బన్స్వారా తూర్పు భాగంలో ఉన్న ఆనంద్ సాగర్ అందమైన కృత్రిమ సరస్సు. మహారావల్ జగమల్ గారి రాణి, ఇదార్ కు చెందిన లచ్చీ బాయ్ ఈ దేవాలయాన్ని నిర్మించిందని చెప్తారు. ఈ సరస్సుకు దగ్గరలోనే పూర్వపు రాజుల చాత్రీలు లేదా సమాధులు కూడా ఉంటాయి. కోరికలు తీర్చే పవిత్ర వృక్షాలుగా చెప్పబడే కల్పవృక్షాలు దీనికి దగ్గరలోనే ఉన్నాయి. జిల్లా కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సరస్సుకు బస్సులు, టాక్సీల ద్వారా చేరుకోవచ్చు.