84స్తంభాల ఆధారం మీద నిర్మించబడిన ప్రవేశ ద్వారం చౌరాసి ఖమ్భోన్ కీ ఛత్రీ. దీన్ని 1740 లో దేవా అనే దాది అందించిన సేవలకు గుర్తుగా రావ్ అనిరుద్ద్ సింగ్ నిర్మించాడు. ఎత్తైన వేదిక పై రెండు అంతస్తుల తో ఈ కట్టడం నిర్మించబడింది. ఈ ప్రవేశద్వారాన్ని ప్రార్ధనా స్థలం గా కూడా భావిస్తారు – మరో వంక గౌరవ చిహ్నం గా కూడా పని చేస్తుంది.ఈ నిర్మాణపు లోపలి స్తంభాలన్నిటి పై 17వ శతాబ్దపు రాజపుత్ర రాజుల జీవనశైలిని వర్ణించే చిత్రాలను చెక్కారు. ఈ నిర్మాణం ఆధారంలో వివిధ జంతువుల చిత్రాలు వుండగా, రెండో అంతస్థులో గుండ్రంగా వుండే పెద్ద పైకప్పు వుండి, నాలుగు మూలలా చిన్న గోపురాలతో చుట్టబడి వుంది.



Click it and Unblock the Notifications