గౌడ దేవాలయం, 12వ శతాబ్దానికి చెందిన పుణ్యక్షేత్రం. దీనిలోని దేవత భగవతి. ఐహోళే ప్రాంతంలో ఇది ప్రధాన ఆకర్షణ. ఈ దేవాలయం కళ్యాణ చాళుక్యుల శిల్ప కళా నైపుణ్యాలను చూపిస్తుంది. బయటి గోడలపై సుమారు 16 స్తంభాలపైన అనేక భంగిమల శాల్పాలు కనపడతాయి. స్తంభాలమధ్య ఉంచిన రాతి పలకలు గోడలుగా చూపబడతాయి. ఈ దేవాలయం జైన్ దేవాలయాలకు ఉత్తర దిశగా ఉంది. సమీపంలోని లడ్ ఖాన్ దేవాలయాల తీరులోనే ఇది కూడా నిర్మించారు.