ఆగస్టు పదిహేను సెలవులకు ఈ ప్రాంతాలను చుట్టేయండి..!
ప్రతి ఒక్కరూ ప్రయాణాలను ఇష్టపడతారు. కానీ ఈ బిజీ లైఫ్‌లో ప్రయాణం చేయాలన్న సమయం దొరకడం చాలా కష్టం అయిపోయింది. అయితే ఈ నెలలో ఆగస్ట్ 15 సెలవుల కోసం ఎదురు చూస్తున్నట్లయితే, ఈ సెలవుల్లో సంతోషంగా గడపాలనుకుంటే మాత్రం ఈ ప్రదేశాలను తప్పకుండా సందర్శించండి. ఆగస్టు మూడో వారంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఈ రోజు ప్రతిచోటా సెలవు ఉంటుంది. ఈ సెలవుల్లో ఇంట్లో కూర్చొని విసుగు చెందకుండా భారతదేశంలోని ఈ ప్రదేశాలను సందర్శించడానికి ప్లాన్ చేసుకోండి. మరెందుకాలస్యం బయలుదేరండి.
ఖజురహో ఆలయం
ఖజురహో దేవాలయం దాని అందమైన పెయింటింగ్స్, చరిత్రకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో ఉంది. ఈ దేవాలయంలోని శిల్పకళ మరియు శిల్పాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు. చండేలా పాలకులు నిర్మించన ఖజురహో దేవాలయాల సమూహం దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన చారిత్రక ప్రదేశాల్లో ఒకటి. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా సందర్శించాల్సిన అరుదైన చారిత్రక పట్టణం ఇది. వాస్తవానికి ఇక్కడ 85 దేవాలయాలు నిర్మించారని అంటున్నా.. ప్రస్తుతం 23 మాత్రమే మిగిలి ఉన్నాయి.

చిక్కమగళూరు
నైరుతి భారతదేశంలోని కర్నాటకలోని పర్వత నగరం చిక్కమగళూరు, ప్రకృతి సమృద్ధితో మిళితమై ఉన్న కొన్ని పర్యాటక ప్రదేశాలలో ఇది ఒకటి. జంతువులు, ఉత్సాహం, చారిత్రాత్మక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. చిక్‌మగళూరు వివిధ మత సంప్రదాయాల మిశ్రమంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. సముద్ర మట్టానికి 3,400 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పర్వత గ్రామం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. చిక్‌మగళూరులో సందర్శించడానికి అనేక ప్రదేశాలు ఉన్నాయి.

చిత్తోర్‌గఢ్
రాజస్థాన్‌లోని సిర్‌మూర్‌గా పిలువబడే చిత్తోర్‌గఢ్ కోటను చూడటానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ఇది భారతదేశంలోని అతిపెద్ద కోటలలో ఒకటి. రాజస్థాన్ రాచరిక శైలిని ఇష్టపడే వారు ఖచ్చితంగా ఈ పర్యాటక ప్రదేశాన్ని సందర్శించండి. చిత్తోర్‌గఢ్ రాజ్యానికి చిత్తోర్‌కోట నిలయం. ముస్లింలు దీనిపై మూడుసార్లు దాడిచేసి కొల్లగొట్టారు.1303 లో అలావుద్దీన్ ఖిల్జీ, తరువాత మళ్ళీ 1535 లో గుజరాత్ బహదూర్ షా, 1568 లో మొఘల్ రాజు అక్బర్ కొల్లగొట్టారు.

బికనీర్
బికనీర్ రాజస్థాన్‌లోని అద్భుతమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడింది. ఈ నగరం నాగరికత, సంస్కృతి మరియు చారిత్రక కోటలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. బికనీర్‌లో ఉన్న జునాగర్ కోట ఆకర్షణకు కేంద్రంగా ఉంది. అంతే కాకుండా బికనీర్ సమీపంలోని కర్ణి మాత ఆలయం కూడా సందర్శించడానికి ఓ గొప్ప ప్రదేశం. ఈ ఆలయాన్ని ఎలుక దేవాలయం అని కూడా అంటారు. ఈ సెలవుల్లో తప్పకుండా ఈ ప్రాంతాన్ని సందర్శించొచ్చు.

షిల్లాంగ్
మేఘాలయ రాజధాని షిల్లాంగ్, దాని అందం కారణంగా పర్యాటకులలో చాలా ప్రసిద్ధి చెందింది. దీనిని సరస్సుల నగరం అని కూడా అంటారు. ఇక్కడ ఎలిఫెంట్ ఫాల్స్ చూడదగ్గ ప్రదేశం. ఈ జలపాతం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇది షిల్లాంగ్‌లో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడింది.



Click it and Unblock the Notifications














