ఈ నిర్మాణాన్ని విశ్వ శాంతి స్తూపం అని కూడా అంటారు. వైశాలి టూరిజం లో వరల్డ్ పీస్ పగోడా నిజంగా ఒక ప్రత్యేకత. దీనిని జపాన్ బౌద్ధ ప్రచారకులు నిర్మించారు. ఈ స్తూపం శాంతికి చిహ్నం గా వుంటుంది. ప్రపంచ శాంతి కొరకు జీవితాన్ని గడిపిన పూజ్య గురుజి గౌరవార్ధం ఈ పగోడాలు ప్రపంచం అంతా కూడా నిర్మించారు.
ఈ పగోడ స్తూపం 125 అడుగుల పొడవు తో ఒక డోమ్ కలిగి 65 అడుగుల వ్యాసం కలిగి వుంటుంది. ఈ స్తూపం నిర్మాణంలో లోకూడా బుద్ధుడి అస్థికలు ఉంచారు. ఇందిలో అనేక విగ్రహాలు గ్లాస్, ఫైబర్ లతో చేసినవి, బంగారు పూత కలిగి వుంటాయి.
ఈ స్తూపం కరో నేషన్ ట్యాంక్ సమీపంలో వుంది అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. బుద్దుడు బోధించిన శాంతి సిద్ధాంతాలకు ,ప్రేమకు ప్రతీకగా నిలుస్తుంది.



Click it and Unblock the Notifications