దట్టమైన అడవులు, కొండలు అలాగే కొలనుల మధ్యలో నెలకొని ఉన్న అందమైన ప్రదేశం దూద్పతేర్. నంద రుషి అనబడే కాశ్మీరీ మహర్షి నీళ్ళని వెతుకుతూ ఈ ప్రాంతానికి వచ్చారని స్థానికులు నమ్ముతారు. మంచినీళ్ళ కోసం మహర్షి నేలని తవ్వగానే నీళ్ళ బదులు పాలు భూమి లో నుండి ఉద్భవించడం మొదలయింది. అందువల్ల ఈ ప్రాంతానికి దూద్ పతేర్ అనే పేరు వచ్చింది. రెండు హిందీ పదాలైన దూద్ అంటే పాలు, పతేర్ అనే రాయి అని అర్ధం. సోచిల్పతేర్, ముజ్పతేర్, దోఫ్కర్, పాల్ మైదాన్, పరిహాస్ మరియు టాంగ్నర్ వంటివి ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న మరికొన్ని పర్యాటక ఆకర్షణలు.



Click it and Unblock the Notifications