భారతదేశంలో విస్తరించి ఉన్న మొట్టమొదటి హైకోర్ట్ లలో అలహాబాద్ హైకోర్ట్ ఒకటి. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒకేఒక్క న్యాయస్థానం. బ్రిటీష్ వారి పరిపాలనలో, ఈ హైకోర్ట్ ని మొట్టమొదట ఆగ్రా లో ఏర్పాటు చేసారు, తరువాత నిర్వహణా కారణాల ద్రష్ట్యా దీనిని అలహాబాద్ మార్చారు.
ప్రస్తుత భవనం 1950 వ సంవత్సరంలో ఏర్పడింది. ఈ కోర్ట్ ను భారతీయ-బ్రిటీషు నిర్మాణ శైలితో ఒక పెద్ద ప్రాంగణంలో నిర్మించారు. బ్రిటీష్ రాజ్ కాలంలో ఈ హైకోర్ట్ ముందు బాగా ఉంచబడిన లాన్లు, పొలాలు ఉన్నాయి, ఇది ఈ విస్తారమైన ప్రాంగణంలో సహజమైన అందాన్ని పెంపొందించింది.



Click it and Unblock the Notifications