ఐహోళేలో సూర్యనారాయణ దేవాలయం ప్రసిద్ధి చెందినది. దీనిలో సూర్యుడి విగ్రహం ఉంటుంది. ఇతిహాసాల మేరకు ఇది 7వ లేదా 8వ శతాబ్దంలో కట్టబడినట్లు తెలుస్తోంది. దేవాలయం లో రెండు అడుగుల ఎత్తు సూర్యనారాయణ విగ్రహం తన భార్యలైన ఉష మరియు సంధ్యలతో కలిసి ఒక రధంపై కూర్చొని కనపడతాడు. ఈ గుడికి రేఖానగర శైలి టవర్ మరియు ఒక గర్భగుడి, నాలుగు స్తంభాలుంటాయి. ఈ గుడి లడ్ ఖాన్ దేవాలయానికి ఈశాన్యంగా కలదు.