దీనినే మేగుటి అని అంటారు. ఇది జైన మందిరం. ద్రవిడ శైలి లో కలదు. దీనిని 5వ శతాబ్దంలో అక్కడే కల ఒక చిన్న కొండపై నిర్మించారు. పర్యాటకులు దీని మొదటి అంతస్తులో స్తంభాల హాలు మరియు మూడు గదులు చూడవచ్చు. వరండా, నలుచదరపు గది రెండవ అంతస్తులో కలవు. దేవాలయ మధ్య గది గర్భగుడి.
దేవాలయం వెనుక, ఒక అంతరాల మరియు ఒక ప్రదక్షిణ మార్గం కనపడతాయి. ముందు భాగంలో స్తంభాల హాలు ఉంటుంది. ప్రసిద్ధి చెందిన ఐహోళే శాసనం సుమారు 634 సంవత్సరం నాటిది బయటి గోడపై చెక్కారు. ఆగ్నేయ దిశగా చిన్న జైన గుహ ఉంటుంది. గర్భగుడిలో అయిదు అడుగుల పొడవైన బాహుబలి విగ్రహం, తీర్ధంకరుల చెక్కడాలు కనపడతాయి. గర్భగుడిపై భాగాన గోపురం కనపడుతుంది. తర్వాతి కాలంలో ఈ దేవాలయానికి 16 స్తంభాలతో ఒక హాలు నిర్మించారు.



Click it and Unblock the Notifications