Search
  • Follow NativePlanet
Share
» »బెంగుళూరులోని ఈ ప్రాంతాల‌కు లాంగ్‌డ్రైవ్‌కు వెళ్లొచ్చు...!

బెంగుళూరులోని ఈ ప్రాంతాల‌కు లాంగ్‌డ్రైవ్‌కు వెళ్లొచ్చు...!

బెంగుళూరులోని ఈ ప్రాంతాల‌కు లాంగ్‌డ్రైవ్‌కు వెళ్లొచ్చు...!

వర్షాకాలం అంటే ఇంట్లో కూర్చోకుండా బయటకు వెళ్లాలని చాలామంది అనుకుంటారు. ఇక ఉద్యోగ‌స్థుల‌యి సెల‌వులు దొర‌క‌గానే ఈ సీజ‌న్‌లో లాంగ్‌డైవ్‌ల‌కు వెళ్లేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తుంటారు. ఈ సీజన్‌లో అన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా పర్వతాలకు వెళ్లడం సరికాదు. అందుకే బెంగుళూరు సమీపంలోని లాంగ్‌డ్రైవ్‌కు వెళ్లేందుకు అనువైన ప్ర‌దేశాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఇప్ప‌డు తెలుసుకుందాం.

టెక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పిలువబడే బెంగళూరు, కర్ణాటక అత్యంత రద్దీగా ఉండే మహానగరం. ఈ నగరాల చుట్టూ అనేక ఆకర్షణీయమైన, అందమైన గమ్యస్థానాలు ఉన్నాయి. వర్షాకాలంలో ఈ ప్రాంతాల‌ను సందర్శించాల‌ని చాలామందికి ఉంటుంది. ఈ సీజన్‌లో పచ్చదనం ప్రతిచోటా వ్యాపిస్తుంది. ప‌చ్చ‌ని ప్ర‌కృతి న‌డుమ కాసేపు సేద‌తీరాల‌ని అనుకునేవారు, ప్ర‌కృతితో లాంగ్‌డ్రైవ్ చేయాల‌నుకునేవారు చాలామందే ఉంటారు. అలాంటి వారు త‌ప్ప‌కుండా బెంగుళూరులోని ఈ ప్రాంతాల్లో లాంగ్‌డ్రైవ్‌ను ఎంజాయ్ చేయాల్సిందే. మ‌రెందుకాల‌స్యం ప‌దండి లాంగ్‌డ్రైవ్‌కు మీరు సిద్ధ‌మేనా?

1

బెంగళూరు నుండి కూర్గ్

బెంగుళూరు నుండి కూర్గ్ ప్రాంతం లాంగ్‌డ్రైవ్‌కు వెళ్లేందుకు ఎంతో అనువైన ప్ర‌దేశం. ఎందుకంటే, ఇక్క‌డి సుందరమైన దృశ్యాలు ప‌ర్యాట‌కుల‌ను ఇట్టే ఆకర్షిస్తాయి. బెంగుళూరు నుండి కూర్గ్ సుమారు 250 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది. వర్షాకాలంలో ఈ జిల్లా అందాలు చూడాల్సిందే. పచ్చని కాఫీ తోటల నుండి రహస్యమైన పొగమంచు లోయలు, వాటి గుండా వెళ్ళే మలుపుల రోడ్లు, ప‌ర్యాట‌కుల‌కు ఓ కొత్త అనుభూతినిస్తాయి. ఇక్క‌డికి స‌మీపంలోని అబ్బేజ‌ల‌పాత‌పు అందాల‌ను కూడా చూసి తీరాల్సిందే. ఈ ప్రాంతంలో తాజాగా తయారుచేసిన కాఫీ వాసనను ఆస్వాదించాల్సిందే..

చిక్కమగళూరు నుండి బెంగళూరు

బెంగుళూరు నుండి చిక్కమగళూరుకు వెళ్లే మార్గం లాంగ్‌డ్రైవ్‌కు ఎంతో అనువైన ప్ర‌దేశం. ఈ మార్గంలో ప్రశాంతమైన కొండలు, పచ్చని కాఫీ తోటలు ప‌ర్యాట‌కుల‌కు ఆగుపిస్తాయి. ఇక్కడ తాజాగా కాల్చిన కాఫీ గింజల సువాసన ఈ ప్రాంతం గుండా వెద‌జ‌ల్లుతుంది. అంతేకాకుండా, ఇక్క‌డ బాబా బుడంగిరి కొండల అద్భుత దృశ్యాల‌ను చూడొచ్చు. ఇక్కడ రహస్యమైన గుహలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

కర్నాటకలోని ఎత్తైన శిఖరం ముల్లయనగిరి కొండలు పొగమంచుతో కప్పబడి ఉన్నాయి. చుట్టుపక్కల లోయలు కూడా సుందరమైన దృశ్యాలతో నిండి ఉన్నాయి. ఇవే కాకుండా, ఇక్క‌డ కుద్రేముఖ్ నేషనల్ పార్క్, భద్ర వన్యప్రాణుల అభయారణ్యం, హిరేకోలలే సరస్సు వంటి ప్రదేశాలు చాలానే ఉన్నాయి. చిక్క‌మ‌గుళూరు నుండి బెంగ‌ళూరుకు సుమారు 245 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది. సొంత వెహిక‌ల్ ద్వారా కూడా ఈప్రాంతాన్ని చేరుకోవ‌చ్చు.

2

బెంగళూరు నుండి వాయనాడ్

వర్షాకాలంలో బెంగుళూరు నుండి వాయ‌నాడ్‌కు లాంగ్‌డ్రైవ్ వెళ్లొచ్చు. బెంగళూరుకు సమీపంలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో వాయ‌నాడ్ ఒకటి. ఈ ప్రాంతం బెంగుళూరు నుండి సుమారు 270 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతం ప‌ర్యాట‌కుల‌ను ప్ర‌కృతి అందాల‌తో స్వాగ‌తం ప‌లుకుతుంది. ఈ సీజ‌న్‌లో లాంగ్ డ్రైవ్‌ను ఆస్వాదించాల‌నుకునేవారు త‌ప్ప‌కుండా ఇక్క‌డికి రావాల్సిందే. ఇక్కడి పచ్చని ఆకులు, సహజమైన సరస్సులు ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో క‌ట్టిప‌డేస్తాయి.

ఈ ప్రాంత స‌మీపంలో బాణాసుర సాగర్ డ్యామ్ కూడా ఉంది. దీనిని కూడా మీ జాబితాలో చేర్చండి. అంతే కాకుండా, మీన్‌ముట్టి జలపాతం కూడా ఇక్కడి ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ఎన్ ఊరు, వాయనాడ్‌లోని గిరిజన వారసత్వ గ్రామం. ఈ గ్రామంలో ప్ర‌జ‌ల ఆచారాలు, సంస్కృతి సంప్ర‌దాయాలు కాస్త భిన్నంగా ఉంటాయి. వారి ఆచారాల‌ను, సంప్ర‌దాయాల‌ను కూడా తెలుసుకోవ‌చ్చు. ఇక్క‌డి వారితో కాస్త స‌మ‌యం గ‌డిపేయొచ్చు. న‌గ‌ర‌వాసుల‌కు పూర్తి భిన్నంగా ఉంటారు ఈ గ్రామ‌స్తులు. ఎడక్కల్ గుహలను కూడా సంద‌ర్శించొచ్చు.

More News

    Read more about: bangalore to coorg
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+