మ్యూజియంలు, చిఖల్ దార

చిఖల్ దారా లో రెండు మ్యూజియంలు కలవు. వాటి పేర్లు మహారాష్ట్ర ఫారెస్ట్ రేంజర్స్ కాలేజి మరియు మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్ర ఫారెస్ట్ రేంజర్స్ కాలేజీ లో వివిధ రకాల జంతువుల, వృక్షజాతుల నమూనాలు పర్యాటకులు చూచేందుకు లభ్యంగా కలవు. అరుదైన, అంతరించిపోతున్న శిలాజాలాలను కూడా చూడవచ్చు. తరిగిపోతున్న పులుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని మేల్ఘాట్ టైగర్ ప్రాజెక్టు స్ధాపించబడింది. ఇది గుగామహల్ నేషనల్ పార్క్ లో భాగంగా ఉంటుంది. యోగా ట్రైనింగ్ సెంటర్ కు సమీపంలో కలదు. 

Please Wait while comments are loading...