Search
  • Follow NativePlanet
Share
» »కరూర్ - తమిళనాడు ఆధ్యాత్మిక పట్టణం !!

కరూర్ - తమిళనాడు ఆధ్యాత్మిక పట్టణం !!

కరూర్ అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ది. ఈ పట్టణం ఏడు పవిత్రమైన శివాలయాలలో ఒకటి. ఐదు అడుగుల ఎత్తుగల లింగం ఉన్న పసుపతిశ్వరలింగం ఆలయం ఈ పట్టణం లోని అత్యంత ప్రసిద్ధ ఆలయం.

By Mohammad

పర్యాటక ప్రదేశం : కరూర్
జిల్లా : కరూర్ జిల్లా
రాష్ట్రం : తమిళనాడు

కరూర్, అమరావతి ఒడ్డున ఉన్న ఒక పట్టణం, ఇది తమిళనాడు లోని కరూర్ జిల్లా కు కేంద్రం. దీనికి ఆగ్నేయంలో 60 కిలోమీటర్ల దూరంలో ఈరోడ్; దక్షిణాన 70 కిలోమీటర్ల దూరంలో త్రిచి; దక్షిణం వైపు 100 కిలోమీటర్ల దూరంలో సాలెం; ఉత్తరాన 141 కిలోమీటర్ల దూరంలో మదురై; తూర్పున 131 కిలోమీటర్ల దూరంలో కోయంబత్తూర్ ఉన్నాయి.

సంపదకి, వారసత్వ సంస్కృతికి పేరుగాంచిన కరూర్, తమిళనాడు రాష్ట్రము లోని పురాతన పట్టణాలలో ఒకటి. దీని చరిత్ర సంగం కాలంనాటి 2000 సంవత్సరాల క్రిందటిది.

కరూర్ లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలు

కరూర్ అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ది. ఈ పట్టణం ఏడు పవిత్రమైన శివాలయాలలో ఒకటి. ఐదు అడుగుల ఎత్తుగల లింగం ఉన్న పసుపతిశ్వరలింగం ఆలయం ఈ పట్టణం లోని అత్యంత ప్రసిద్ధ ఆలయం.

కళ్యాణ పసుపతీశ్వర ఆలయం

కళ్యాణ పసుపతీశ్వర ఆలయం

ఈ ప్రాంతాన్ని చోళులు పరిపాలించేటపుడు కళ్యాణ పసుపతీశ్వర ఆలయం నిర్మించారు. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఈ ఆలయం ఐదు అడుగుల ఎత్తున్న పాసుపతీశ్వర లింగానికి ప్రసిద్ది చెందింది. ఇక్కడ ఐదు విగ్రహాలు ఉంటాయి.

చిత్రకృప : Karthikeyan Manickam

కరూర్ ప్రభుత్వ మ్యూజియం

కరూర్ ప్రభుత్వ మ్యూజియం

కరూర్ బస్ స్టేషన్ కి సమీపంలోని కరూర్ ప్రభుత్వ మ్యూజియం కలదు. ఇక్కడ ఈ ప్రాంత పూర్వీకుల జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ మ్యూజియం వివిధ రకాల ఇత్తడి వస్తువులని, లోహపు వస్తువులను, పురాతన సంగీత సాధనాలను ప్రదర్శిస్తుంది.

చిత్రకృప : karur

మయనుర్

మయనుర్

మయనుర్, త్రిచి నుండి కరూర్ వెళ్ళే దారిలో కరూర్ నుండి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఇక్కడ ఉన్న మరియమ్మన్ ఆలయం, సేల్లండియమ్మన్ ఆలయం అనే రెండు ప్రధాన ఆలయాలకు నిలయంగా ఉండడం వల్ల పర్యాటక కేంద్రంగా ప్రసిద్ది చెందింది. మీరు కరూర్ లో ఉన్నపుడు ఈ ప్రాంతాన్ని తప్పక సందర్శించాలి.

చిత్రకృప : Marcus334

నేరుర్ శ్రీ సదాశివ భ్రమే౦ద్ర ఆలయం

నేరుర్ శ్రీ సదాశివ భ్రమే౦ద్ర ఆలయం

శ్రీ సదాశివ భ్రమేంద్ర ఆలయం నేరుర్ వద్ద ఉంది. ఇక్కడ శ్రీ సదాశివ భ్రమేంద్ర సన్యాసి సమాధి ఉంది. ఈయన కాంచీపురా మఠానికి బాధ్యతా చేపట్టిన గురువులలో ఒకరు. ఈ సమాధిని తొండైమన్ వంశ పాలకుడైన విజయ రాగునతాన్ తోడైమన్ నిర్మించారు.

చిత్రకృప : பா.ஜம்புலிங்கம்

పుగాలిమలై శ్రీ ఆరుపడై మురుగన్ ఆలయం

పుగాలిమలై శ్రీ ఆరుపడై మురుగన్ ఆలయం

పుగాలిమలై శ్రీ ఆరుపడై మురుగన్ ఆలయం కావేరి నది సమీపంలో వేలయుతన్పాలయం వద్ద కొండపైన ఉన్నది. అందమైన శిల్పాలకు ప్రసిద్ది చెందిన ఈ ఆలయం చేరాల సమయంలో నిర్మించబడింది. ఇక్కడి ప్రధాన దేవత మురుగన్ లేదా సుబ్రమణ్యం.

చిత్రకృప : Balaji

తిరుముక్కుడల్

తిరుముక్కుడల్

తిరుముక్కుడల్ సంఘం అనే అర్ధం వచ్చే ‘ముక్కుడల్' అనే పదం నుండి వచ్చింది. తిరుముక్కుడల్ పలర్, చెయ్యర్, వేగవతి అనే మూడు నదుల సంగమం. ఇక్కడికి సమీపంలో తొండైమన్ వంశ పరిపాలనలో నిర్మించిన పురాతన ఆలయం ఉంది. అగస్తిశ్వర, అ౦జనాక్షి ఈ ఆలయ ప్రధాన దేవతలు.

చిత్రకృప : Kadsree

సోలియమ్మన్ ఆలయం

సోలియమ్మన్ ఆలయం

ఆలయం, పట్టణ౦ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతుర్ లో ఉంది. ప్రతి ఏటా జూన్ నెలలో, సోలియమ్మన్ ఆలయంలో ప్రసిద్ధ పండుగ నిర్వహిస్తారు. ఈ ఆలయానికి సమీపంలో సోలియేశ్వర్ ఆలయం, మునియప్పాన్ ఆలయం, వరదరాజ పేరుమల్ ఆలయం, చిన్న మరియమ్మన్, పెరియ మరియమ్మన్ ఆలయం ఉన్నాయి.

చిత్రకృప : Senthilrs

శ్రీ కరువుర్ మరియమ్మన్ ఆలయం

శ్రీ కరువుర్ మరియమ్మన్ ఆలయం

కరువుర్ లోని మరియమ్మన్ ఆలయం ఈ ప్రాంత ప్రధాన ఆలయాలలో ఒకటి. ఇది రాష్ట్రంలోని అమ్మవారి ఆలయాలలో అతిపెద్దది. మే నెలలో నిర్వహించే ఈ ఆలయ వార్షిక పండుగ ఈ ఆలయానికి అత్యంత శుభప్రదమైన రోజు.

చిత్రకృప : Vadugapattii

కరూర్ విహార ప్రదేశాలు

కరూర్ విహార ప్రదేశాలు

మాయనూర్, తిరుముక్కడల్ కాకుండా కరూర్ లో ఇతర విహార ప్రదేశాలు ఉన్నాయి.

చేట్టిపలయం - అమరావతి బెడ్ రెగ్యులేటర్, పార్క్

నేరూర్ - పవిత్ర మఠం, నది వైపు పార్క్, ధ్యానం

కడవూరు - పొన్నియర్ ఆనకట్ట, పార్క్

చిత్రకృప : sk_vel

కరూర్ ఎలా చేరుకోవాలి ?

కరూర్ ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం : 91 కిలోమీటర్ల దూరంలో ట్రిచి ఎయిర్ పోర్ట్ కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో కరూర్ చేరుకోవచ్చు.

రైలు మార్గం : కరూర్ లో రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడికి చెన్నై, ట్రిచి మరియు ఇతర పట్టణాల నుండి రైళ్ళు వస్తుంటాయి.

రోడ్డు మార్గం : చెన్నై మరియు సమీప పట్టణాల నుండి కరూర్ కు ప్రభుత్వ/ ప్రవేట్ తిరుగుతుంటాయి.

చిత్రకృప : Balaji

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+