హిందువుల పవిత్ర స్ధలం. కావేరి నది పుటుక ఇక్కడ జరిగింది. సముద్ర మట్టానికి సుమారు 1276 అడుగుల ఎత్తున కలదు. ఇక్కడకల సరస్సులోకి ప్రవహిస్తుంది. సరస్సు నుండి భూ గర్భంలోకి ప్రవహించి కావేరి నదిగా ప్రవహిస్తుంది. ఇక్కడ నదిలో పుణ్య స్నానాలు చేస్తారు. సమీపంలో అగస్తేశ్వర దేవాలయం కలదు. తలకావేరీ నదిలో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని, బాధలు తీరతాయని హిందువులు భావిస్తారు. ఇక్కడి భాగమండల ప్రదేశంలో కావేరి, కనకే మరియు సుజ్యోతి అనే మూడు నదులు కలుస్తాయి. తలకావేరి నుండి భాగమండల 8 కి.మీ.ల దూరం. సమీపంలో గణపతి, సుబ్రమణ్య, విష్ణ దేవాలయాలు కలవు. వార్షిక జాతర ప్రతి ఏటా అక్టోబర్ లేదా నవంబర్ మాసాలలో జరుగుతుంది. ఆ సమయంలో నదీ ప్రవాహ వెల్లువలు చూసేందుకు యాత్రికులు అధిక సంఖ్యలో వస్తారు. దేవాలయాలలో వేలాది దీపాలను వెలిగిస్తారు.