లఖోట తలావ్ ప్రాంతంలో ఎల్లపుడూ పక్షుల కిల కిలలు వినపడుతూ వుంటాయి. ప్రతి సంవత్సరం సుమారు 75 రకాల జాతుల పక్షుల రాకతో పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తూంటారు. ప్రత్యేకించి వారాంతపు సెలవులు, సాయంత్రాలు జనం అధికంగా వుంటారు. ప్రశాంతమైన ఈ సరస్సులో బోటు విహారం ఆనందించవచ్చు. సాయంత్రాలు ఈ పార్క్ లో కల సమీప ఆహార దుకాణాలలో కల స్థానిక ఆహారాల రుచులను కూడా ఆనందించవచ్చు. ఈ లేక్ కు వచ్చే పక్షులలో పెలికన్ లు, గుల్ పక్షులు, ఫ్లేమింగోలు, బాతులు, స్పూన్ బిల్ల్స్ వంటివి కలవు.