కూర్గ్ లో సోంవార్ పేట ఒక పంచాయతి సోంవార్ పేట తాలూకాలో ప్రధాన పట్టణం. దీని చుట్టు పక్కల కల పుష్పగిరి హిల్స్, కోటి బెట్ట, మక్కలగూడి బెట్ట ప్రధానమైన పర్యాటక ప్రదేశాలు. సోంవార్ పేటకు 6 కి.మీ.ల దూరంలో కల పుష్పగిరి కూర్గ్ లో రెండవ ఎత్తైన శిఖరం. ట్రెక్కింగ్ చేయాలనుకుంటే భబతి నుండి చేయాలి. దూరం 10 కి.మీ.లు. కోటిబెట్ల మూడవ ఎత్తైన శిఖరం. బేస్ నుండి 10 కి.మీ.లు ఉంటుంది. కొండ శిఖరంపై శివాలయం కలదు. ఈ కొండలపై ట్రెక్కింగ్ కు ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. స్ధానిక గైడ్ అవసరం. మక్కనగుడి బెట్ట హారంగి రిజర్వాయర్ బ్యాక్ వాటర్స్ లో కలదు. ఇది వరి పొలాలకు, అటవులకు అందాలకు ప్రసిద్ధి. సోంవార పేటలో మలే మల్లేశ్వర బెట్ట మరో ప్రధాన ఆకర్షణ . ఇది సోంవార్ పేటకు 13 కి.మీ.ల దూరంలో కలదు. ఈ టవున్ లో మహా శివరాత్రి పండుగ వేడుకలు ఘనంగా చేస్తారు.



Click it and Unblock the Notifications