

వల్నుర్ హయగతూర్

వల్నుర్ హయగతూర్

కూర్గ్ జిల్లాలో ఉన్న ఈ ప్రదేశానికి సమీపంలో కావేరీ నది ప్రవహిస్తుంది. నిర్మానుష్యమైన ప్రదేశంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో, పచ్చని ప్రకృతి మధ్య ఉన్న నది లో కొరకిల్ రైడ్ తప్పక ఆనందాన్ని కలిగిస్తుంది.

చిత్ర కృప : Ananth Narayan S

హొన్నికెరి రిజర్వ్ ఫారెస్ట్

హొన్నికెరి రిజర్వ్ ఫారెస్ట్

మీరు గనక బీదర్ లో ఉంటే బ్ల్యాక్ బస్ట్ రిసార్ట్ తప్పక సందర్శించాలి. ఇది రిజర్వ్ - విలాస్పూర్ సరస్సు మధ్యలో ఉంటుంది. రిసార్ట్ వద్ద కొరకిల్ రైడ్ ఆనందించదగ్గది.

చిత్ర కృప : Shesh

శ్రీరంగపట్నం

శ్రీరంగపట్నం

శ్రీరంగపట్నం లో ఒకరోజు పర్యటన పర్యాటకులకు తప్పక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక్కడ బాలమూరి ఫాల్స్, మూడు నదుల సంగమ ప్రదేశం గొసై ఘాట్ మరియు అనేక ఆకర్షణ లు ఉన్నాయి. కొరకిల్ లో ప్రయాణిస్తూ పట్టణ సౌందర్యాన్ని కన్నార్పకుండా చూడవచ్చు.

చిత్ర కృప : sandeepachetan.com travel photography

కొండజి

కొండజి

దావంగేరె సమీపంలో కొండజి కలదు. ఇక్కడ ఉన్న అందమైన సరస్సులో తెప్ప ల్లో ప్రయాణిస్తూ ... అడవి అందాలను ఆస్వాదించవచ్చు.

చిత్ర కృప : docsanjeev

కూర్గ్ ఇతర ప్రదేశాలు

కూర్గ్ ఇతర ప్రదేశాలు

కూర్గ్ లో పైన పేర్కొన్న ప్రదేశాలే కాక మడికెరి, సిద్ధపుర లోని సరస్సుల వద్ద, నదుల వద్ద తెప్పల విహారం అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు కూర్గ్ లో ఉన్నట్లయితే తప్పక ఈ ప్రదేశాలకు వెళ్ళి రైడ్ ను ఆస్వాదించండి.

చిత్ర కృప : Shreyas Jayappa

ఇబ్బనీ సరస్సు

ఇబ్బనీ సరస్సు

సకలేశ్ పూర్ లో ఉన్న ఇబ్బనీ సరస్సు వద్ద అందమైన రిసార్ట్ కలదు. ఇక్కడ మిమ్మల్ని అందమైన ప్రకృతి దృశ్యాలు ఆహ్వానిస్తాయి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ లతో కలిసి వచ్చి కొరకిల్ రైడ్ లో పాల్గొనాటం తప్పక ఉత్సాహాన్ని ఇస్తుంది.

చిత్ర కృప : Umang Dutt

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+