కడలూర్ పోర్ట్ గా కూడా పిలిచే ఈ సముద్రపు రేవు గాడిలం, పరవనార్ నదులు సంగమించేచోట ఉంది. పురాతన కాలం నుండి కడలూర్ రేవు పట్టణంగా ఉంది. ఓడలు రేవునుండి ఒక మైలు దూరంలో లంగరు వేసి లైటర్ల సహాయంతో సరుకులను దించడం, ఎక్కించడం చేస్తాయి. నది ముఖద్వారం వద్ద ఉండే ఒక పట్టీని నీటి మట్టాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు, ఇది వర్షాకాలంలో 4 అడుగుల లోతులో, మిగిలిన సమయంలో 6 అడుగుల లోతులో ఉంటుంది. రేవు చుట్టూ ఉన్న ప్రాంతంలో ఖనిజ సంపద, ప్రత్యేకంగా లిగ్నైట్ ఉంది. సముద్ర రేవు దగ్గరలో కొన్ని నూనె మిల్లులు ఉన్నాయి.



Click it and Unblock the Notifications