Search
  • Follow NativePlanet
Share
» »ఇండియాలోని ఈ కూల్‌ హోటళ్ల‌ను వేస‌విలో సంద‌ర్శించండి..

ఇండియాలోని ఈ కూల్‌ హోటళ్ల‌ను వేస‌విలో సంద‌ర్శించండి..

ఇండియాలోని ఈ కూల్‌ హోటళ్ల‌ను వేస‌విలో సంద‌ర్శించండి..

ఎండాకాలం వచ్చిందంటే ఏం చేస్తారు? ఎవ‌రైనా చ‌ల్ల‌ని ప్ర‌దేశాల కోసం వెతుకులాట మొద‌లెడ‌తారు. భారతదేశంలో చల్లని ప్రదేశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి వేసవి నుండి తప్పించుకోవడానికి సరైనవి. మంచుతో కప్పబడిన పర్వతాల నుండి నది పక్కన ఆహ్లాదకరమైన బసను అందించే ఎన్నో ప్ర‌దేశాలు భారతదేశంలో చాలానే ఉన్నాయి. ఇండియాలోని చాలా హోట‌ల్స్ వేస‌వి వేడి నుండి ఉప‌శ‌మ‌నం అందించేందుకు మీకు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. మ‌రెందుకాల‌స్యం ఆ హోట‌ల్స్ ఏంటో ఓసారి చూసేద్దామా..

tajtheogresortandspa1

తాజ్ థియోగ్ రిసార్ట్ మరియు స్పా, హిమాచల్ ప్రదేశ్

వేస‌వి నుండి త‌ప్పించుకోవాల‌నుకునేవారికి తాజ్ థియోగ్ రిసార్ట్ మ‌రియు స్పాహిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌సిద్ధ ప్రాంతాలు. తాజ్ థియోగ్ సిమ్లా నగరంలోని థియోగ్‌లో ఉంది. థియోగ్ యొక్క నిశ్శబ్ద పరిసరాలు ఇక్క‌డికి వ‌చ్చే సంద‌ర్శ‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. అంతేకాకుండా ఈ ప్రాంతానికి స‌మీపంలో చియోగ్, ఫాగు, కుఫ్రి, చైల్ మరియు సైంజ్ వంటి ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. వీటిని సంద‌ర్శించేందుకు కాస్త మీ సమయాన్ని వెచ్చించండి. ఈ హోట‌ల్‌లో బ‌స‌చేసేందుకు కాస్త ఖ‌ర్చు ఎక్కువ‌గానే ఉంటుంద‌నుకోండి.

hotelpine

వెల్‌క‌మ్ హోట‌ల్ పైన్-ఎన్-పీక్, కాశ్మీర్

వెల్‌క‌మ్ హోట‌ల్‌ పైన్-ఎన్-పీక్ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉంది. ఇది దట్టమైన పైన్ అడవులు, కాశ్మీరీ సంస్కృతి మరియు సంప్రదాయాల‌కు ఎంత‌గానో ప్ర‌సిద్ధిగాంచింది. ఈ హోటల్ లోయ నుండి వీక్షిస్తే కాశ్మీర్ అందాల‌న్నీ మీకు క‌నిపిస్తాయి. ఇది కాశ్మ‌ర్‌లోని బోలేవార్డ్ రోడ్‌లో ఉన్న ప్ర‌సిద్ధ మ‌రియు ఉత్త‌మ‌మైన హోట‌ల్‌ల‌లో ఒక‌టి. ఈ హోట‌ల్ శ్రీ‌న‌గ‌ర్‌లో ఎంత‌గానో ప్ర‌సిద్ధి చెందిన దాల్‌స‌ర‌స్సుకు ఎదురుగా ఉంది. శ్రీ‌న‌గ‌ర్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం నుండి 12 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది.

casahimalaya

కాసా హిమాలయా, ఉత్తరాఖండ్

కాసా హిమాలయా ఔలిలో ఉంది. భారతదేశంలోని ప్రధాన గమ్యస్థానాలలో ఔలీ ఒకటి అని మనందరికీ తెలుసు. కానీ వేసవి కాలంలో సంద‌ర్శించేందుకు ఇది ఎంతో గొప్ప ప్ర‌దేశం. పర్వతాల‌కు ఎదురుగా ఉన్న స్వతంత్ర కాటేజీలలో బ‌స చేయ‌డం ఎంతో ఆనందాన్ని క‌లిగిస్తుంది. నందా దేవి శిఖరాన్ని ఈహోట‌ల్‌ను నుండే వీక్షించొచ్చు.

granddragonladakh

గ్రాండ్ డ్రాగన్ లడఖ్, లేహ్

గ్రాండ్ డ్రాగన్ లడఖ్ ఈ ప్రాంతంలోని మొదటి ఫైవ్ స్టార్ హోటళ్లలో ఒకటిగా ప్ర‌సిద్ధి చెందింది. లేహ్‌ని సంద‌ర్శించాల‌ని అనుకుంటే మాత్రం ఈ హోట‌ల్‌లో త‌ప్ప‌కుండా బ‌స చేయండి. ఎందుకంటే, ఈ ప్రాంతం ఎంతో ప్ర‌శాంతంగా ఉంటుంది. విశ్రాంతి తీసుకునేందుకు ఎంతో అనువుగా ఉంటుంది. ఇక్కడినుంచే మంచుతో కప్పబడిన పర్వతాల దృశ్యాల‌ను చూసేయొచ్చు.

tamarakodai

తమరా కోడై, తమిళనాడు

సుందరమైన కొడైకెనాల్‌లో ఉన్న తమరా కొడై హోట‌ల్‌ ఈ వేసవిలో విశ్రాంతి తీసుకునేందుకు ఉత్త‌మ‌మైన‌ది. ఈ హోట‌ల్‌కి ద‌గ్గ‌ర‌లో ట్రెక్కింగ్ చేసే ప్ర‌దేశాలు, న‌డ‌క‌మార్గం ద్వారా ప్ర‌యాణం చేసే అంద‌మైన ర‌హ‌దారులు ఎన్నో ఉన్నాయి. త‌మిళ‌నాడులోని ఈ హోట‌ల్ ప్ర‌కృతి అందాల మ‌ధ్య‌న దాగి ఉంటుంది. ఈ హొట‌ల్‌లో బ‌స చేయ‌డం అంటే ప్ర‌కృతిలో బ‌స చేసిన‌ట్లుగానే ఉంటుంది.

chumbimountainretreat

చుంబి మౌంటైన్ రిట్రీట్, సిక్కిం

ప్రసిద్ధ పర్యాటక పట్టణం పెల్లింగ్‌లో ఉన్న చుంబి మౌంటైన్ రిట్రీట్‌లో బస చేయడం వ‌ల్ల మీరు ఎంతో విశ్రాంతిని, ప్ర‌శాంత‌త‌ను పొందుతారు. తెల్లవారుజామున దాదాపు నాలుగు గంట‌ల స‌మ‌యంలో ఖంగ్‌చెండ్‌జోంగా పర్వతం మీదుగా వ‌చ్చే సూర్యోద‌యం చూసేందుకు ఇక్క‌డికి ప‌ర్యాట‌కులు బారులు తీరుతారు. ఆ ప‌ర్యాట‌కుల జాబితాలో మీరు చేరిపోండి. ఇది మ‌రిచిపోలేని ఓ అనుభూత‌నే చెప్పుకోవాలి.

More News

    Read more about: taj theog resort and spa
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+