గొప్పదైన చారిత్రక ప్రాముఖ్యత కలిగిన తోసా మైదాన్ పచ్చని చెట్లు కలిగి ఉంటుంది. 4.8 కిలోమీటర్ల పొడవు 2.4 కిలోమీటర్ల వెడల్పు కలిగిన ఈ ప్రాంతం, ఈ ప్రాంతం లో నే అతి పెద్దదైన పచ్చిక బయళ్ళు కలిగినది. హిమాలయన్ శ్రేణి లో ఉన్న ఈ ప్రాంతం దట్టమైన అడవులతో చుట్టబడి ఉంది. ఈ పాశ్చర్ ని పూంచ్ లోయకి చేరే దారిలో మొఘలులు ఉపయోగించేవారని నమ్మకం. ఏడు అంతస్తుల మేడ 'దం దం' ని వారే నిర్మించారని అంటారు. బస్మై గాలి పాస్, తోసా మైదాన్ కి తీసుకువెళుతుంది. జాఖోర, నక్వవేర్ పాల్, పెహజన్ మరియు ద్రంగ్ వంటి కొన్ని గ్రామాలు దాటడం ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications