Search
  • Follow NativePlanet
Share

 ఔలి - సుందర దృశ్యాల సమాహారం  !

18

ఔలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్కీయింగ్ లలో ప్రసిద్ధి చెందింది, ఇది ఒక అందమైన పర్యాటక ప్రదేశం. ఈ సుందరమైన ప్రదేశం సముద్ర మట్టానికి 2800 మీటర్ల ఎత్తులో ఉన్నది. దాని వాలు ఓక్ వృక్షాలు మరియు పచ్చని శంఖాకార అడవులతో ఉంటుంది. ఔలి చరిత్రలోని కొన్ని నమ్మకాల ప్రకారం 8 వ శతాబ్దంలో జగద్గురు ఆది శంకరాచార్య ఈ పవిత్ర ప్రదేశమును సందర్శించారు. ఈ ప్రదేశం ను 'బుగ్యల్'' అని అంటారు. 'బుగ్యల్' అంటే ప్రాంతీయ భాషలో 'మైదానం' అని అర్దము.ఈ మంచుతో కూడిన వాలు గుండా పర్యాటకులు నడిస్తే నందా దేవి, మానా పర్వత్,మరియు కామత్ పర్వత శ్రేణుల అద్భుత దృశ్యాలను చూడవచ్చు. యాత్రికులు వాలు యొక్క విశాలమైన రహదారుల నుండి ఆపిల్ తోటలు మరియు లష్ దేవదార్ చెట్లను చూడవచ్చు.

నందప్రయగ్ ,ఔలి లోఒక ప్రముఖ ఆకర్షణగా ఉన్నది. ఇది అలకానంద మరియు నందాకిని నదులు కలిసే ప్రదేశంలో ఉంది. ఈ సంగమం ప్రదేశంలో స్నానం చేస్తారు. ఈ ప్రదేశము హిందువులకు అపారమైన మత సంబంధమైన ప్రాముఖ్యం కలిగి ఉంది. ఇక్కడ సందర్శకులు మంచుతో కప్పబడిన పర్వతాలను చూసి ఆస్వాదించవచ్చు. బద్రీనాథ్ మరియు కేదార్నాథ్ లకు ఒక మార్గంగా ఉంది.

ఈ ప్రదేశంలో కృత్రిమ సరస్సుకు తక్కువ హిమపాతం ఉన్న నెలల్లో ప్రత్యేకంగా కొత్త స్క్యింగ్ పల్లాలు కు కృత్రిమ మంచు అందించడానికి ప్రభుత్వంచే అభివృద్ధి గావించబడింది. పర్యాటకులు సముద్ర మట్టానికి 2744 మీటర్ల ఎత్తులోఉన్న భవిష్య బద్రీ ని తప్పక సందర్శించాలి. ఇది బద్రీనాథ్, యోగ ధ్యాన్ బద్రి, ఆది బద్రి, మరియు వ్రిధ బద్రి తర్వాత ఐదు బద్రి ఆలయాలలోఒకటి. ఈ స్థలం మత సంబంధమైన ప్రాముఖ్యం కలిగి ఉంది.

గుర్సో బుగ్యల్ వేసవి కాలంలో పచ్చదనంతో అలంకరించబడిన ఒక అందమైన ప్రదేశంగా ఉంటుంది. ఈ ప్రదేశము పచ్చని శృంగాకార మొక్కలు మరియు ఓక్ వృక్షాలతో అడవులను చుట్టుముట్టి ఉంటాయి. పర్యాటకులు జోషిమత్ నుండి రోప్ వే ద్వారా ఈ ప్రదేశమును చేరుకోవచ్చు. గుర్సో బుగ్యల్ కు దగ్గరలో చట్టర్కుండ్ సరస్సు అని పిలువబడే ఒక చిన్న నీటి సంగమం ఉంది. ఔలి కి దగ్గరగా ఉన్న ఒక చిన్న గ్రామంలో సహజ నీటి బుగ్గ మరియు సైల్ధర్ తపోవన్లో ఒక ఆలయము ను చూడవచ్చు.

ఔలి లో మంచుతో ఉన్న వాలుల్లో స్కీయింగ్ చేస్తూ ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. ఈ వాలులు ఆల్పైన్ స్కీయింగ్, నోర్డిక్ స్కీయింగ్, మరియు టెలిమార్క్లో స్కీయింగ్ లను ఆస్వాదించడానికి అత్యుత్తమమైనవి. ఔలి కి 4 కిలోమీటర్ల దూరంలో ఆసియాలోనే అతి పెద్దదైన కేబుల్ కారు ఉంది.ఈ కేబుల్ కారులో ఒక విధమైన కుర్చీ లిఫ్ట్ మరియు స్కీ లిఫ్ట్ ఉంటాయి. వాలు యొక్క సున్నితత్వం కాపాడటం కోసం మంచు ప్యాకింగ్ యంత్రాలు మరియు మంచు బీటర్లను ఉపయోగిస్తారు.

ఔలి కల హిమాలయ ప్రాంతంలో ట్రెక్కింగ్ బాగా ప్రసిద్ధి చెందింది. పర్యాటకులకు జోషిమత్ ట్రెక్కింగ్ మార్గం చాలా ప్రాచుర్యం పొందింది. ఈ ప్రాంతం గుండా వివిధ మార్గాలలో ట్రెక్కింగ్ చేస్తున్నపుడు కామెట్, నందా దేవి, మనా పర్వత్ మరియు దునాగిరి వంటి పీక్స్ చూడవచ్చు.

త్రిశూల్ శిఖరం సముద్ర మట్టానికి 7160 మీటర్ల ఎత్తులో ఔలి లో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఈ శిఖరంనకు హిందూ మత దేవుడైన శివుడి త్రిశూలము నుండి దానికి ఆ పేరు వచ్చింది. ఈ శిఖరం కూడా ఒక ప్రముఖ స్కీయింగ్ ప్రదేశం మరియు అదనంగా, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ కు చెందిన రాత్రి యందు గస్తీ తిరిగే అధికారులకు శిక్షణా ప్రదేశంగా ఉంది. పర్యాటకులు కూడా శిఖరం యొక్క పర్వత పాద ప్రాంతంలో ఉన్న రూప కుండ్ లేక్ చూడగలరు.

యాత్రికులు సులభంగా విమాన, రైలు, మరియు రోడ్డు మార్గాల ద్వారా ఔలి ని చేరవచ్చు. డెహ్రాడూన్, హరిద్వార్ రైల్వే స్టేషన్ లు దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్లు. జాలీ గ్రాంట్ విమానాశ్రయం ఔలి కి దగ్గరగా ఉన్న విమానాశ్రయం. ఔలి కి బస్సులు సమీప నగరాల నుంచి కూడా అందుబాటులో ఉన్నాయి. వేసవి కాలంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వేసవి ఈ ప్రదేశమును సందర్శించడానికి ఉత్తమ సమయంగా భావించబడుతుంది.

ఔలి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఔలి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఔలి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఔలి

  • రోడ్డు ప్రయాణం
    జోషిమత్ నుండి టాక్సీల ద్వారా ఔలి ని చేరుకోవచ్చు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ బస్సులను జోషిమత్ కు నడుపుతుంది. జోషిమత్ కు రుషికేష్, హరిద్వార్, డెహ్రాడూన్ మరియు సమీపంలోని నగరాల నుండి బస్సులు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    హరిద్వార్ రైల్వే స్టేషన్ ఔలి నుండి 287 కి.మీ. దూరంలో ఉన్న సమీప రైల్వేస్టేషన్. ఈ స్టేషన్ నుండి అద్దె కార్లు సమంజసమైన ధరలకు ఔలి కి అందుబాటులో ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ భారతదేశం యొక్క అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడింది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం డెహ్రాడూన్ జాలీ గ్రాంట్ విమానాశ్రయం ఔలి నుండి 279 కి.మీ. దూరంలో ఉన్న సమీప విమానాశ్రయం. ఈ విమానాశ్రయం నుండి ఔలి కి చేరుకోవటానికి టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. విదేశీ పర్యాటకులకు న్యూఢిల్లీలోని ఇందిరా అంతర్జాతీయ విమానాశ్రయం సమీప అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం నుండి జాలీ గ్రాంట్ విమానాశ్రయం చేరటానికి సాధారణ విమానాలు ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue