Search
  • Follow NativePlanet
Share
» »ఆ సరోవరంలో దేవతలను వెలుగు రూపంలో ప్రతి రోజూ దర్శించుకోవచ్చు. ఆ రహస్యం ఏమిటీ?

ఆ సరోవరంలో దేవతలను వెలుగు రూపంలో ప్రతి రోజూ దర్శించుకోవచ్చు. ఆ రహస్యం ఏమిటీ?

మానస సరోవరానికి సంబంధించిన కథనం.

భారతదేశం ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. ఇక్కడే ఎన్నో పురాణాలు వెలిశాయి. ఆ పురాణల్లోని కథలు, పాత్రలు ఎప్పటికీ అంతుచిక్కని రహస్యాలే. అయితే ఆ పురాణాల్లోపేర్కొన్న ఎన్నో రకాల ఘటనలు ఇప్పటికీ మనకి నిత్య అనుభవం. అయితే ఇందుకు తగిన శాస్త్రీయ ఆధారాలు మాత్రం మనకు దొరకవు. ఇటువంటి కోవకు చెందినదే మానస సరోవరం.

ఇది బ్రహ్మ మనస్సు నుంచి పుట్టినదని చెబుతారు. ప్రతి రోజు బ్రహ్మముహుర్తంలో దేవతలు అందరకూ దగ్గర్లోని కైలాస పర్వతం నుంచి ఇక్కడకు వచ్చి స్నానం చేసి వెలుతారని చెబుతారు. అందుకు తగ్గట్టు ఆ వెలుకు కనిపిస్తుంది. అయితే ఆ వెలుగుకు కారణం ఏమిటన్న విషయంమాత్రం ఇప్పటికీ నిఘూడ రహస్యం.

అదే విధంగా కైలాస పర్వతం పై శివుడు నివశిస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. మానస సరోవర, కైలాస పర్వత దర్శనం యాత్ర మొదలైన నేపథ్యంలో అందులోకి విశేషాలు, ఈ యాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీ కోసం....

నిఘూర రహస్యం ఆ వెలుగు

నిఘూర రహస్యం ఆ వెలుగు

P.C: You Tube

మానసిక సంకల్పంతో పాటు శారీరకంగా హిమాలయ వాతారణానికి తట్టుకునే శక్తి ఉన్నవారే మానస సరోవర యాత్రకు వెళ్లాల్సి ఉంటుంది. ఇందు కోసం మన మనస్సును, దేహాన్ని ఎంతో సన్నదం చేయాల్సి ఉంటుంది.

నిఘూర రహస్యం ఆ వెలుగు

నిఘూర రహస్యం ఆ వెలుగు

P.C: You Tube

ఇందుకు కొన్ని నెలల నుంచే సన్నదం కావడం ఉత్తమమని చెబుతారు. ఉదయం, సాయంత్రం నడక, శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు, యోగ లాంటివి చేయడం కూడా మంచిది.

నిఘూర రహస్యం ఆ వెలుగు

నిఘూర రహస్యం ఆ వెలుగు

P.C: You Tube

సముద్ర మట్టానికి సుమారు 5వేల మీటర్లు ఎత్తుకు వెళ్లిన తర్వాత ప్రాణ వాయువైన ఆక్సిజన్ అందడ కష్టసాధ్యం. ఎంత ప్రయత్నించినా సాధారణ మానవులతో పాటు పర్వతారోహణ చేసేవారికి కూడా కష్టం

నిఘూర రహస్యం ఆ వెలుగు

నిఘూర రహస్యం ఆ వెలుగు

P.C: You Tube

అందువల్లే ఈ యాత్రలో ఉన్నవారు ప్రతి రోజూ రాత్రి డైమాక్స్ అనే ట్యాబ్లెట్ వేసుకోవడం తప్పనిసరి. దీనిని విస్మరించిన వారికి ప్రాణాపాయం తప్పదని హెచ్చరిస్తున్నారు.

నిఘూర రహస్యం ఆ వెలుగు

నిఘూర రహస్యం ఆ వెలుగు

P.C: You Tube

ఈ కారణంతోనే మానస సరోవరానికి వెళ్లిన చాలా మంది భక్తులు అస్వస్థతకు గురి కావడంతో పాటు ప్రాణాలు కోల్పోతున్నారని అధికారులు చెబుతున్నారు.

నిఘూర రహస్యం ఆ వెలుగు

నిఘూర రహస్యం ఆ వెలుగు

P.C: You Tube

సాధారణంగా మానస సరోవరంతో పాటు కైలాస పర్వత దర్శనం, పరిక్రమణ యాత్ర రెండు మార్గాల ద్వారా సాగుతుంది. అందులో మొదటిది లిపులేక్ పాస్. రెండోది నాథూలా పాస్.

నిఘూర రహస్యం ఆ వెలుగు

నిఘూర రహస్యం ఆ వెలుగు

P.C: You Tube

ఈ మార్గాలు కాకుండా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోతే యాత్ర మార్గాల్లో మార్పులు కూడా ఉంటాయి. ఏ మార్గంలో నుంచి వెళ్లినా అక్కడ ప్రదక్షణలు చేయడానికి మాత్రమే వీలు కలుగుతుంది.

నిఘూర రహస్యం ఆ వెలుగు

నిఘూర రహస్యం ఆ వెలుగు

P.C: You Tube

సాధారణంగా ఏ పుణ్యక్షేత్రాల్లో అయినా దైవ దర్శనం జరుగుతుంది. అయితే ఈ క్షేత్రంలో మాత్రం అటు వంటిది ఉండదు. కేవలం అక్కడ దేవతలు ఉన్నారన్న ఆలోచనతోనే ఈ యాత్ర సాగుతుంది.

నిఘూర రహస్యం ఆ వెలుగు

నిఘూర రహస్యం ఆ వెలుగు

P.C: You Tube

సాధారంగా మానస సరోవర, కైలాస పర్వత యాత్ర కనిష్టంగా 10 నుంచి 15 రోజుల పాటు సాగుతుంది. అయితే ఇప్పటి మాదిరిగా వాతావరణం అనుకూలించకపోయినా, ఆరోగ్యం సహకరించక పోయినా మధ్యలో వెనుదిరగాల్సిందే.

నిఘూర రహస్యం ఆ వెలుగు

నిఘూర రహస్యం ఆ వెలుగు

P.C: You Tube

హిందూ పురాణాలను అనుసరించి బ్రహ్మ తన మనస్సు నుంచి ఈ మానస సరోవరాన్ని స`ష్టించాడని చెబుతాడు. అందువల్లే ఆ సరస్సుకు మానస సరోవరమని పేరు.

నిఘూర రహస్యం ఆ వెలుగు

నిఘూర రహస్యం ఆ వెలుగు

P.C: You Tube

బ్రహ్మముహుర్త కాలంలో అంటే తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల సమయంలో పరమశివుడితో పాటు మిగిలిన దేవతలు మొత్తం ఆ సరస్సులో స్నానం చేయడానికి ఇక్కడికి వస్తారని పురాణాలు చెబుతారు.

నిఘూర రహస్యం ఆ వెలుగు

నిఘూర రహస్యం ఆ వెలుగు

P.C: You Tube

అందుకు తగ్గట్టే ఆ సమయంలో కైలాస పర్వతం నుంచి మానస సరోవరంలోకి ఓ వెలుగు రావడం మనకు కనిపిస్తుంది. పున్నమి రోజున ఈ మానస సరోవరంలో స్నానాలు చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తారు.

నిఘూర రహస్యం ఆ వెలుగు

నిఘూర రహస్యం ఆ వెలుగు

P.C: You Tube

అయితే ప్రతి రోజూ ఆ వెలుగు కైలాసపర్వతం నుంచి మానస సరోవరం వద్దకు ఒకే సమయంలో రావడానికి గల కారాణాలను మాత్రం శాస్త్రీయంగా నిరూపించలేకపోతున్నారు.

నిఘూర రహస్యం ఆ వెలుగు

నిఘూర రహస్యం ఆ వెలుగు

P.C: You Tube

మానస సరోవరానికి చేరుకునే మార్గంలో ముందుగా రాక్షస స్థల్ అనే ప్రాంతం వస్తుంది. ఇది రావణాసురుడు ఏర్పాటు చేసుకొన్న పెద్ద సరోవరం అని చెబుతారు. ఇక్కడ ఎవరూ స్నానం చేయరు.

నిఘూర రహస్యం ఆ వెలుగు

నిఘూర రహస్యం ఆ వెలుగు

P.C: You Tube

రావణాసురుడు ఇక్కడే తన పది శిరస్సుల్లో రోజుకొక తలను ఖండిస్తూ శివదర్శనం కోసం తపస్సు చేశాడని చెబుతారు. పదోరోజు శివుడు ప్రత్యక్షమై రావణాసురుడికి ఆత్మలింగాన్ని ప్రసాదించాడనీ చెబుతారు.

నిఘూర రహస్యం ఆ వెలుగు

నిఘూర రహస్యం ఆ వెలుగు

P.C: You Tube

ఈ సరోవరం నుంచి మానస సరోవరం 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ సరోవరం చూడటానికి ఓ అద్భుతంలా అనిపిస్తుంది. నీలం రంగులో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.

నిఘూర రహస్యం ఆ వెలుగు

నిఘూర రహస్యం ఆ వెలుగు

P.C: You Tube

ఈ మానస సరోవరం చుట్టు కొలత 88 కిలోమీటర్లు. కొంతమంది తాము వచ్చిన వాహనాల్లోనే ఈ సరస్సు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. దీని వల్ల అత్యంత పవిత్రమైన ప్రాంతంలో ఉన్నామన్న అనుభూతి కలుగుతుంది.

నిఘూర రహస్యం ఆ వెలుగు

నిఘూర రహస్యం ఆ వెలుగు

P.C: You Tube

ఈ సరస్సులో స్నానం చేసి బట్టలు మార్చుకోవడానికి అక్కడ నిర్వాహకులు టెంటులు వేస్తారు. అందులో స్నానం చేసిన తర్వాత ఎవరికి తోచిన రీతిలో వారు పూజలు చేస్తారు. కొంతమంది యాగాలు కూడా చేస్తారు.

నిఘూర రహస్యం ఆ వెలుగు

నిఘూర రహస్యం ఆ వెలుగు

P.C: You Tube

ఇక్కడి నుంచి కైలాస పర్వత దర్శనం కోసం వెలుతారు. ముందుగా యమద్వారం వస్తుంది. దానికి మూడు ప్రదక్షిణలు చేసి ఓ ద్వారం గుండా వెళ్లి మరో ద్వారం గుండా రావాలి.

నిఘూర రహస్యం ఆ వెలుగు

నిఘూర రహస్యం ఆ వెలుగు

P.C: You Tube

ఇక్కడ నుంచి కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేసే పరిక్రమణ మొదలవుతుంది. అయితే వాతావరణం అనుకూలిస్తేనే పరిక్రమణకు నిర్వాహకులు అనుమతి కల్పిస్తారు.

నిఘూర రహస్యం ఆ వెలుగు

నిఘూర రహస్యం ఆ వెలుగు

P.C: You Tube

మానస సరోవరం, కైలాస పర్వతం ప్రస్తావన కేవలం హిందూ మతంలోనే కాకుండా బౌద్ధ, జైన మతంలో కూడా ఉంది. అందువల్లే ఈ మానస సరోవరం యాత్రను అన్ని మతాల వారు ఆచరిస్తారు.

నిఘూర రహస్యం ఆ వెలుగు

నిఘూర రహస్యం ఆ వెలుగు

P.C: You Tube

ఇక మౌంట్ కైలాస్ లేదా కైలాస పర్వతం చుట్టూ తిరిగే పరిక్రమణను హిందు, బౌద్ధ మతస్తులు క్లాక్ వైజ్ లో చేస్తే, జైన మతస్తులు యాంటి క్లాక్ వైజ్ లో చేస్తుంటారు.

నిఘూర రహస్యం ఆ వెలుగు

నిఘూర రహస్యం ఆ వెలుగు

P.C: You Tube

పట్టాభిషేకం తర్వాత రామలక్ష్మణులు, మహాభారత యుద్ధం తర్వాత పాండవులు కలియుగంలో ఆది శంకరాచార్యుడు కూడా ఈ మానస సరోవర, కైలాస పర్వత యాత్ర చేశాడని చెబుతారు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+