బన్స్వారా జిల్లా కేంద్ర౦ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న తల్వారా పట్టణం సూర్య భగవానుడు, అమాలియా గణేష్ మందిరాలకు ప్రసిద్ది చెందింది. లక్ష్మీ నారాయణ దేవాలయం, ద్వారకాదీష్ దేవాలయం, సంభార్నాద్ జైన దేవాలయం ఇక్కడి ఇతర ప్రసిద్ధ ఆలయాలు. తల్వారా రోడ్లపై నడుస్తుంటే పర్యాటకులకు రాతిపై అందమైన నమూనాలు చెక్కే చాలామంది సోమ్పురా కళాకారులు కనిపిస్తారు.



Click it and Unblock the Notifications