భధ్రావతికి వెళ్ళే పర్యాటకులు భద్ర వన్యప్రాణుల సంరక్షణాలయాన్ని తప్పక చూడాలి. ఈ సంరక్షణాలయం షుమారు 490 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంటుంది. 1951 లో ఈ ప్రాంతం సహజ సంరక్షణాలయంగా ప్రకటించబడింది. దీనినే జాగర వ్యాలీ గేమ్ రిజర్వ్ అని కూడా చెపుతారు. 1974 లో దీనిని భద్ర వైల్డ్ లైఫ్ శాంక్చువరీగా పేరు పెట్టి 1998 లో దీనిని ప్రాజెక్ట్ టైగర్ గా ప్రకటించారు.
ఎన్నో రకాల వన్య ప్రాణులు దీనిలో ఉన్నాయి. పులులు, ఏనుగులు, జింకలు, ముళ్ళపందులు ఉన్నాయి. పావురాలు, చిలకలు, మైనాలు, వడ్రంగి పిట్టల వంటి పక్షులు, తాచుపాములు, పాములు, బల్లులు, సీతాకోక చిలుకలు, వంటి ఆకర్షణలు ఎన్నో వున్నాయి. ఈ జంతు సమూహాలే కాక, 120 రకాల వృక్ష సంపద కూడా ఉంది. శాంక్చువరీలో ఇవే ప్రధాన భాగం. టీకు, ఇండియన్ కినో చెట్లు, తాటి, ఇండిగో, జలారి, జాంబా మొదలైన చెట్లు కనపడతాయి.



Click it and Unblock the Notifications