గంజాం లోని చత్రపూర్ నుంచి హుమా కంటియాగడ 13 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. ఈ ప్రదేశం ఇక్కడి అంతర్జాతీయ స్థాయి బీచ్ కు ప్రసిద్ది. ఇక్కడ సన్ బేతింగ్ చేయవచ్చు, సాహసికులు సర్ఫింగ్ చేయవచ్చు. ఎండ పడే ఇసుక తీరాలను చుంబించే ఎగసి పడే అలల దృశ్యం చూసి తీరాల్సిందే. రుషికుల్యా నదీ సంగమానికి దగ్గరగా ఉండడంతో ఈ ప్రాంతం ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మారింది.
కా౦టియాగడ, కాంటియాగడ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో వున్న అందమైన ప్రదేశం. హుమా కాంటియాగడ లో కపిలేశ్వర దేవాలయం, లంగ్లేశ్వర దేవాలయం లాంటి చాలా గుళ్ళు దీన్ని ఒక తీర్థ క్షేత్రంగా కూడా మార్చాయి. శీతాకాలంలో హుమా కాంటియాగడ చాలా మంది యాత్రికులను ఆకర్షిస్తుంది, వారు ఇక్కడికి వచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదించడమే కాక దేవతలా దీవెనలు కూడా అందుకుంటారు.