Search
  • Follow NativePlanet
Share
» »వీకెండ్లో మైసూర్ ట్రిప్ !!

వీకెండ్లో మైసూర్ ట్రిప్ !!

బెంగుళూరు లో కనుక మీరు వుంటే, ఒక వారాంతం సెలవులలో చారిత్రక పట్టణం మైసూరు నగరం తేలికగా పర్యటించి రావచ్చు.
మైసూరు నగరం ఒకప్పుడు గ్రానైట్ కోట గోడలు, అడవులు, దేవాలయాలు మొదలైన వాటితో గ్రేట్ టి పు సుల్తాన్ రాజ్యంగా వుండేది. కాలం ఎంత గడిచినప్పటికీ మైసూరు అండ చందాలు పెరగటమే కానీ అభివృద్ధి పేరుతో ఎక్కడా తగ్గ లేదు. కర్నాటక రాష్ర సాంస్కృతిక రాజదానిగా పేరు పడింది. బెంగుళూరు లో వుండే వారికి ఒక వారాంతంలో ఇంత కంటే మంచి విహార ప్రదేశం ఏమి వుంటుంది ? కనుక మీ పని ఒత్తిడి పక్కన పెట్టి వారాంతం లో వచ్చే ఒకటి రెండు రోజులూ మైసూరు కు ప్రయాణం కట్టండి. మైసూరు పట్టణం బెంగుళూరు నుండి 145 కి. మీ. లు. అంటే, రోడ్డు ప్రయాణంలో సుమార్గా మూడు లేదా నాలుగు గంటల ప్రయాణంలో చేరవచ్చు.

మైసూరు పాలస్

మైసూరు పాలస్

ఒక్కసారి మైసూరు పాలస్ చూస్తె చాలు, దాని అందాలు ఎప్పటికి మరువ లేరు. ఈ కారణంగానే అందరూ ముందుగా ఈ పాలస్ కు వెళతారు. రాత్రి వేల దేపాల వెలుగుల లో ఈ పాలస్ మరింత అద్భుతంగా ఉంటంది.

లలితా మహల్ పాలస్

లలితా మహల్ పాలస్

లలితా మహల్ ప్లేస్ మైసూరు ఎయిర్ పోర్ట్ నుండి 15 కి. మీ. ల దూరంగా వుంటుంది. ఇపుడు ఈ పాలస్ ను ఒక ఫైవ్ స్టార్ హోటల్ గా తీర్చి దిద్దారు. Photo Courtesy: Curt Smith

జగన్మోహన్ పాలస్

జగన్మోహన్ పాలస్

జగన్మోహన పాలస్ మైసూరు లోని అతి పురాతన పాలస్. 1897 లో ఈ పాలస్ అగ్ని ప్రమాదానికి గురి అయ్యేవరకూ మైసూరు రాజ కుటుంబం ఈ భవనం లో నివాసం వుండేది. ఈ పాలస్ ని అగ్ని ప్రమాదం తర్వాత పునరుద్ధరించారు.

జయలక్ష్మి విలాస్ మాన్షన్

జయలక్ష్మి విలాస్ మాన్షన్

జయలక్ష్మి విలాస్ పాలస్ మైసూరు లోని అందమైన భవనాలలో ఒకటి. మైసూరు యూనివర్సిటీ గార్డెన్ లు సమీపంలో వుంటుంది. అందంగా చెక్కబడిన ద్వారాలు కిటికీలు కలిగి మంచి అలంకరణ కల్గ వుంటుంది. ఈ భవనం లో ప్రదర్శన కు ఉంచిన కళాకృతులు చూడటం మరువకండి.

బృందావన్ గార్డెన్స్

బృందావన్ గార్డెన్స్

మైసూరు లో బృందావన్ గార్డెన్ పర్యాత కులకు ప్రధాన ఆకర్షణ్. తప్పక చూసి తీర వలసినది. సాయం కాల వేళలో ఇక్కడ వెలిగే దీపాలు,మ్యూజికల్ ఫౌంటెన్ లు తప్పక చూడ దగినవి.

రైల్ మ్యూజియం

రైల్ మ్యూజియం

ఇండియా లో ఇది ఒక ప్రత్యేక మ్యూజియం. ఈ మ్యోజియం లో రైల్వే వ్యవస్థ అభివృద్ధి ప్రదర్శించ బడుతుంది. ఇక్కడ కల టాయ్ ట్రైన్ లో తిరిగి ఆనందించవచ్చు.

చాముండి హిల్స్

చాముండి హిల్స్

చాముండి హిల్స్ సందర్శనలో మీరు కొండ పై భాగాన కల చాముండి మాత టెంపుల్ చూడవచ్చు. కొండపై నుండి చూస్తె నగర దృశ్యం అద్భుతంగా వుంటుంది.

Photo Courtesy: Ramesh NG

సెయింట్ ఫిలోమినా చర్చి

సెయింట్ ఫిలోమినా చర్చి

సెయింట్ ఫిలోమినా చర్చి ఐ సెయింట్ జోసెఫ్ చుర్చ్ అని కూడా అంటారు. మైసూరు లో ఇది ఒక ప్రసిద్ధ ఆకర్షణ. చర్చి నిర్మాణం గోతిక్ శిల్ప శైలి కలిగి వుంది.

Photo Courtesy: Karthik sripal

మైసూరు జూ

మైసూరు జూ

మైసూరు జంతు ప్రదర్శన శాలను మైసూర్ మహారాజు చామరాజ ఒడయార్ నిర్మించారు. మొదట్లో దీనికి ప్రజలకు సందర్శనా అనుమతులు ఇచ్చేవారు కారు. తర్వాతి కాలంలో పబ్లిక్ ని అనుమతిస్తునారు. ఇండియా లోని ఉత్తమ మ్యూజియం లలో ఇది ఒకటి. ఇక్కడ మీరు అరుదైన పక్షులను, ఇతర జంతు వులను చూడవచ్చు.
My

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+