భంద్ దేవరా ఆలయం రామ్ ఘర్ కోటపై బరన్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో శివుని విగ్రహం ఉంది, ఇది ‘రాజస్తాన్ ఖజురహో’ గా ప్రసిద్ది చెందింది. చెరువు ఒడ్డున ఉన్న ఈ మందిరాన్ని 10 వ శతాబ్దంలో నిర్మించారు. ప్రస్తుతం ఇది నవీకరణ పనులకోసం పురావస్తు శాఖ అధీనంలో ఉంది.
కిస్నై, అన్నపూర్ణ దేవి ఆలయాలు కూడా రామ్ఘర్ కొండపై ఉన్నాయి. ఈ విగ్రహాలు సహజమైన గుహలోపల ఉన్నాయి, ప్రయాణీకులు ఝాలాజాలిం సింగ్ చే నిర్మించబడిన షుమారు 750 మెట్లు ఎక్కి ఇక్కడకు చేరతారు. ఈ ఆలయంలోని దేవతలలో ఒకరిని మేవ లేదా డ్రై ఫ్రూట్స్ తో పూజిస్తారు, మిగిలినవారికి మాంసం, మద్యం అందిస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజు జరిగే గొప్ప ఉత్సవంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.



Click it and Unblock the Notifications