Search
  • Follow NativePlanet
Share
» »బ్రహ్మంగారి మఠం వద్ద అద్భుత గుహలు !!

బ్రహ్మంగారి మఠం వద్ద అద్భుత గుహలు !!

By Mohammad

ఎతికి చూసే కళ్ళు ఉండాలేగానీ ఈ ప్రపంచంలో చూడటానికి విచిత్రాలకు కొదువలేదు. వింతల్ని చూసి అవాక్కవడం, ఉత్సాహపడటం మనవంతయితే ... ప్రేమతో చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా పలకరించడం ప్రకృతి వంతు..ఇదివరకే మీరు నల్లమల్ల అడవులలో దాగి ఉన్న వజ్రాల కొండ గుహ గురించి తెలుసుకున్నారు. ఇది కర్నూలు జిల్లా, అహోబిలం వద్ద గల నల్లమల్ల అడవులలో ఉన్న ప్రదేశం. మరింత సమాచారం కోసం చదవండి: నల్లమల్ల వజ్రక కొండ గుహలో దాగిన మహా అద్భుతం !!

అలాగే ఇంకొక ప్రదేశం కూడా ఉంది. ఇప్పుడు దాని గురించే చెప్పబోతున్నది. చెప్పాలంటే నల్లమల్ల అడవులలో బయటి ప్రపంచానికి తెలియని గుహలు అనేకం ఉన్నాయి. వాటిలో కడప జిల్లా మైదుకూరు సమీపంలో బ్రహ్మంగారి మఠం సమీపాన గల నల్లమల్ల కొండల్లో కొన్ని గుహలు ఉన్నాయి. వీటి గురించి ఒకసారి తెలుసుకున్నట్లయితే ...

రేఖాచిత్రాలు

రేఖాచిత్రాలు

కడప జిల్లా లో ఉన్న మైదుకూరు గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ 2014 వ సంవత్సరంలో ఆదిమానవునికి సంబంధించిన రేఖాచిత్రాలను గుర్తించినారు.

Photo Courtesy: Michael Gunther

మైదుకూరు

మైదుకూరు

మైదుకూరు నుండి జీవీస‌త్రం మీదుగా య‌ర్ర‌బ‌ల్లె_గంగాయ‌ప‌ల్లె ప‌ల్లెల నుండి జొన్న‌పుచెరువు లో నుండి ఒక రహ‌దారి ఉంది.. ఆ ర‌హ‌దారి ఇంత‌కు ముందు నారాయ‌ణ‌స్వామి మ‌ఠం నుండి బ్ర‌హ్మంగారి మ‌ఠం వ‌ర‌కు వెళ్తుంది..

Photo Courtesy: Sultankhadar

బ్రహ్మంగారి మఠం

బ్రహ్మంగారి మఠం

వెళుతూ వెళుతూ దారి మధ్యలో గల బ్రహ్మంగారి మఠం చూసుకుందాం. బ్రహ్మంగారి మఠం చాలా ప్రశస్తి చెందినది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞాన బోధనలు చేసే, రచించే ఒక యోగి, సంఘసంస్కర్త మరియు గొప్ప హేతువాది. వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఇక్కడ ఒక ఆలయం కూడా ఉన్నది.

Photo Courtesy:Chavakiran

బ్రహ్మేంద్ర స్వామి ఆలయం

బ్రహ్మేంద్ర స్వామి ఆలయం

బ్రహ్మేంద్ర స్వామి కాల జ్ఞానంలో ప్రభోదించిన విషయాలు చాలా వరకు జరిగినాయి. బ్రహ్మం గారు తల్లిని వదిలి పుణ్యక్షేత్రాలను చూసేందుకై దేశాటన చేస్తూ రాయలసీమ ప్రాంతాలైన కర్నూలు మరియు కడప జిల్లాలలో భక్తులను సంపాదించాడు. కనుకనే రాయలసీమ జిల్లాలో భక్తులు ఎక్కువగా కనిపిస్తారు.

Photo Courtesy:Chavakiran

గుహలు

గుహలు

బ్రహ్మం గారి మఠం దగ్గర గల న‌ల్ల‌మ‌ల కొండ‌ల్లో ఉన్న దారి గుండా కొద్ది దూరం వెళ్లి(అనగా రెండు మైళ్లు) ఉత్త‌రం వైపు వెళ్లితే.. గుహ‌లు వంద‌వ‌ర‌కు క‌న్పిస్తాయి..

Photo Courtesy: commons.wikimedia

గుహలు

గుహలు

ఇందులో కొన్ని గుహ‌లు మ‌ట్టిపెళ్ల‌లు.. కొండ‌చ‌రియ‌లు విరిగి ప‌డి మూసిపెట్టుకుపోగా.. వేళ్ల‌మీద లెక్కించే నాలుగైదు పెద్ద గుహ‌లు క‌న్పిస్తాయి.

Photo Courtesy: commons.wikimedia

గుహలు

గుహలు

ఆ నాలుగైదు గుహల ముఖ‌ద్వారం చిన్న‌దిగా ఉన్న‌ప్ప‌టికీ లోప‌లికి వెళ్లితే.. చాలా పెద్ద‌విగా కనిపిస్తాయి.

Photo Courtesy: commons.wikimedia

గుహలు

గుహలు

మొద‌ట్లోనే ఈ గుహాలు ప్ర‌కృతి ప‌రంగా యాత్రికులను ఎంతగానో మైమరిపిస్తున్నాయి.

Photo Courtesy: commons.wikimedia

గుహలు

గుహలు

గుహలో లోపలికి వెళ్లే కొలది చీకటిమరింత దట్టంగా ఉంటుంది అయినా కూడా 50 అడుగుల లోనికి వరకు వెళ్ళగలిగే విధంగా ఉంటుంది.

Photo Courtesy: commons.wikimedia

గుహలు

గుహలు

ఇక్కడ ఉన్నమ‌రో గుహ‌లో ఈశ్వ‌రుడు కొలువై ఉన్నాడు. ఆ గుహలో నీటి ల‌భ్య‌త కూడా ఉంది.

Photo Courtesy: commons.wikimedia

 గుహలు

గుహలు

గుప్త‌నిధులు కోసం కొంత మంది దుండగులు గుహలోని ఈశ్వరుని విగ్రహాన్ని పెకిలించిన దృశ్యాలు కనపడతాయి.

Photo Courtesy: commons.wikimedia

 గుహలు

గుహలు

గుహ‌లో కొలువైన ఈశ్వరుడు గ‌వి మ‌ల్వేశ్వ‌రుడిగా న‌ల్ల‌మ‌ల చుట్టుప‌క్క‌ల గ్రామాల ప్ర‌జ‌లచే పూజించబడుతున్నాడు.

Photo Courtesy: commons.wikimedia

 గుహలు

గుహలు

గుహ ప్ర‌త్యేక‌త‌ను అంద‌రికీ తెలియ‌జేసేందుకు గ‌విమ‌ల్లేశ్వ‌రుడికి విగ్ర‌హ‌ప్ర‌తిష్ట చేయ‌డంతోపాటు.. గుహ‌లోనికి భ‌క్తులు వెళ్లేవిధంగా తీర్చిదిద్దారు.

Photo Courtesy: commons.wikimedia

 గుహలు

గుహలు

గుహలోకి వంగి వెళ్లే ఇరుకైన ఎర్రని మార్గం

Photo Courtesy: commons.wikimedia

 గుహలు

గుహలు

ఇక్కడున్న గుహలలో మరో గుహ

Photo Courtesy: commons.wikimedia

 గుహలు

గుహలు

గుహలో మరో రెండు గుహలు

Photo Courtesy: commons.wikimedia

 గుహలు

గుహలు

గుహలోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న పర్యాటకులు

Photo Courtesy: commons.wikimedia

గుహల పరిసరాలు

గుహల పరిసరాలు

కాసింత మంచం వేసుకొని సేదతీరటానికి లేదా దుప్పట్లు పరుచుకొని విశ్రాంతి తీసుకోవడానికి గల సత్రం

Photo Courtesy: commons.wikimedia

భక్తులు

భక్తులు

గుహలోని శివుణ్ని దర్శించుకొని వస్తున్న భక్తులు

Photo Courtesy: commons.wikimedia

గుహలు

గుహలు

మ‌నిషి నిల‌బ‌డి నడిచెంత రంధ్రంతో గుహలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

Photo Courtesy: commons.wikimedia

ఎలా చేరుకోవాలి ??

ఎలా చేరుకోవాలి ??

విమాన మార్గం

బ్రహ్మంగారి మఠానికి సమీపంలో ఉన్న ఏర్ పోర్ట్ కడప ఏర్‌పోర్ట్. ఇక్కడి నుండి హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, చెన్నై నగరాలకు ప్రయాణించవచ్చు. ఇది ఒక కొత్త ఏర్ పోర్ట్. క్యాబ్ లేదా ఇతర ప్రైవేట్ వాహనాల మీద కానీ లేదా కడప బస్ స్టాండ్ నుండి కానీ బ్రహ్మంగారి మఠానికి చేరుకోవచ్చు.

రైలు మార్గం

బ్రహ్మంగారి మఠానికి సమీప రైల్వే స్టేషన్ కడప రైల్వే స్టేషన్. కడప నుండి కందిమల్లాయపల్లె కి వయా మైదుకూరు ద్వారా చేరుకోవచ్చు. మైదుకూరు నుండి ఇది 37 కిలోమీటర్ల దూరంలో ఉంది.


రోడ్డు మార్గం

బ్రహ్మంగారి మఠం, కడప నుండి 60 కి. మీ. దూరంలో ఉన్నది. ఇక్కడికి కడప, మైదుకూరు మరియు చుట్టుప్రక్కల పట్టాణాల నుండి ఆర్టీసీ బస్సులు నడుస్తాయి.

Photo Courtesy: Vinayaraj

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+