బావరీలుగా పిలువబడే దిగుడు బావులు బుండీ లో చాలా ప్రసిద్ది పొందాయి. బుండి సందర్శించే యాత్రికులు ఒక్కసారైనా వీటిని చూడాలి. ఈ దిగుడు బావులు వేసవి కాలంలో నీటి ఎద్దడి ఉన్నపుడు నీరు నిల్వచేసేందుకు ఉపయోగపడేవి. బుండీ లో దాదాపు 50 దిగుడు బావులు ఉండేవి, కానీ కాలక్రమంలో అవి శిధిలమై పోయాయి. రాణీజీ కీ బావరి, నగర్ సాగర్ కుండ్, నవల్ సాగర్ బుండీ లోని కొన్ని ప్రసిద్ధ దిగుడు బావులు. ఈ బావుల నుంచి నీరు తోడడం స్త్రీలకు ఒక ప్రత్యెక వేడుకలా వుండేది. అద్భుతంగా చెక్కిన ఈ నిర్మాణాలను సందర్శించేటప్పుడు వారు మంచి బట్టలు వేసుకుని వచ్చే వారు.



Click it and Unblock the Notifications