రాష్ట్రీయ వన చేతన కేంద్రం స్థానికుల కు అడవుల పట్ల అవగాహన ఏర్పరచటం కొరకు స్థాపించారు. దీనిని సంత రవి దాస్ వన విహార అని కూడా అంటారు. పురాతన కాలంలో బస్తిలో అనేక మంది సాధువులు, స్వామీజిలు తమ ఆశ్రమాలను స్థాపించి నిర్వహించారు. కనుక దీనిలో శ్రీ రాముడి గురువు అయిన వసిష్టుడు కూడా తన ఆశ్రమం నిర్వహించాడు. రామాయణం మేరకు శ్రీ రాముడు, తన సోదరుడు లక్ష్మునుడి తో కలసి ఈ ఆశ్రమం లో కొంత కాలం నివసించాడు.
ఈ ప్రదేశం బస్తి జిల్లాకు 5 కి.మీ.ల దూరం లో గణేష్ పూర్ గ్రామానికి దగరగా వుంటుంది. దీనిలో పర్యాటకులకు ఒక పిల్లల పార్క్, బోటు సౌకర్యం కల ఒక చిన్న సరస్సు కలవు. సమీపం లో కల కున్వా నది ఈ పార్క్ అందాలను మరింత పెంచుతుంది. సెలవు దినాలు, ఆది వారాలు ఇక్కడకు జనాలు అధికంగా వస్తారు.



Click it and Unblock the Notifications