పంచపుల, అనగా ఐదు వంతెనలు. ఇది డల్హౌసీ నుండి 3 కి.మీ. దూరంలో నెలకొని ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. గలగలా పారే వాగుల వల్ల ప్రాచుర్యం పొందిన పంచపుల, డల్హౌసీ మరియు బెలూన్ వంటి ప్రదేశాలకి ప్రధాన త్రాగు నీటి ఆధారం. ఈ వాగు, దయాకుండ్ యొక్క ఉత్తర దిశ నుండి ఉద్భవించి, ఒక అగాధం గుండా ప్రవహించి, తర్వాత పంచపులలో గల వివిధ నీటి వనరులలోకి చేరుతుంది. వాగులు కలిసే చోట, ప్రఖ్యాత విప్లవ నాయకుడు సర్దార్ అజిత్ సింగ్ జ్ఞాపకార్థం, పంచపుల అనే పేరుతో స్మారక చిహ్నం నిర్మించారు. పంచపుల మార్గంలో, ఔషధ గుణాలు కలిగి ఉన్నట్టుగా స్థానికులు విశ్వసించే సతధార అనే అందమైన జలపాతం కనిపిస్తుంది.



Click it and Unblock the Notifications