1857 లో ఆగ సయ్యద్ చేత నిర్మించబడింది ఈ ఇమంబర బుద్గం. కాశ్మీరీ షియాట్ ముస్లిములలో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగినది. చరిత్రకారుల ప్రకారం, ఇమంబర లో షియెట్ ఆగ సయ్యద్ మెహ్ది దైనందిన ప్రార్ధనలు జరిపేవాడు. ఇమంబర అనగా ప్రార్ధనల నాయకుడు నివాసం ఉండే స్థలం. 19 వ శతాబ్దపు ఇండో-ఇరానియాన్ నిర్మాణ శైలి ఈ ఇమంబర భవనం లో కనిపిస్తుంది. ఈ భవనం యొక్క అంతర్భాగాలని అందంగా తీర్చి దిద్దిన ఘనత మిర్గుండ్ కి చెందినా అస్గర్ అలీ కి చెందుతుంది. 1924 లో ఆగా సయ్యద్ సాహిబ్ ఈ భవనాన్ని కాగితపు గుజ్జు ఉపయోగించి విస్తరణ చేసాడు. ఆ తరువాత ఆగ సయ్యద్ యూసఫ్, అల్-మొసావి అల్ సఫ్వి మరియు అంజుమన్-ఎ-షారి షియాన్ లు 1955 లో ఈ భవనాన్ని మరింత విస్తరింపచేసారు.
అష్టముఖాకృతి కలిగిన ఆకారంలో ఉన్న ఈ నిర్మాణానికి అయిదు ప్రవేశ ద్వారాలు కలవు. ప్రతి ప్రవేశ ద్వారం 12 అడుగుల వెడల్పు కలిగి ఉండగా వీటిలో ఒక ప్రవేశ ద్వారం మాత్రం కేవలం స్త్రీల కోసం మాత్రమే. ఆగ సయ్యద్ యూసఫ్ అల-మోసవి అల్ సఫ్వి చేత ఇమంబర కి దగ్గర లో నిర్మించబడిన ఈ మసీదు ని పర్యాటకులు సందర్శిస్తారు.



Click it and Unblock the Notifications