బసిలిక ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ గా పిలువబడే వేలన్ కన్ని చర్చి వేలన్ కన్ని టవున్ లో ప్రసిద్ధ ఆకర్షణ. ఒకప్పుడు అంటే 16 వ శతాబ్దంలో ఒక తాటి ఆకుల గుడిసెగా వున్న వేలన్ కన్ని చర్చి 1771 నాటికి ఒక పారిష్ చర్చి గా మారి, 1962 లో పోప్ జాన్ XXIII చే ఒక ప్రత్యేక హోదా కల మైనర్ బాసిలికా గా గుర్తించబడినది.
ఈ క్షేత్రం ఉదయం అయిదు గంటల నుండి సాయంత్రం తొమ్మిది గంటల వరకూ తెరచి వుంటుంది. ప్రతి రోజూ తమిళం, మలయాళం, ఇంగ్లీష్ భాషలలో వివిధ సమయాలలో ప్రార్థనలు చేస్తారు. 1974-75 లలో ఫ్రాన్స్ లోని లూర్దెస్ చర్చి నమూనాలో ఇక్కడి బాసిలికాకు మార్పులు చేసారు. దీనితో వేలన్ కన్ని చర్చిని లూర్దెస్ ఆఫ్ ఈస్ట్ అని పిలిచారు. సెప్టెంబర్ లో జరిగే ఫీస్ట్ మరియు క్రిస్మస్ సీజన్లో యాత్రికులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొంటారు.



Click it and Unblock the Notifications