Search
  • Follow NativePlanet
Share

బిర్ - సాహస క్రీడల మజిలీ !

10

హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణలలో బిర్ అనే ప్రాంతం ఒకటి. ఈ పట్టణం యొక్క జనాభాలో ఎక్కువ మంది పొరుగు దేశం అయిన టిబెట్ నుండి శరణార్ధులుగా వచ్చినవారే. వివిధ ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రాలకి ప్రాచుర్యం పొందిన ఈ పట్టణంలో ధర్మాలయ ఇన్స్టిట్యూట్ మరియు డీర్ పార్క్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి.

అధ్యయన కేంద్రాలే కాకుండా ఈ ప్రాంతం సాహస క్రీడల మజిలీ గా కూడా వ్యవహరిస్తుంది. పారాగ్లైడింగ్ రాజధానిగా పిలవబడే ఈ ప్రాంతంలో అనేకమైన పారాగ్లైడింగ్ స్పాట్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో, టూరిజం శాఖ, సివిల్ ఏవియేషన్ మరియు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కలిసి ఇక్కడ 'పారాగ్లైడింగ్ ప్రీ వరల్డ్ కప్' ఈవెంట్ ని నిర్వహిస్తారు. అంతర్జాతీయంగా ప్రసిద్ది చెందిన ఈ పారాగ్లైడింగ్ పోటీలని తిలకించడానికి ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో సందర్శకులు విచ్చేస్తారు.

అంతే కాకుండా, 1980 లో ప్రవేశపెట్టబడిన హాంగ్-గ్లైడింగ్ అనే మరొక సాహసోపేత కార్యక్రమాన్ని కూడా ప్రయత్నించవచ్చు. రోజు రోజు కి ఈ క్రీడ ప్రసిద్ది చెందుతోంది. ఈ క్రీడకి సంబంధించిన శిక్షణని ప్రతి సంవత్సరం హెచ్ టి డి సి లేదా హిమాచల్ ప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ అందిస్తుంది.

టిబెటన్ కాలనీ మరియు బిర్ టీ ఫ్యాక్టరీ అయిన చిక్లింగ్ గొంప ని కూడా పర్యాటకులు సందర్శించవచ్చు. నేచర్ వాక్ ని ఆస్వాదించే సౌకర్యం ఉండడంవల్ల ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకి అనువైన ప్రదేశం.

ప్రజాదరణ పొందిన రవాణా పద్దతుల ద్వారా ఈ ప్రాంతానికి సులభంగా చేరుకోవచ్చు. బిర్ కి దగ్గరలో పతంకోట్ విమానాశ్రయం ఉంది. ఇది 150 కిలోమీటర్ల దూరం లో ఉంది. ఢిల్లీ లో ఉన్న ఇందిరా గాంధీ లేదా అంతర్జాతీయ విమానాశ్రయం లేదా IGI విమానాశ్రయం కూడా ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్న విమానాశ్రయం.

బిర్ కి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్, దేశంలోని వివిధ ప్రాంతాలకి చక్కగా అనుసంధానమయ్యే పతంకోట్ రైల్వే స్టేషన్. చండి గర్హ్ మరియు న్యూ ఢిల్లీ వంటి పట్టణాల నుండి బిర్ చేరుకునేందుకు బస్సులు అందుబాటులో కలవు.

ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిన ఈ అందమైన హిల్ స్టేషన్ ని పర్యాటకులు సంవత్సరంలో ఏ కాలంలో నైనా సందర్శించవచ్చు.

బిర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

బిర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం బిర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? బిర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం: ఢిల్లీ , చండీఘర్ వంటి ప్రదేశాలనుండి ఈ అందమైన బీర్ కు చేరుకోటానికి బస్సు వసతి ఉన్నది.ఢిల్లీ నుండి బీర్ కు చేరుకోటానికి ఒకరికి బస్సు టికెట్ రుసుము 300 రూపాయలు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం: పఠాన్ కోట్ రైల్వే స్టేషన్ ఈ ప్రదేశానికి దగ్గరలోని రైల్ వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ నుంచి జమ్మూ , ఢిల్లీ మరియు అమ్రిత్సర్ వంటి ప్రదేశాలకు చేరుకోవచ్చు.రైల్వే స్టేషన్ నుండి బీర్ కు చేరుకోటానికి టాక్సీ వసతి కలదు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    పర్యాటకులు వాయు మార్గాన, రైల్ మరియు రోడ్డు మర్గాన సులభంగా బీర్ కు చేరుకోవచ్చు. వాయు మార్గం: బీర్ నుండి 150 కిలో మీటర్ల దూరంలో ఉన్న పఠాన్ కోట్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ మరియు కుల్లు ని కలుపుతుంది. పట్టానికి చేరుకోటానికి పర్యాటకులకు టాక్సీ లు తీసుకోవచ్చు.బీర్ కు దగ్గర లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇందిరాగాంధి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది దాదాపు 513 కిలోమీర్ల దూరంలో ఢిల్లీలో ఉన్నది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
16 Jun,Tue
Return On
17 Jun,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
16 Jun,Tue
Check Out
17 Jun,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
16 Jun,Tue
Return On
17 Jun,Wed