భారత దేశపు గొప్ప సాంప్రదాయ కళా సాంస్కృతిక రూపాలను ప్రపంచానికి చాటి చెప్పే గవాక్షం కేంద్రీయ కుటీర పరిశ్రమల దుకాణం. 1952లో కొందరు దేశ భక్తుల చేత ఇది నిర్మించబడింది. ఈ దుకాణం జనపథ్ కి దగ్గరగా బాబా ఖరక్ సింగ్ మార్గ్ లో వుంది.
శిల్పాలు, చిత్రాలు, కళాకృతులు, లోహపు వస్తువులు, పరికరాలు, నగలు, హస్త కళాకృతులు, మూలికా ఉత్పత్తులు, చెక్క పని, కుమ్మరం, రాతి పని, పాల రాతి వస్తువులతో సహా దేశంలోని అన్ని మూలల నుంచి వచ్చే వివిధ కళాకృతుల పెద్ద సంకలనం ఈ దుకాణం లో వుంది.
ఇక్కడ ఉత్పత్తి అయ్యే సాధికార చేనేత, చేతి వృత్తులకు ప్రపంచ వ్యాప్తంగా ఈ దుకాణం ప్రసిద్ది చెంది౦ది. ఈ అందమైన కళాకృతులను తయారు చేసే లక్షలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తోందీ దుకాణం. ఈ ఉత్పత్తుల తయారీతో పాటు వాటి ప్రచారం, అమ్మకాల మీద కూడా దృష్టి సారించి తయారైన ఉత్పత్తులను ప్రపంచమంతటికీ సరసమైన ధరలలో సరఫరా చేస్తోంది. దీంతో పాటు ఉత్పత్తులను అందమైన కానుకలుగా తీర్చి దిద్దే వ్యవస్థను కూడా అభివృద్ది చేసారు.
ఇక్కడ ప్రదర్శించే ప్రతీ వస్తువు తనదైన ప్రత్యేకతను కలిగి వుంటుంది. ఈ ఉత్పత్తులకు ఘనమైన సంస్కృతి, జానపద గాధలు, సంప్రదాయాలు లేదా ప్రత్యెక నైపుణ్యాలు వున్నాయి. ఈ నేతపనివారు, కళాకారుల ఉత్పత్తులను చూసి మీరు అచ్చేరువొందుతారు
ఈ కేంద్రీయ కుటీర పరిశ్రమల దుకాణం ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతాలలో కూడా నడుస్తోంది. ఈ దుకాణాన్ని ప్రముఖులు, ప్రధాన మంత్రులు, రాష్ట్రాల ముఖ్య మంత్రులు, రాయబారుల లాంటి వారు సందర్శిస్తుంటారు.