శివ సముద్రం - కావేరి నది రెండుగా చీలే ప్రదేశం

శివసముద్రం ఒక వినోద పర్యటనా స్ధలం. దీనినే శివన సముద్ర అని కూడా అంటారు. ఇది మంద్య జిల్లాలో ఉంది. శివన సముద్ర అంటే శివుడి సముద్రం అని అర్ధంగా చెప్పవచ్చు. ఇది కావేరి నది ఒడ్డున కల ఒక ప్రశాంత పట్టణం.  ద్వీపాలు, జలపాతాలు, వినోదాలు

ఈ పర్యటనా స్ధలంలో అనేక జలపాతాలున్నాయి. ఈ ప్రదేశం  ప్రపంచంలోని షుమారు అత్యధిక 100 జలపాత ప్రదేశాలలో ఒకటిగా కూడా చెపుతారు.  కావేరి నది ప్రవాహం దక్కన్ పీఠభూమిలో ప్రవహిస్తూ ఈ శివసముద్ర ప్రదేశంలో రెండు పాయలుగా చీలుతుంది. వీటిని గగన చుక్కి మరియు భార చుక్కి అంటారు. ఈ రెండు ప్రవాహాలు వేగం సంతరించుకొని ఒక పెద్ద కొండనుండి 98 మీటర్ల ఎత్తునుండి కిందపడతాయి. గగన చుక్కి పడమటి భాగంలోను భార చుక్కి జలపాతం తూర్పు భాగంలోను పడుతూంటాయి.

గగన్ చుక్కిని శివసముద్ర వాచ్ టవర్ నుండి లేదా అక్కడి దర్గా నుండి చూడవచ్చు. భార చుక్కిని 1 కి.మీ. దూరంనుండి చూడవచ్చు.  

శివన సముద్రంలో పురాతన దేవాలయాలున్నాయి. ఆసియాలోని మొదటి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఇక్కడ ఉంది. దీనిని కోలార్ బంగారు గనుల అవసరాల కొరకు స్ధాపించారు.  

శివన సముద్రం బెంగుళూరు నుండి చక్కటి రోడ్లు కలిగి ఉంది. వర్షాకాలంతర్వాత సందర్శనకు అంటే జూలై నుండి అక్టోబర్ వరకు బాగుంటుంది.  శివనసముద్రం వెళ్ళిన వారు ఈ రెండు జలపాతాలను తప్పక చూడాలి. రెండు జలపాతాలు 200 అడుగుల ఎత్తునుండి వ్యతిరేక దిశలో కిందకు పడతాయి.   భారచుక్కి జలపాతం, గగనచుక్కి జలపాతంకంటే కూడా పెద్దది. పర్యాటకులు ఈ కొండపై ట్రెక్కింగ్ చేయవచ్చు. స్విమ్మింగ్ సూచించదగినది కాదు.  శివనసముద్ర పర్యాటకులు ఇక్కడకల ద్వీప పట్టణం మరియు జలపాతాలు తప్పక చూడాలి.

ఇక్కడి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఆసియాలో పెద్దది ఇది 1902 లో స్ధాపించబడింది. భారచుక్కి, గగన చుక్కి అనే ఈ రెండు జలపాతాలు కలసి కావేరి నదిలో కలుస్తాయి. ఇది దేశంలోనే రెండవ అతిపెద్ద జలపాతంగా చెపుతారు. ప్రపంచంలోని 100 జలపాతాలలో ఇది ఒకటి.   పర్యాటకులు ఇక్కడి రంగనాధ స్వామి దేవాలయాన్ని చూడవచ్చు. ఇది హోయసల రాజుల కాలం నాటిది. మధ్య - రంగ ద్వీపంలో ఉంది. జలపాతాలకు వెళ్ళే మార్గంలోనే ఉంటుంది. రంగనాధ స్వామి దేవాలయం చూడాలంటే, భక్తులు కావేరి నదిపైగల రెండువంతెనలు దాటాలి. జలపాతాలు, దేవాలయం చూడాలంటే జూలై మరియు అక్టోబర్ అనుకూల నెలలు.

Please Wait while comments are loading...