Search
  • Follow NativePlanet
Share
» » యుద్ధ పర్యటనా ప్రదేశాలు !

యుద్ధ పర్యటనా ప్రదేశాలు !

భారత దేశంలో అనేక భయంకర యుద్ధాలు జరిగిన ప్రదేశాలు కలవు. వీటిలో మీరు ఎపుడైనా పర్యటి న్చారా ? ఇండియా లో హనీమూన్, లేదా విశ్రాంతి ప్రదేశాలే కాదు, అనేక యుద్ధాలు జరిగిన, చారిత్రక ప్రదేశాలు కూడా కలవు. ఇండియా లో యుద్ధ ప్రదేశాలు దేశం అంతా వ్యాప్తి చెంది వున్నాయి. ఆ ప్రదేశాలు ఏవి? అవి పర్యాటకులకు అనువైనవేనా అనే అంశాలు పరిశీలిస్తే ....

యుద్ధ్లం జరిగిన అతి ప్రాచీన క్షేత్రం

 యుద్ధ పర్యటనా ప్రదేశాలు !
కురుక్షేత్ర
కురుక్షేత్ర లో మహాభారత యుద్ధం పాండవులకు, కౌరవులకు మధ్య జరిగింది. సరిగ్గా ఈ ప్రదేశంలోనే శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవత్ గీతను కూడా బోధించాడు. చాలా మహత్తరమైన ప్రదేశం ఇది. ఇక్కడ పర్యటనకు అనేక ఆకర్షణీయ ప్రదేశాలు కలవు. అవి భీష్మ కుండ్, బ్రహ్మ సరోవర్, జ్యోతిసార్. వీటికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలదు.

జిలియన్ వాలా బాగ్
జిలియన్ వాలా బాగ్ ఒక పబ్లిక్ గార్డెన్. ఈ ప్రదేశం పంజాబ్ లోని అమృత్ సర్ పట్టణంలో కలదు. ఈ ప్రదేశంలో బ్రిటిష్ వారు అనేకమంది అమాయకులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపి వేయడంతో ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందినది. చనిపోయిన వారి జ్ఞాపకార్ధం ఇక్కడ ఒక స్మారకం నిర్మించారు

ఇంఫాల్
ఇంఫాల్ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగింది. ఇది కూడా చాలామందికి తెలియకపోయి నప్పటికీ, ప్రపంచ చరిత్రలో ప్రసిద్ధంగా పేర్కొనబడింది. ఆసియ లోని ఈ ప్రదేశంలో ప్రపంచయుద్ధ సమయంలో జపాన్ సైన్యం మొట్టమొదటి సారిగా ఓడించబడింది. జపాన్ సైన్యాలు ఇండియా పైకి యుద్ధానికి వచ్చి ఒడింప చూసాయి. మిత్ర కూటములకు చెందిన ఇంఫాల్ బలగాలను విధ్వంసం చేసాయి. ఈ యుద్ధ పర్యటనా భూమిలో ఒక స్మశానాన్ని ఏర్పరచారు. ఇది రెండవ ప్రపంచ యుద్ధంలో తమ అసువులు కోల్పోయిన సైనికులకు నివాళిగా ఈ స్మారకం ఏర్పడింది.

 యుద్ధ పర్యటనా ప్రదేశాలు !

పానిపట్
ఈ ప్రదేశంలో ప్రసిద్ధ పానిపట్ యుద్ధం జరిగింది. ఈ ప్రదేశం హర్యానాలో కలదు. ఈ యుద్ధాలు ఆ కాలంలో గల వివిధ రాజ వంశాలకు చెందినవి. పానిపట్ లో మూడు యుద్ధాలు జరిగాయి. అవి 1526, 1556 మరియు 1761 సంవత్సరాలలో జరిగాయి. ఈ యుద్ధ పర్యటనా ప్రదేశంలో ఇబ్రహీంలోడి సమాధి ఒక ప్రసిద్ధ ఆకర్షణ.

కార్గిల్
కార్గిల్ ప్రదేశం అంతా పర్వతాల ప్రదేశం. ఇది పాకిస్తాన్ తో మనకు సరిహద్దు గా లైన్ అఫ్ కంట్రోల్ కు సమీపంలో కలదు. ఈ యుద్ధం 1999 సంవత్సరంలో ఇండియా - పాకిస్తాన్ ల మధ్య జరిగింది. ఈ యుద్ధాన్ని 'ఆపరేషన్ విజయ్ ' అని పిలుస్తారు. దీనికి చారిత్రక ప్రాధాన్యత కాక, ఇక్కడ ప్రసిద్ధి చెందిన బౌద్ధ ఆరామాలు కలవు.

ఢిల్లీ
ఢిల్లీ నగరం లో అనేక చిన్న, పెద్ద యుద్ధాలు జరిగాయి. ఇండియాలో ఢిల్లీ ప్రసిద్ధి చెందిన యుద్ధ పర్యటనా భూమి. ఇక్కడ జరిగిన యుద్ధాల కారణంగానే, ఢిల్లీ చరిత్ర పుస్తకాలలో ప్రసిద్ధి చెందిన నగరంగా పేర్కొనబడింది. ఢిల్లీ లో ప్రధాన యుద్ధ భూములు ఢిల్లీ గేటు, ఖూని దర్వాజాలు.

మైసూరు
మైసూరు నగరానికి సంబంధించి అనేక యుద్ధాలు కలవు. అనేక ఆంగ్లో - మైసూరు యుద్ధాలు ఇక్కడ జరిగాయి. వాటిలో టిప్పు సుల్తాన్ కు బ్రిటిష్ వారికి మధ్య నడిచిన యుద్ధం ఒకటి. ఈ యుద్ధాలు చాలా వరకు 1767 - 1789 ల మధ్య జరిగి బ్రిటిష్ బలగాలకు స్వాతంత్ర పోరాట సమయంలో ఒక పెద్ద బెడద గా ఉండేవి.

ఎన్ని యుద్ధాలు జరిగినప్పటికీ ఇండియా దాని స్వంత సంస్కృతి మాత్రం కోల్పోలేదు. భారతీయ సంస్కృతి, వారసత్వం, హిస్టరీ, పర్యటన వంటివి ఈ ప్రదేశాలలో గతంలో కంటే అధికమై విరాజిల్లుతున్నాయి. వీరులు పోరాడిన ఈ యుద్ధ భూములను పర్యటించి, అక్కడ కల స్మారకాలు, అభివృద్ధి చెందిన పర్యాటక ప్రదేశాలు సందర్శించి గొప్ప అనుభూతులు పొందండి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+