బెంగళూరు లోని మల్లేశ్వరం ప్రాంతం లోని ఎం ఎన్ కామ్ప్లెక్స్ కి దగ్గరో సంపిగే రోడ్డు నెంబర్ ఒకటి లో మంత్రి స్క్వేర్ మాల వుంది. లక్షన్నర చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ మాల్ బహుశా దేశం లోకల్లా పెద్దది.వినోదం, షాపింగ్, ఆహరం అందించే రక రకాల దుకాణాల సముదాయం తో మంత్రి స్క్వేర్ బెంగళూరు కు మహానగరమనే ఖ్యాతిని తెచ్చి పెడుతోంది. బెంగళూరు లో లైఫ్ స్టైల్, రిలయన్స్ ట్రెండ్స్, మార్క్స్, షాపర్స్ స్టాప్, పాంటలూన్స్ లాంటి అయిదు పెద్ద డిపార్ట్మెంట్ స్టోర్లు ఒకే చూరు క్రింద వున్న ఏకైక మాల్ ఇదే.
దక్షణాఫ్రికా కు చెందినా బెన్టేల్ అసోసియేట్స్ సమకూర్చిన భవన నిర్మాణ నమూనా మంత్రి మాల్ కు మంచి ఖ్యాతి తీసుకు వచ్చింది. దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్ లను అందించే 250 దుకాణాలు ఈ మాల్ లో వున్నాయి. ఈ మాల్ లోని ఫుడ్ కోర్ట్ లో 39 దుకాణాలున్నాయి, 4 ప్రత్యెక భోజన శాలలు వున్నాయి. 6 తెరలు కలిగిన ఐనాక్స్ థియేటర్, 71 సీట్లున్న గోల్డ్ క్లాస్ తేరా కూడా వుంది.2000 కార్లు పట్టే స్థలం లో వాలెట్ పార్కింగ్ ఇక్కడ అందుబాటులో వుంది. ఈ మాల్ అంతులేని సరదాను, వినోదాన్ని, భోజన, షాపింగ్ అవకాశాలను ఒకే చోట అందిస్తుంది.