బ్రిటిష్ నిర్మాణ శైలిలో కట్టిన సెయింట్ జాన్ చర్చి, విక్టోరియన్ కాలం భవనాలకి ఒక చక్కని ఉదాహరణ. 1863 లో స్థాపించబడిన ఈ చర్చి, పట్టణం లోని పురాతన కట్టడాలలో ఒకటి కావటం వల్ల, విశిష్ట చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉంది. చర్చి యొక్క పునాది బ్రిటిష్ పాలన కాలంలో ప్రొటెస్టంట్ మిషనరీలు వేశారు. ఈ చర్చి పునరావృత సందర్శకులను కలిగి ఉంటుంది, వారిలో ముఖ్యంగా ఆదివారాలు నిర్వహించబడే నియమిత సేవల కోసం వచ్చేవారు ఎక్కువ. చర్చికి వెళ్లేవారు మాత్రమే కాకుండా,చరిత్ర ప్రేమికులు, ఆసక్తిగల పాఠకులు మరియు పర్యాటకులు కూడా ఈ స్థలాన్ని బాగా ఇష్టపడతారు.
సెయింట్ జాన్ చర్చిలో, భారీ పుస్తకాల సేకరణ మరియు డల్హౌసీ యొక్క చరిత్ర మరియు సంస్కృతి తెలిపే అరుదైన ఛాయాచిత్రాలకు నెలవైన పాత గ్రంథాలయం ఉంది. చర్చి అందమైన పరిసరాల, మధ్య ఉండటం, ఈ స్థలం ఆకర్షణను మరింత ఇనుమడింపజేస్తుంది. యాత్రికులు, డల్హౌసీ యొక్క ప్రధాన బస్టాండు నుండి 2 కి.మీ.ల దూరం ప్రయాణించాక, గాంధీ చౌక్ వద్ద నెలకొని ఉన్న సెయింట్ జాన్ చర్చిని చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications