సరయు నది ఒడ్డున ఉన్న గుప్తర్ ఘాట్ వద్ద ఫైజాబాద్ లో ఉన్న ఈ చక్ర హర్జి విష్ణు ఆలయం హిందువుల నుండి విశేష ఆదరణ రెండు విషయాల వల్ల పొందుతోంది. మొదటిది ఇక్కడ చక్రాన్ని ధరించిన విష్ణుమూర్తి యొక్క విగ్రహం అనేకమంది భక్తులని ఆకర్షిస్తోంది. సాధారణం గా సుదర్శన చక్రాన్ని శ్రీ కృష్ణుడు రాక్షసులని హరించడానికి వాడతాడు. విష్ణు మూర్తి ఈ చక్రాన్ని ధరించడం అరుదుగా ఉన్న అంశం.
మరొక విశేషం శ్రీ రాముడి పాద ముద్రలు. ఇవి స్వయం గా ఆ భగవంతుని యొక్క పాద ముద్రలు కావడం భక్తులలో అత్యంత పవిత్రమైనవిగా, విలువైనవిగా నిలిచి ఉన్నవి.
ఇతర దేవత మూర్తుల విగ్రహాలు కూడాఉన్నాయి . సరయు నది ఒడ్డున ఉన్న ఈ దేవాలయం ప్రశాంతం గా ఉంటుంది.



Click it and Unblock the Notifications