Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» భీమేశ్వరి - జలపాతాల మధ్యలో...!

భీమేశ్వరి - జలపాతాల మధ్యలో...!  

7

భీమేశ్వరి మంద్య జిల్లాలో ఒక చిన్న పట్టణంగా ఉంటుంది. ఈ ప్రదేశం నేటి రోజులలో ఎంతోమంది పర్యాటకులకు ఒక సాహస ప్రదేశంగా ఎంపిక చేయబడుతోంది. బెంగుళూరు నుండి భీమేశ్వరి 100 కి.మీ. దూరంలో ఉంది. వారాంతపు సెలవులలో విహరించేందుకు ఎంతో అనువుగా ఉంటుంది.మేకేదాటు మరియు శివనసముద్ర జలపాతాల మధ్య కల ఈ విహార ప్రదేశం వివిధ ఆకర్షణలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. మీరు సాహసవంతులా? కావేరి నది చేపలు పట్టడంలో ఆసక్తి కలవారికి అనేక అవకాశాలు కల్పిస్తోంది. ప్రత్యేకించి ఈ ప్రాంతంలో ఆటలాడే మహసీర్ చేపలు ఎంతో వినోదాన్నికలిగిస్తాయి. ఈ ప్రదేశం ఒక చేపల స్వర్గం అని తెలియడంతో ఇక్కడ అనేక చేపల వేట కేంద్రాలు వెలిశాయి.

భీమేశ్వరిలో అనేక పర్యాటక ఏజన్సీలు కూడా ఉన్నాయి. వీటి ద్వారా మీరు ఈ అటవీ ప్రాంతాన్ని తేలికగా సందర్శించి అక్కడ ఉండే లేళ్ళు, జింకలు,గుంటనక్కలు, చిరుతలు, ఎలుగులు, మొసళ్ళు వంటి జంతువులను ఎన్నింటినో సందర్శించి ఆనందించవచ్చు.

ఈ ప్రదేశం దట్టమైన పచ్చటి అడవులు కలిగి ఎంతో లోతైన లోయలు కూడా కలిగి ఉంది. ట్రెక్కింగ్ చేయాలంటే ఈ ప్రాంతం ఎంతో అనుకూలం.దొడ్డమకాళి ప్రదేశానికి ట్రెకింగ్ చేయవచ్చు. ఈ ప్రదేశంలో పక్షుల విహారాలు కూడా చూసి ఆనందించవచ్చు. లేదా చేపలు పట్టవచ్చు. ఈ ప్రదేశం భీమేశ్వరికి 7 కి.మీ. దూరంలో ఉంటుంది.

భీమేశ్వరికి 16 కి.మీ. దూరంలో ఉన్న గాలిబోర్ కూడా ట్రెక్కింగ్ కు అనుకూలమే. చేపలు పట్టే కేంప్ గా కూడా ఉంటుంది. అయితే ఇక్కడ చేపలను పట్టటం మరల వెంటనే వెనక్కు వదిలేయటం చేయాలి. ఇది ఒక క్రీడగా మాత్రమే ఆచరించాలి. కావేరి ఫిషింగ్ కేంప్ దగ్గరలో ఒక ఏనుగుల కేంద్రం కూడా ఉంది. ఈ మార్గంలో కావేరి నది వెంట, అడవులలో ట్రెకింగ్ చేయవచ్చు. ఎంతో ఆనందకరమైన ఈ ట్రెకింగ్ మిమ్మల్ని మధురానుభూతులలోకి నెట్టి వేస్తుంది.

మెల్లగా పారే కావేరీ ప్రవాహాలు  అతి మెల్లగా గల గల మంటూ పారే కావేరీ నది భీమేశ్వరిలో మరో ఆకర్షణ, ఈ ప్రదేశంలో స్విమ్మింగ్, చిన్న నావలలో బోటింగ్ వంటివి ప్రత్యేకతలు.సాహసవంతులకు నదిపై బల్లకట్టు ప్రయాణం భీమేశ్వరిలో ఎంతో సురక్షితం. భీమేశ్వరి ఒక అద్భుత వినోద ప్రదేశం సహజ అందాలు, సాహస కార్యాలు కలబోసి ఉంటాయి. విశ్రాంతిగా అడవిలో జంతువులను చూసి ఆనందించవచ్చు. చేపలు పట్టవచ్చు. ట్రెక్కింగ్ చేయవచ్చు.

భీమేశ్వరి - జలపాతాల మధ్యలో...! ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

భీమేశ్వరి - జలపాతాల మధ్యలో...! ఫొటోలు

భీమేశ్వరి - జలపాతాల మధ్యలో...! వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం భీమేశ్వరి - జలపాతాల మధ్యలో...!

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? భీమేశ్వరి - జలపాతాల మధ్యలో...!

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం - కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ భీమేశ్వరికి బస్సులను నడుపుతుంది. పర్యాటకులు ప్రయివేట్ వాహనాలను కూడా ఉపయోగించి వెళ్ళవచ్చు. ఎన్నో టాక్సీలు, క్యాబ్ లు భీమేశ్వరి చేరేందుకు లభ్యంగా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం - భీమేశ్వరికి రైలు స్టేషన్ లేదు. బెంగుళూరు సిటీ జంక్షన్ భీమేశ్వరికి దగ్గర. 100 కి.మీ. మాత్రమే. ఇక్కడినుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైలు సౌకర్యం కలదు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    భీమేశ్వరి ఎలా చేరాలి? విమాన ప్రయాణం - బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడకు దగ్గర. స్ధానికి అంతర్జాతీయ విమానాలు ఇక్కడినుండి వినియోగించవచ్చు. ఇది సుమారు 100 కి.మీ. దూరంలో ఉంటుంది. విదేశీ యాత్రికులకు కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed