పాపస్నానం బీచ్ తిరువనంతపురం కు 45 కి.మీ. దూరంలో ఉంటుంది. పేరుకి తగినట్లు ఇక్కడి తాజా నీటి బుగ్గల లో స్నానం చేస్తే పాపాలు పోతాయని భావించి స్నానాలు చేస్తారు. భక్తులు తమ మరణించిన బంధువుల అస్తికలు తీసుకు వచ్చి ఈ బీచ్ లో నిమజ్జనం చేస్తారు. ఈ కార్యం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. పురాణాల మేరకు, కొంతమంది భక్తులు నారదుని వద్దకు వచ్చి తమ పాపాలు ఒప్పుకున్నారని, వారి విమోచన కొరకు నారదుడు తన వల్కలంని గాలిలోకి విసిరివేసాడని, ఆయన విసరిన వల్కాలం వచ్చి అక్కడ పడటంతో ఆ ప్రదేశానికి పాపనాశం అనే పేరు వచ్చిందని చెపుతారు. అపుడు, నారదుడు వారిని పాప స్నానం బీచ్ లో స్నానం చేయమని కోరాడని చెపుతారు. ఈ ప్రదేశంలో కొబ్బరి తోటల లోకి అస్తమిస్తున్న సూర్యుడి ని చూచి ఆనందించవచ్చు.



Click it and Unblock the Notifications