Search
  • Follow NativePlanet
Share
» »భూమి పై నుంచి చూస్తే ఇంత అందంగా కనిపించవు ఎందుకబ్బా?

భూమి పై నుంచి చూస్తే ఇంత అందంగా కనిపించవు ఎందుకబ్బా?

భారత దేశంలో రోప్ వే అందుబాటులో ఉన్న పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన కథనం.

మనకు రెక్కలు ఉంటే ఎంత బాగుంటుందో నని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఎందుకంటే ఆకాశంలో అలా ఎగురుతూ భూమి పై ఉన్న అందాలను చూస్తూ సమయాన్ని ఇట్టే మరిచిపోవాలని ఎవరి ఉండదు చెప్పండి. అయితే దేవుడు మనకు ఆ రెక్కలు ఇవ్వలేదు. అయితే ఆకాశంలో విహరించడానికి అవసరమైన మేథస్సును మాత్రం ఇచ్చాడు. అందులో భాగమే రోప్ వే మార్గం. ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ భూమి పై ఉన్న అందమైన ప్రాంతాలను తిలకించడానికి ఉపయోగపడే ఈ సాంకేతికత భారత దేశంలో చాలా చోట్ల అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల్లో ఉన్న ఆ కేబుల్ కార్ వ్యవస్థ గురించి క్లుప్త సమాచారం మీ కోసం. ఆయా పర్యాటక ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఈ రోప్ వే మార్గంలో వెళ్లి మీ పర్యటనలో మరిచిపోలేని అనుభూతిని పొందండి.

గుల్మార్గ్

గుల్మార్గ్

P.C. You Tube

ప్రపంచంలోనే రెండవ అతి ఎతైన రోప్ వే మార్గం జమ్ము కాశ్మీర్ లోని ఈ గుల్మార్గ్. ఇక ఆసియా విషయానికి వస్తే ఎత్తు విషయంలో గుల్మార్గ్ రోప్ వే కు మించినది లేదు. సముద్రమట్టానికి దాదాపు 13780 అడుగుల ఎత్తులో ఉంటుంది. మొత్తం పొడవు 2.5 కిలోమీటర్లు. ఈ గుల్మార్గ్ రోప్ వే మార్గం కొంగ్ దూర్ నుంచి మొదలయ్యి గుల్మార్గ్ తో అంతమవుతుంది.

అవ్లీ కేబుల్ కార్

అవ్లీ కేబుల్ కార్

P.C. You Tube

హిమాలయ రాష్ట్రమైన ఉత్తరాఖండ్ లో అవ్లీ ఉంది. భారత దేశంలో అత్యంత పొడవైన కేబుల్ కార్ మార్గమం అవ్లీ. మొత్తం పొడవు 4 కిలోమీటర్లు. జోషిమఠ్ నుంచి ప్రారంభమయ్యే ఈ రోప్ వే అవ్లీ వద్ద ముగుస్తుంది. మర్గమధ్యలో మనం నందాదేవి పర్వత శిఖర అందాలను కూడా వీక్షించవచ్చు.

మనాలీ రోప్ వే

మనాలీ రోప్ వే

P.C. You Tube

హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీ రోప్ వే అత్యంత ఆహ్లాదంతో కూడుకొన్న మార్గం. ఇక్కడ రోప్ వే నే కాకుండా స్కీయింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. పారాగ్లైడింగ్ వంటి ఇతర సాహస క్రీడలకు కూడా ఈ మార్గం చాలా ఫేమస్. ఈ మార్గంలో మనం భూతల స్వర్గంగా పేరుగాంచిన సోలాంగ్ వ్యాలీ అందాలను కూడా చూడవచ్చు.

రాయ్ ఘడ్ రోప్ వే

రాయ్ ఘడ్ రోప్ వే

P.C. You Tube

మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక కేంద్ర రాయ్ ఘడ్ కోట పైకి పర్యాటకులను తీసుకెళ్లడానికి వీలుగా ఈ రోప్ వే మార్గం ఏర్పాటు చేశారు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రోప్ వే మార్గాల్లో ఇది ఒకటిని చెబుతారు. పూర్తిగా ఏటవాలుగా ఈ నిర్మాణం ఉంటుంది.

దున్ ధార్ రోప్ వే

దున్ ధార్ రోప్ వే

P.C. You Tube

మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ కు దగ్గరగా ఉన్న జలపాతం దున్ దార్. భారత దేశంలో అత్యంత అందమైన జలపాతాల్లో ఇది కూడా ఒకటి. ఈ జలపాతం అందాలను ఆకాశంలో నుంచి చూడాలనుకొనేవారు. ఈ రోప్ వే మార్గాన్ని ఎంచుకోవచ్చు. జలపాతానాకి అడ్డంగా నిర్మించిన ఈ రోప్ వే మార్గం ద్వారా నర్మదానది అందాలను కూడా వీక్షించవచ్చు.

ముస్సోరి

ముస్సోరి

P.C. You Tube

ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ముస్సోరిలో ఈ రోవ్ వే మార్గం అందుబాటులో ఉంది. కేబుల్ కార్ లో వెలుతూ మేఘాలను ముద్దాడుతూ ఉంటే ఆ అనుభూతి మాటల్లో వర్ణించడానికి వీలు కాదు.

గ్యాంగ్ టక్ రోప్ వే

గ్యాంగ్ టక్ రోప్ వే

P.C. You Tube

సిక్కింలోని ప్రముఖ పర్యాటక కేంద్రం గ్యాంగ్ టక్ వద్ద మనకు ఈ రోప్ వే మార్గం అందుబాటులో ఉంటుంది. గ్యాంగ్ టక్ వెళ్లిన వారు ఖచ్చింతంగా ఈ రోప్ వే మార్గంలో వెళ్లి అక్కడి అందాలను ఆకాశ మార్గం నుంచి చూసి ఆనందిస్తుంటారు.

రాజ్ గిర్

రాజ్ గిర్

P.C. You Tube

బీహార్ లోని నలంద జిల్లాలోని రాజ్ గిరి పర్వత శిఖరం వద్ద ఉంది. ఈ రోప్ వే మార్గంలో ప్రయాణం చేస్తూ వైభర, రత్నా, శైల, సోనా, ఉదయ్, ఛత్నా, వైపూర్ పర్వత శిఖరాల అందాలను కూడా చూడవచ్చు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+