కళ్యాణచాళుక్యులచే నిర్మించబడిన ఛారంతిమాత దేవాలయాల సముదాయం సుమారుగా 11 మరియు 12 శతాబ్దాలకు చెందినదిగా తెలుపబడుతుంది. శిలా శాసనాలు ఈ దేవాలయాలు ఖచ్చితంగా క్రీ. శ. 1120 నాటివని వెల్లడిస్తున్నాయి. ఈ దేవాలయాల సముదాయంలో త్రికూటాచల దేవాలయం ప్రధానం అయింది.
ఈ మూడు దేవాలయాలు, ఒకదానితో మరి ఒకటి కలుపబడి ఉంటాయి. 12 మంది తీర్ధంకరులు కల రెండు జైన దేవాలయాలు కూడా ఇక్కడేచూడవచ్చు. ఈ దేవాలయాలు రాజు చారంతినాధ పాలనలో కట్టబడిన సముదాయంగా చెపుతారు. పర్యాటకులు అందమైన ఈ దేవాలయాలు తప్పక చూసి తీరాలి.



Click it and Unblock the Notifications